Jump to content

ప్రఫుల్ల చాకి

వికీపీడియా నుండి
ప్రఫుల్ల చాకి
প্রফুল্ল চাকী
జననం(1888-12-10)1888 డిసెంబరు 10
మరణం1908 మే 1(1908-05-01) (వయసు 19)
Mokama Ghat Railway Station, Patna, Bihar, Bengal Presidency, British India
వృత్తిFreedom fighters of India
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Role in Indian freedom struggle
ఉద్యమంభారత స్వాతంత్ర్య ఉద్యమం

ప్రఫుల్ల చంద్ర చాకి (Prafulla Chandra Chaki) (బెంగాలీ: 1888 డిసెంబరు 10 - 1908 మే 1) భారత స్వాతంత్ర్యాన్ని పొందే మార్గంలో బ్రిటిష్ వలస అధికారులకు వ్యతిరేకంగా హత్యలు చేసిన విప్లవకారుల జుగంతర్ సంస్థలో ఉన్న ఒక భారతీయ విప్లవకారుడు, జాతీయ వాది.

బాల్యం

[మార్చు]

ప్రఫుల్ల చాకి 1888 డిసెంబరు 10 న బోగ్రా జిల్లాలోని బీహార్ గ్రామములో మధ్యతరగతి హిందూ కాయస్థ కుటుంబానికి చెందినవాడు. ప్రఫుల్ల తండ్రి రాజ్ నారాయణ్, తల్లి స్వర్ణమోయిల. తండ్రి బోగ్రా నవాబు కుటుంబములో ఉద్యోగి, ప్రఫుల్ల పసిబిడ్డగా ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. ప్రఫుల్ల చాకి, తన ప్రాథమిక విద్యను ఊరిలో ఉన్న పాఠశాలలో పూర్తి చేసి, 1904 లో రంగపూర్ జిల్లా పాఠశాలలో చేరినాడు. అక్కడ అతను శారీరక వ్యాయామం, సామాజిక-సాంస్కృతిక కార్యకలాపాల కోసం ఉన్న స్థానిక సంస్థ "బంధబ్ సమితి"లో చేరాడు. తొమ్మిదో తరగతిలో చదువుతున్న ప్రఫుల్ల తూర్పు బెంగాల్, అస్సాం ప్రభుత్వాల కార్లిస్లే సర్క్యులర్ను ఉల్లంఘించే విద్యార్థుల ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు అతనిని పాఠశాల నుండి బహిష్కరించారు. తరువాత రంగపూర్ జాతీయ పాఠశాలలో చేరి జితేంద్రనారాయణ్ రాయ్, అభినాష్ చక్రవర్తి, ఇషాన్ చంద్ర చక్రవర్తి వంటి విప్లవకారులతో పరిచయం ఏర్పడి విప్లవకారుడుగా మారినాడు.[1]

విప్లవాత్మక చర్యలు

[మార్చు]

ప్రఫుల్ల రంగ పూర్ లో ఉన్నప్పుడు, జుగంతర్ బెంగాలీ వారపత్రిక వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన బారిన్ ఘోష్ ను కలిశాడు. ఘోష్ ప్రఫుల్ల చాకిని కలకత్తాకు తీసుక పోవడం, అక్కడ జుగంతర్ బృందంలో చేరాడు. తూర్పు బెంగాల్, అస్సాం కొత్త ప్రావిన్సులకు తొలి లెఫ్టినెంట్ గవర్నరుగా పనిచేసిన సర్ జోసెఫ్ బాంఫిల్డే ఫుల్లర్ (1854-1935) ను కాల్చిచంపడం ప్రఫుల్లాకు మొదటి లక్ష్యంగా ఇచ్చారు. అయితే సర్ జోసెఫ్ ప్రయాణంలో చివరి నిమిషంలో మార్పు ఉండటంతో ఈ ప్రణాళిక కార్యరూపం జరగలేదు. తరువాత  ప్రఫుల్లాకు  బీహార్ లోని ముజఫర్ పూర్ మేజిస్ట్రేట్ కింగ్స్ ఫోర్డ్ ను హతమార్చడానికి ఆయనను, ఖుదీరామ్ బోస్ ను ఎంపిక చేయడం జరిగింది.  కింగ్స్ ఫోర్డ్ ఇంతకు ముందు బెంగాల్  కలకత్తా చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ గా  పనిచేసినప్పుడు, అక్కడ  రాజకీయ కార్యకర్తలపై, ముఖ్యంగా యువకులపై కఠినమైన, క్రూరమైన శిక్షలు విధించేవాడు. కింగ్స్ ఫోర్డ్ విప్లవ సంస్థల నిర్మూలన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కింగ్స్ ఫోర్డ్ ను చంపడానికి ప్రఫుల్ల, బోస్ లను పంపడం జరిగింది. ప్రఫుల్లా, బోస్ లను ముజఫర్ పూర్ (బీహార్) కు వెళ్ళి దీనిని అమలు చేయాలనుకున్నారు. ఈ ఆపరేషన్ కోసమే ప్రఫుల్లాకు 'దినేష్ చంద్ర రాయ్' అని పేరు పెట్టడం జరిగింది.[2]

ముజఫర్ పూర్ సంఘటన

[మార్చు]

ప్రఫుల్లా చాకి, ఖుదిరామ్ బోస్, 1908 ఏప్రిల్ 30 రోజు ముజఫర్ పూర్ బాంబు కేసు అనే దానిని చేపట్టడడం జరిగింది, వారి ప్రణాళికలో ఆ రోజు కింగ్స్ఫోర్డ్ వాహన రాకను  ఊహించి యూరోపియన్ క్లబ్ గేట్ల వద్ద బాంబులతో వేచి ఉన్నారు. అది రాగానే బాంబు విసిరి, బండిని ఛిన్నాభిన్నం చేశారు, అయితే ఈ వాహనంలో కింగ్స్ ఫోర్డ్ లేదు ఇతనికి బదులుగా, ముజఫర్ పూర్ న్యాయవాది గా ఉన్న ప్రింగిల్ కెన్నెడీ భార్య, అందులో ప్రయాణిస్తున్నారు. కెన్నెడీ భార్య, కుమార్తెను పొరబాటున  ఈ బాంబు దాడిలో మృతి చెందడం జరిగింది. వెంటనే ఖుదీరామ్ ను పోలీసులకు దొరకడం, విచారణలో ఖుదీరామ్ మరణించాడు.   ప్రఫుల్ల అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో, పోలీసులకు పట్టుబడే ముందు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Chaki, Prafulla - Banglapedia". en.banglapedia.org. Retrieved 2022-04-01.
  2. "PRAFULLA CHANDRA CHAKI". INDIAN CULTURE (in ఇంగ్లీష్). Retrieved 2022-04-01.
  3. "Khudiram Bose: Why did Judge Douglas Kingsford become a target of him? how he was caught? all you need to know about Muzaffarpur conspiracy case". APN News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-03. Archived from the original on 2021-12-03. Retrieved 2022-04-01.