ప్రభాకర్ మోర్
ప్రభాకర్ సుందర్‌రావు మోర్ | |||
పదవీ కాలం 1990 – 2004 | |||
ముందు | శాంతారామ్ ఫిల్సే | ||
---|---|---|---|
తరువాత | మాణిక్ జగ్తాప్ | ||
నియోజకవర్గం | మహద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1944 తమ్హాని గ్రామం, మహద్, మహారాష్ట్ర | ||
మరణం | 2019 సెప్టెంబర్ 14 ముంబై | ||
జాతీయత | భారతీయుడు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ప్రభాకర్ మోర్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహద్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గ్రామీణాభివృద్ధి & హోం వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ప్రభాకర్ మోర్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మహద్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత 1995,[2] 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరుసగా మూడోసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై[3] గ్రామీణాభివృద్ధి & హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా, రాయిగఢ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పని చేశాడు.
మరణం
[మార్చు]ప్రభాకర్ మోర్ వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2019 సెప్టెంబర్ 14న మరణించాడు. ఆయనకు భార్య, కుమారుడు అమిత్, కుమార్తెలు ఉన్నారు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "माजी गृहराज्यमंत्री प्रभाकर मोरे यांचे वृध्दापकाळाने निधन". ETV Bharat News. 14 September 2019. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.
- ↑ "माजी मंत्री प्रभाकर मोरे यांचे निधन". Lokmat. 15 September 2019. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.