ప్రవీణ
ప్రవీణ | |
---|---|
జాతీయత | భారతీయురాలు |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1992–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సంతోష్ ఎం. నాయర్ |
ప్రవీణ భారతీయ నటి, డబ్బింగ్ కళాకారిణి. ఆమె ప్రధానంగా మలయాళ టెలివిజన్ ధారావాహికలు, చిత్రాలతో పాటు కొన్ని తమిళ సిరీస్‌లు, చిత్రాలలో నటిస్తుంది. ఆమె ప్రసిద్ధ ధారావాహిక దేవి మహాత్మ్యంలో దుర్గ దేవి అమ్మవారు పాత్రను పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.[1][2]
ఆమె తన నటనా జీవితాన్ని 1992 చిత్రం గౌరితో ప్రారంభించింది.[3] 1998లో అగ్నిసాక్షి, 2008లో ఒరు పెన్నుమ్ రాందానుమ్ చిత్రాలలో ఆమె నటనకుగానూ ఆమె రెండవ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుతో సహా పలు ప్రశంసలు అందుకుంది.[4][5][6] ఆమె 2010లో ఎలెక్ట్రా[7], 2012లో ఇవాన్ మేఘరూపన్[8] చిత్రాలకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకుంది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]రామచంద్రన్ నాయర్, లలితాబాయి దంపతులకు ప్రవీణ జన్మించింది. ఆమె తండ్రి రిటైర్డ్ కాలేజీ ప్రొఫెసర్. ఆమెకు ఒక అన్నయ్య ప్రమోద్ నాయర్ ఉన్నాడు. ఆమె కేరళలో వ్యాపారవేత్త అయిన సంతోష్ ఎం. నాయర్‌ని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత, ఆమె కొంత కాలం సినిమాలకు విరామం తీసుకుంది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.[9]
గుర్తింపు
[మార్చు]- కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు
- 1998 – రెండవ ఉత్తమ నటి – అగ్నిసాక్షి
- 2008 – రెండవ ఉత్తమ నటి – ఒరు పెన్నుమ్ రాందానుమ్
- 2010 – ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ – ఎలెక్ట్రా
- 2011 – ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ – ఇవాన్ మేఘరూపన్
- ఆసియానెట్ టెలివిజన్ అవార్డులు
- 2005 – ఉత్తమ నటి – మేఘమ్
- 2011 – అత్యంత ప్రజాదరణ పొందిన నటి – దేవీమహాత్మ్యం
- 2018 – ఉత్తమ పాత్ర నటి- కస్తూరిమాన్
- కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు
- 1999 – ఉత్తమ నటి – వాసంతియుమ్ లక్ష్మియుం పిన్నె జ్ఞానుమ్
- 2007 – ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ – నవల
- సన్ కుటుంబం విరుత్తుగల్
- 2018 -ఉత్తమ తల్లిగా సన్ కుటుంబం విరుత్తుగల్ -ప్రియమానవల్
- 2023-ఉత్తమ మామియార్- ఇనియా - సన్ కుటుంబం విరుత్తుగల్
ఫిల్మోగ్రఫీ
[మార్చు]తెలుగు సినిమాలు
సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
2020 | భీష్మ | భీష్మ తల్లి |
2023 | సార్ | బాల తల్లి |
వెబ్ సిరీస్
సంవత్సరం | ధారావాహిక | పాత్ర | భాష | ఛానల్ |
---|---|---|---|---|
2021 | పరంపర | కమల | తెలుగు | డిస్నీ+ హాట్‌స్టార్ |
2022 | పరంపర సీజన్ 2 |
మూలాలు
[మార్చు]- ↑ Ur, Arya. "I would love to play Adhiparashakthi again: Praveena – Times of India". The Times of India.
- ↑ പ്രവീണ സീരിയല് അഭിനയം നിര്ത്തിയതിനു പിന്നില്? – Mangalam Retrieved 24 August 2013
- ↑ M, Athira (3 January 2018). "I need a break from intense roles: Praveena – The Hindu". The Hindu.
- ↑ "Kerala State Film Awards (Page 3)". Government of Kerala. Archived from the original on 3 March 2016. Retrieved 24 August 2012.
- ↑ "Kerala State Film Awards (Page 4)". Government of Kerala. Archived from the original on 7 July 2015. Retrieved 24 August 2012.
- ↑ "Five awards for Adoor's Oru Pennum Randanum". The Hindu. 4 June 2009. Archived from the original on 7 June 2009. Retrieved 4 June 2009.
- ↑ Pavithra Srinivasan (5 January 2011). "Praveena conquers Tamil TV". Rediff.com. Retrieved 20 July 2011.
- ↑ "Dileep, Shwetha make the cut". The Hindu. Chennai, India. 20 July 2012.
- ↑ Praveena (9 August 2012). "Actress Praveena"-On record 9, August 2012 Part 1. On Record. Interviewed by TN Gopakumar. Asianet News. Event occurs at [time needed]. Retrieved 12 December 2013 – via YouTube.
- మలయాళ సినిమా నటీమణులు
- భారతీయ సినిమా నటీమణులు
- కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు విజేతలు
- మలయాళ టెలివిజన్ నటీమణులు
- భారతీయ టెలివిజన్ నటీమణులు
- భారతీయ గాత్ర నటీమణులు
- తమిళ సినిమా నటీమణులు
- తమిళ టెలివిజన్ నటీమణులు
- తెలుగు సినిమా నటీమణులు
- తెలుగు టెలివిజన్ నటీమణులు
- Wikipedia articles needing time reference citations from January 2023