Jump to content

ప్రదీప్ ఈశ్వర్

వికీపీడియా నుండి
ప్రదీప్ ఈశ్వర్
చిక్కబల్లాపూర్‌లో 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారంలో ప్రదీప్ ఈశ్వర్
కర్ణాటక శాసనసభ సభ్యుడు
Assumed office
2023
అంతకు ముందు వారుకె. సుధాకర్
తరువాత వారుప్రస్థుతం పదవిలోఉన్న వ్యక్తి
నియోజకవర్గంచిక్కబళ్లాపూర్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననంపెరేసంద్ర, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామినయన ఎం
సంతానంఒకరు
చదువు12 (పీయూసి)

ప్రదీప్ ఈశ్వర్ భారతీయ రాజకీయ నాయకుడు, ఆయన చిక్కబల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా కర్ణాటక శాసనసభ సభ్యుడుగా ఉన్నాడు.[1][2][3]

2023 అక్టోబరు 8న ప్రారంభమైన 10వ కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు.[4]

ఆయన పరిశ్రమ నీట్ అకాడమీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కూడా.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

చిక్కబళ్లాపూర్ జిల్లా పేరేసంద్ర గ్రామంలో 1985లో జన్మించిన అతను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. తరువాత, ఆయన తుమకూరులోని సిద్దగంగా మఠంలో పెరిగాడు. అక్కడే ఉన్న అనుబంధ విద్యా సంస్థలో ఆయన పాఠశాల విద్యను పూర్తిచేసాడు.

కొన్నాళ్ల తర్వాత చిక్కబళ్లాపూర్ వచ్చి అక్కడి పిల్లలకు చదువు చెప్పడంతో పాటు మరి కొన్ని చోట్ల ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అదే సమయంలో, స్థానిక మీడియాకు వ్యాఖ్యాతగా చేరిన ఆయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ షోను హోస్ట్ చేశాడు.[5]

కెరీర్

[మార్చు]

2018లో గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు బోధించే ప్రదీప్ ఈశ్వర్ పరిశ్రమ నీట్ అకాడమీ స్థాపించాడు.[6] జీవశాస్త్రం సబ్జెక్టును బోధించే ఆయన, ఇతర లెక్చరర్లతో కలిసి బెంగళూరులో ఈ నీట్ అకాడమీని నిర్వహిస్తున్నాడు.

ఓబీసీ బలిజ వర్గానికి చెందిన ప్రదీప్ ఈశ్వర్ 2016లో దేవనహళ్లి సమీపంలోని విజయపుర తాలూకాను కోరుతూ నిరసన చేపట్టాడు. కానీ అది విఫలమైంది. తర్వాత స్థానిక టీవీ ఛానెల్‌లో వ్యాఖ్యాతగా మారాడు.

2018లో తొలిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేవీ నవీన్‌కిరణ్‌ తరపున నిలిచాడు. అయితే ఆ ఎన్నికల్లో కె.సుధాకర్‌ విజయం సాధించాడు.

అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ పొందిన ప్రదీప్ ఈశ్వర్, గత పాలక ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న డా. కె.సుధాకర్ పై గెలిచి చిక్కబళ్లాపూర్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Election Commission of India". results.eci.gov.in. Retrieved 2023-05-14.
  2. "Coaching academy owner fielded by Congress stuns minister K Sudhakar". The Indian Express (in ఇంగ్లీష్). 2023-05-13. Retrieved 2023-05-14.
  3. "Pradeep Eshwar in Karnataka Assembly Elections 2023". News18 (in ఇంగ్లీష్). Retrieved 2023-05-14.
  4. "Mla Enters Bigg Boss,Bigg Boss: బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. తీవ్రంగా విమర్శించిన ప్రతిపక్షాలు, నెటిజన్లు - karnataka congress mla pradeep eshwar enters bigg boss kannada show - Samayam Telugu". web.archive.org. 2023-10-09. Archived from the original on 2023-10-09. Retrieved 2023-10-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. https://www.amazon.in/Life-beautiful-Pradeep-eshwar/dp/B078Z9VSCW
  6. https://udayavani.com/neet-brochure.pdf