ప్రసిద్ధ సమర్రా మస్జిద్
Appearance
ప్రసిద్ధ సమర్రా మసీదు | |
---|---|
ప్రదేశం | సమర్రా, ఇరాక్ |
భౌగోళికాంశాలు | 34°12′21″N 43°52′47″E / 34.20583°N 43.87972°E |
స్థాపితం | 848 |
ప్రసిద్ధ సమర్రా మసీదు లేదా గ్రేట్ మాస్క్ ఆఫ్ సమర్రా ఇరాక్ దేశంలో ఉన్న ఒక అద్భుత మసీదు. ఈ కట్టడాన్ని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ కట్టడం గా ప్రకటించారు.
విశేశాలు
[మార్చు]- దూరం నుంచి చూడ్డానికి భారీ స్తంభంలా కనిపిస్తుంది. దగ్గరికెళ్లి చూస్తే మెలికలు తిరిగిన మేడలా నిర్మాణం ఎంతో అబ్బురపరుస్తుంది. ఇక పైకెళితే కానీ తెలీదు అదో మసీదు అని.
- దీనిని 9వ శతాబ్దంలో నిర్మించారు. అప్పటి పాలకుడు అబ్బాసిద్ కలీఫ్ ఆల్ ముతవక్కీ హయాంలో కట్టించారు. క్రీ||శ 848లో మసీదు నిర్మాణం మొదలెడితే 851లో పూర్తయ్యింది. అప్పట్లో ప్రపంచంలోనే అతి పెద్ద మసీదు గా ఇది కీర్తించబడినది.
- స్తంభంలా కనిపించే దీని ఎత్తు 170 అడుగులు. అంటే సుమారు 15 అంతస్తుల భవనమంత. ఇక చుట్టు కొలత 100 అడుగుల పైనే!
- భవనం పై భాగంలో మసీదును నిర్మించారు. అయితే పైకెళ్లడానికి ప్రత్యేకంగా మెట్లేమీ ఉండవు. భవనం గోడలనే ర్యాంప్‌లా కట్టడంతో దానిపై నుంచే నడుచుకుంటూ వెళ్లడం ఇక్కడి ప్రత్యేకత.
- మసీదు లోపలికి వెళ్లడానికి సుమారు 17 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. లోపల కూడా చక్కని ఇస్లామిక్ నిర్మాణశైలితో ప్రాచీన కళాకృతులు, చెక్కుళ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
- మసీదుపై ఎన్నోసార్లు దాడులు జరిగాయి. 2005లో దీనిపై ఒక బాంబు కూడా పడింది. మళ్లీ మరమ్మతులు చేసి పూర్వవైభవం తీసుకొచ్చారు.
- ఈ మసీదును అనుకరిస్తూ ఈజిప్టుతోపాటు ఎన్నో ప్రాంతాల్లో దీని నమూనాల్లో మసీదులు కట్టారు.
బయటి లంకెలు
[మార్చు]- ద గ్రేట్ మాస్క్ ఆఫ్ సమర్రా, ఇరాక్
- గ్రేట్ మాస్క్ ఆఫ్ సమర్రా ఛాయాచిత్రాలు
- గ్రేట్ మాస్క్ ఆఫ్ సమర్రా వివరాలు
- గ్రేట్ మాస్క్ ఆఫ్ సమర్రా నిర్మాణ వివారాలు, చిత్రాలతో సహా
- Ernst Herzfeld Papers, Series 7: Records of Samarra Expeditions, Great Mosque of al-Mutawakkil Collections Search Center, S.I.R.I.S., Smithsonian Institution, Washington, DC
- Ernst Herzfeld Papers, Series 7: Records of Samarra Expeditions, 1906-1945 Smithsonian Institution, Freer Gallery of Art and Arthur M. Sackler Gallery Archives, Washington, DC