ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాకతీయ ప్రతాపరుద్రుడు ముహమ్మదీయుల చేతిలో ఓడిపోయిన తరువాత అతని సోదరుడు అన్నమదేవుడు ఇంద్రావతి నది తీరానికి పారిపోయి అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఆ రాజ్యమే బస్తర్ ప్రాంతం. అతని వంశస్తులే బ్రిటిష్ ప్రభుత్వం కింద బస్తర్ సంస్థానాధీశులుగా పనిచేశారు. బస్తర్ రాజ వంశస్తులలో ఒకరైన ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్ (Pravir Chandra Bhanj Deo 25 June 1929 - 25 March 1966) [1] భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన పోరాడిన వీరుడు.

బస్తర్ కాకతీయ సామ్రాజ్యము

కాకతీయ సామ్రాజ్యము
1323–1947
స్థాయిసామ్రాజ్యము
రాజధానిజగదల్‌పుర్ (ఛత్తీస్‌గఢ్)
సామాన్య భాషలుహిందీ
ప్రభుత్వంరాజరికము
చక్రవర్తి 
చరిత్ర 
• స్థాపన
1323
• పతనం
1947

తల్లిదండ్రులు కుటుంబం[మార్చు]

రాజా ప్రవీర్ చంద్ర తల్లిగారు ప్రఫుల్లకుమారి దేవి ఆమె బస్తర్ మహారాజు రుద్రప్రతాపదేవ్కు ఏకైక పుత్రిక. రాణీ రుద్రమదేవి లాగా 1921లో రాజుగారు మరణించగానే ఆమె సింహాసనాన్ని అధిష్టించి మహారాణి అయ్యింది. రాజా ప్రవీర్ చంద్ర తండ్రిగారు ఒరిస్సాలోని మయూర్ బంజ్ సంస్థానాధీశుడి దగ్గరి బంధువైన ప్రపుల్లకుమార్ బంజ్ దేవ్ ఆయన బస్తర్ కు ఇల్లరికపు అల్లుడిగా వచ్చాడు. వారికి 1929లో ప్రవీర్ చంద్ర జన్మించాడు. ఆ తర్వాత ఆడపిల్ల కమల కుమారి ఆ తర్వాత ఆఖరి మగపిల్లవాడు విజయ చంద్ర బంజ్ దేవ్ 1934 లో జన్మించారు. మహారాణి ప్రపుల్ల కుమారి ప్రపుల్లకుమార్ ఇద్దరూ విద్యాధికులే, వీరు ఇంగ్లండులో ఎం.ఏ చదువుకున్నారు. ప్రఫుల్ల కుమార్ మొదటి నుంచి ప్రజాస్వామ్య వాది భారతదేశానికి స్వాంతంత్య్రం రావాలని కోరుకున్నాడు. అప్పట్లో లండన్ లోని వి.కె. కృష్ణ మీనన్ ఆధ్యర్యంలో డిచే ఇండియాలీగ్ అనే సంస్థలో చురుకైన సభ్యునిగా పనిచేసాడు.

విద్యాభ్యాసం[మార్చు]

ప్రవీర్ చంద్ర రాయ్ పూర్ లోని రాజ్ కుమార్ కళాశాలలో విద్యాభ్యాసం చేసాడు.

భాద్యతల స్వీకరణ[మార్చు]

మహారాణి ప్రఫుల్ల కుమారి దేవి 1936లో ఇంగ్లాండులోనే హటాత్తుగా అపెండిసైటిస్ సమస్యతో మరణించింది. అప్పటికి ఏడు సంవత్సరాల వయస్సున్న ఆమె పెద్దకొడుకు ప్రవీర్ చంద్రను 1936 అక్టోబరు 28న నామమాత్రపు రాజుగా ప్రకటించారు. కానీ నిజమైన అధికారాలన్నీ బ్రిటీష్ వారు నియమించిన పొలిటికల్ ఏజెంట్ కు సంక్రమింపజేసారు.

చెల్లి తమ్ముడి సంరక్షణ[మార్చు]

తల్లిలేని తన చెల్లి తమ్ముడికి అన్నగా ప్రవీర్ చంద్ర ఆలనా పాలనా చూసుకున్నాడు. వారి విద్య శిక్షణలకోసం గిబ్బన్ అనే గార్డియన్ ను నియమించాడు. కానీ వాడు మహా కఠినుడు క్రమశిక్షణ పేరుతో వారి వ్యక్తిత్వ వికాసాలను నాశనం చేసి వారిని మందబుద్ధులుగా చేయడమే లక్ష్యంగా పనిచేసేవాడు.

వివాహం[మార్చు]

ఈయన వివాహం 1961 జూలై 4 లో జరిగింది. 1930లో జన్మించిన మహారాణి పఠాన్ రాజవంశపు రావు సాహెబ్ ఉదయ సింగ్ గారి కుమార్తె అయిన శుభరాజ కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమె 1996 సెప్టెంబరు 11లో మరణించారు.

