Jump to content

మాణిక్ జగ్తాప్

వికీపీడియా నుండి
మాణిక్‌రావు జగ్‌తాప్‌

పదవీ కాలం
2004 – 2009
ముందు ప్రభాకర్ మోర్
తరువాత భరత్‌షేట్ గోగావాలే
నియోజకవర్గం మహద్

వ్యక్తిగత వివరాలు

జననం 1967
మహారాష్ట్ర
మరణం 26 జూలై 2021
ముంబై
జాతీయత  భారతీయుడు
సంతానం స్నేహల్
వృత్తి రాజకీయ నాయకుడు

మాణిక్‌రావు మోతిరామ్ జగ్‌తాప్‌ (జననం 1967) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మహద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మాణిక్‌రావ్ జగ్‌తాప్ అనంతరం రాయిగఢ్ జిల్లా అధ్యక్షుడిగా, మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మాణిక్‌రావు జగ్‌తాప్‌ ఎన్‌ఎస్‌యూఐ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అనంతరం యువజన కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పని చేసి 1999లో శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మహద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి ప్రభాకర్ మోర్‌పై 3779 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మహద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి భరత్‌షేట్ గోగావాలే చేతిలో 14050 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మాణిక్‌రావు జగ్‌తాప్‌ 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మహద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి భరత్‌షేట్ గోగావాలే చేతిలో 21256 ఓట్లు, 2019 ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి భరత్‌షేట్ గోగావాలే చేతిలో 21575 ఓట్ల తేడాతో వరుసగా ఓడిపోయాడు.[1]

మరణం

[మార్చు]

మాణిక్ మోతీరామ్ జగ్తాప్ కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2021 జూలై 26న మరణించాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "Mahad Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.
  2. "Former Maharashtra Congress MLA Manikrao Jagtap dies". The Times of India. 26 July 2021. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.
  3. "महाडचे माजी आमदार माणिकराव जगताप यांचे निधन" (in మరాఠీ). TV9 Marathi. 26 July 2021. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.
  4. "Manikrao Jagtap : महाडचे माजी आमदार माणिकराव जगताप यांचं कोरोनामुळं निधन" (in మరాఠీ). 26 July 2021. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.