ప్రహ్లాదపురి దేవాలయం, ముల్తాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రహ్లాదపురి దేవాలయం, ముల్తాన్
Prahladpuri Temple
پرَہْلادْپُورِی مندر
ప్రహ్లాదపురి ఆలయం యొక్క శిధిలాలు
ప్రహ్లాదపురి ఆలయం యొక్క శిధిలాలు
భౌగోళికం
ప్రదేశంముల్తాన్ , పంజాబ్ Pakistan పాకిస్తాన్
సంస్కృతి
దైవంప్రహ్లాద
వాస్తుశైలి
నిర్మాణ శైలులుహిందూ దేవాలయం
చరిత్ర, నిర్వహణ
నిర్వహకులు/ధర్మకర్తపాకిస్తాన్ హిందూ కౌన్సిల్
వెబ్‌సైట్http://www.pakistanhinducouncil.org/

ప్రహ్లాదపురి దేవాలయం; పాకిస్తాన్ లోని పంజాబు రాష్ట్రంలో, ముల్తాన్ పట్టణంలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. విష్ణు అవతారమైన, నరసింహుని దేవాలయంగా, ప్రహ్లాదుడు నిర్మించినట్టుగా ప్రజలలో నమ్మకమున్నది. అందువల్లనే, దీనిని ప్రహ్లాదపురి దేవాలయంగా పిలుస్తున్నారు. 1992 బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా జరిగిన దాడుల్లో ఈ దేవాలయం ధ్వంసం అయినది. [1]

చరిత్ర

[మార్చు]

ప్రహ్లాదపురిలోని దేవాలయాన్ని మొదటగా విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు నిర్మించాడు. కశ్యపపురం (ముల్తాన్) [2] పాలకుడైన హిరణ్యకశిపుని బారినుండి, ప్రహ్లాలదుణ్ణి కాపాడడానికి విష్ణువు స్థంబాన్ని చీల్చుకుని నరసింహినిగా వచ్చినది ఇక్కడేనని భక్తుల విశ్వాసం.

  • ముస్లిం రాజులకాలంలో, ముల్తాన్ లోని సూర్యదేవాలయం వలెనే, పహ్లాదపురి దేవాలయం అనేక దాడులకి, దోపిడీలకి గురయ్యింది. అంతేగాక, దేవాలయాన్ని పక్కన మసీదు కూడా నిర్మించబడింది. 1810 సంవత్సరంలో సిక్కురాజుల కాలంలో దేవాలయం పునరుద్ధరించబడిందని, డా. ఎ.కె ఖాన్ పేర్కొన్నారు. అయితే, 1831లో దేవాలయాన్ని సందర్శించిన అలెగ్జాండర్ బర్నెస్ పైకప్పుకూడా లేని నిర్మానుష్యమైన ప్రదేశంగా దీన్ని పేర్కొన్నారు.
  • 1849లో బ్రిటీషు సేనలు ముల్తాన్ కోటని ముట్టడించినపుడు, బ్రిటిషువారి ఫిరంగి గుండు ఒకటి., కోటలోని మందుగుండు కొట్టంలో పడగా; బహావుద్దీన్ & అతని కొడుకుల సమాధులు, ప్రహ్లాదపురి దేవాలయం మినహా తక్కిన కోట మొత్తం ధ్వంసం అయింది. [3]
  • ప్రస్తుత దేవాలయం, 1861సం.లో స్థానిక మహంతు బావల్ రామ దాసు ఆధ్వర్యంలో సేకరించబడిన ప్రజావిరాళాలు (రూ. 11000) ద్వారా నిర్మించబడ్డది. 1872 లో అప్పటి స్థానిక మహంతు, ఠాకూర్ దవారా ఫతే చంద టంకశాలియా, ఇతర ముల్తాన్ ధనిక హిందువులు ఇచ్చిన విరాళాలతో మరొక దశలో పునరుద్ధరింపబడింది.
  • 1881లో మరొక అభివృద్ధి దశలో, ఆలయ శిఖరం ఎత్తు విషయమై ముస్లింలకి, హిందువులకి వచ్చిన తగాదాలో ఆలయం లూటీ చేయబడింది. ఆ అల్లర్లలో 2 మసీదులు, 22 దేవాలయాలు ధ్వంసం అయినాయి. అయితే, ముల్తాన్ కి చెందిన సంపన్న హిందూ కుటుంబాలు గుడిని పునర్నిర్మించాయి.
  • 1947 దేశవిభజన కాలంలో, హిందువులలో అత్యధికులు భారతదేశానికి వలసపోగా, అతికొద్దిమందిగా మిగిలిన ముల్తాన్ హిందువులు గుడి బాగోగులని చూస్తూ ఉండేవారు. దేశవిభజన సమయంలోనే, దేవాలయంలో నరసింహుని మూలవిరాట్టులని బాబా నారాయణ దాస్ బాత్రా, మూల్తాన్ నుండి, హరిద్వార్ కి తీసుకుని వచ్చాడు.
  • 1992 బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా చెలరేగిన అల్లర్లలో గుడి పూర్తిగా ధ్వంసం చేయబడింది.

ప్రస్తుత స్థితి

[మార్చు]

1992 అల్లర్లలో ధ్వంసం చేయబడిన ఈ దేవాలయం పూర్తిగా శిథిలమైపోయి ఉంది. 2006 సం.లో, బహావుద్దీన్ జకారియా, ఊర్స్ (వర్ధంతి) సందర్భంగా ఆలయం ఉన్న ప్ర్దదేశంలో, వుజు (స్నానశాల) నిర్మించడానికి, 2008 సంవత్సరంలో లంగరు నిర్మించడానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకించాయి. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం, ఇతర మతస్థుల ప్రార్థనాశాలలు ఉన్న ప్రాంతంలో, ముస్లిం మతనిర్మాణాలు చేయరాదన్న నిబంధన ప్రకారం, కోర్టులో కేసు వేయగా, కోర్టు ప్రభుత్వ ప్రయత్నాలపై స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. పాకిస్తాన్ లో మైనారిటీ వర్గాలు ఆలయాన్ని పూర్వస్థితికి తీసుకుని రావాలని శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-11. Retrieved 2018-11-14.
  2. Syad Muhammad Latif (1963). The early history of Multan. p. 3,54. Kasyapa, is believed, according to the Sanscrit texts, to have founded Kashyapa-pura (otherwise known as Multan
  3. MONUMENTS OF MULTAN Archived 2016-02-01 at the Wayback Machine Survey & Studies for Conservation of Historical Monuments of Multan. Department of Archaeology & Museums, Ministry of Culture, Government of Pakistan