నిజమైన అధికారం[మార్చు]

ప్రవీర్ చంద్రకు 18 సంవత్సరాలు నిండి మైనారిటీ తీరగానే అన్ని నిజమైన అధికారాలతో జూలై 1947 లో రాజుగా ప్రకటించారు కానీ అది కూడా మూణ్ణాళ్ళ ముచ్చటే అయ్యింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి కాంగ్రెసు అధికారం లోకి రాగానే 1948 బస్తర్ సంస్థానాన్ని దేశంలోిని ఇతర సంస్థానాలతో కలిపి ఇండియన్ యూనియన్ లో విలీనం చేసుకున్నారు. ప్రవీర్ చంద్రదేవ్ కు రాజా అన్న బిరుదుతో పాటు రాజభరణాన్ని ఇతర సౌకర్యాలను మాత్రం అందజేసారు. 1953లో సంస్థానానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వాటి విడుదల కోసం కోర్టుల చుట్టూ తిరిగాడు.

రాజకీయ పార్టీ స్థాపన[మార్చు]

1953లో ప్రవీర్ చంద్ర బస్తర్ జిల్లా ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సేవా సంఘ్ అని ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. ఆదివాసీ ప్రజల ఆర్థిక సామాజిక దోపిడీని అరికట్టి వారి సంపూర్ణ అభివృద్ధి సాధించడమే ఆ పార్టీ లక్ష్యాలుగా నిర్ధిేశించుకున్నాడు. 1957లో బస్తర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కానీ రెండేళ్ళ తర్వాత తన పదవికి రాజీనామా చేసాడు.

ఆదివాసీల ఆరాధ్యుడు[మార్చు]

సహజంగా దొరలు, సంస్థానాధిపతులు అంటే ప్రజలనుంచి పన్నులు వసూలు చేసుకుని తమ భోగభాగ్యాలను కాపాడుకునే వారుగానూ, అధికారానికి తొత్తులుగానూ వుండటాన్ని గమనిస్తాం, కానీ ప్రవీర్ చంద్ర అందుకు విరుద్ధంగా ప్రజలలో ఒక్కడై వారి సమస్యలలో మమేకమై ఆదివాసీల హక్కుల కోసం వారితరపున వారిలో ఒకడిగా పోరాడాడు. సహజవనరులను దోచుకుంటున్న రాజకీయ నాయకత్వాలకు పక్కలో బల్లెంలా అడ్డుకున్నాడు. అవినీతిపై పోరాడాడు, భూసంస్కరణలకోసం ఉద్యమించాడు. ఇటువంటి కారణాలతో అప్పటి అధికార పక్షానికి పూర్తి స్థాయి శత్రువుగా పరిగణించబడినాడు. కానీ ఆదివాసులకు మాత్రం ఆరాధ్య దైవంగా కొలువులు అందుకున్నాడు.

జైలు జీవితం[మార్చు]

ఆయనను కాంగ్రెస్ పార్టీ రాజకీయ శత్రువుగా చూసేది. బ్రిటీష్ ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అతనికి వ్యతిరేఖంగా కేసులను బనాయించింది. ఆర్థిక నేరాల ఆరోపణలపై 1961లో అతడిని అరెస్టు చేసారు. కొంత కాలం జైలులో కూడా వుంచారు. ఆతర్వాత అతని ‘రాజా’ అన్న బిరుదును తొలగించి అతని తమ్ముడు విజయ చంద్ర బంజ్ దేవ్ కు దానిని సంక్రమింపజేసారు. అధికార వ్యవహారాలలో అతనినే సంప్రదిస్తూ విభజించి పాలించు సూత్రాన్ని వీరు కూడా అమలులో పెట్టారు.

బస్తర్ రాజులు[మార్చు]

మరణం[మార్చు]

1947 వరకు రాజుగా ఉన్న ప్రవీర్ చంద్రభంజ్ కాకతీయను 1966లో భారతప్రభుత్వం కాల్చిచంపింది. బస్తర్ జిల్లాలో వలసవాదుల భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా 1966లో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. దీనికి ప్రవీర్ చంద్రభంజ్‌దేవ్ నేతృత్వం వహించారు. గిరిజనులను ఏకంచేసి పోరాడారు. కానీ తిరుగుబాటును భారతప్రభుత్వం అణిచివేసింది. 1966 మార్చి 25న పోలీస్‌చర్యలో భాగంగా ఆయనను బంధించి జగదేవ్‌పూర్ ప్యాలెస్ మెట్లపైనే కాల్చిచంపింది ప్రభుత్వం. </ref>[2] "General Elections of MP 1957" (PDF). Election Commission Of India. 2004. Archived from the original (PDF) on 2013-01-27. Retrieved 2016-07-04.

మూలాలు[మార్చు]

  1. I praveer the god of Adivasis.
  2. The Hindu Story re Pravir Chandra's great-nephew