ప్రభుత్వ కళాశాల (రాజమహేంద్రవరం)
రకం | Public |
---|---|
స్థాపితం | 1853 |
అనుబంధ సంస్థ | ఆదికవి నన్నయ యూనివర్సిటీ |
ప్రధానాధ్యాపకుడు | Rapaka David Kumar Swamy |
స్థానం | రాజమహేంద్రవరం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
ప్రభుత్వ కళాశాల (రాజమహేంద్రవరం) 1857లో స్థాపించబడింది.[1] దీనికి మొదటి ప్రిన్సిపాల్ గా "మెట్కాఫ్" అనే ఆంగ్లేయుడు పనిచేశాడు. ఈ కళాశాల తూర్పు కోస్తాలో ప్రభుత్వ రంగంలో ఉన్న కళాశాలలన్నిటిలోఅతి పురాతనమైనది. ఈయన పేరుతోనే విద్యార్థుల వసతి గృహం (మెట్కాఫ్ హాస్టల్) ఇప్పటికీ నడుస్తున్నది. అడివి బాపిరాజు ఇక్కడ చదువుకున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇక్కడ ఈ కళాశాలలో ముఖ్యాధ్యాపకులుగా పనిచేశాడు.
2011 నుండి నన్నయ విశ్వవిద్యాలయంలో అంతర్భాగంగా ఉంది.
చరిత్ర
[మార్చు]1853లో జిల్లా పాఠశాలగా ప్రారంభించబడింది. తరువాత 1868లో మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన ప్రాంతీయ పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయబడింది. 1885లో కళాశాలగా చేయబడింది.1891లో మద్రాసు విశ్వవిద్యాలయానికి తరువాత 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. 1955లో డిగ్రీ, 1976లో పీజీ కోర్సులు ప్రారంభమయ్యాయి.1876-77లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. 1916 -19లో తొలి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ తత్వశాస్త్రవేత్తగా విద్యాబోధన చేశారు. 1999లో అప్పటి ప్రిన్సిపాల్ మోజెస్ ఆధ్వర్యంలో తొలి యూజీసీ సెమినార్ జరిగింది. ప్రస్తుతం 18 ఎకరాలలో 85 పైగా తరగతులతో 24 రకాల పైగా కోర్సులతో 3,360 మంది డిగ్రీ, పీజీ కోర్సులు అభ్యసిస్తున్నారు.[2]
కళాశాల పూర్వ విద్యార్థులు
[మార్చు]- టంగుటూరి ప్రకాశం పంతులు-ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి
- అడవి బాపి రాజు-కళాకారుడు
- కె.వి.రెడ్డి నాయుడు - 1936లో మద్రాసు ప్రెసిడెన్సీకి తాత్కాలిక గవర్నర్
- వరాహగిరి జోగయ్య పంతులు -(భారత మాజీ రాష్ట్రపతి డా.వి.వి.గిరి తండ్రి)
- VK కృష్ణ మీనన్ - రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో మాజీ విదేశాంగ మంత్రి
- పి.ఎస్.రావు - కేరళ మాజీ గవర్నర్, పద్మభూషణ్ అవార్డు
- కోకా సుబ్బారావు - సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
- భమిడిపాటి కామేశ్వరరావు - హాస్యరచయిత.
- కవికొండల వెంకటరావు- ప్రముఖ గేయ రచయిత
- ఎం. నరసింహం పంతులు - రిటైర్డ్ కలెక్టర్ & మద్రాసు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు
- డా. సూరి భగవంతం - భౌతిక శాస్త్రవేత్త
- సి.వెంకట చలం పంతులు – బార్ కౌన్సిల్ 1వ ఆంధ్ర సభ్యుడు
- డి.శేషగిరిరావు పంతులు – చైర్మన్, కాకినాడ మున్సిపాలిటీ,
- ఎ.వి.ఎస్.కృష్ణారావు – కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధి.
మూలాలు
[మార్చు]- ↑ "Government College (Autonomous) Rajahmundry". Archived from the original on 2021-11-10. Retrieved 2021-11-10.
- ↑ "నంబర్ వన్ కాలేజ్". సాక్షి. 2017.