Jump to content

ప్రాచీనాంధ్ర గాథలు

వికీపీడియా నుండి
తిరుమల రామచంద్ర

ప్రాచీనాంధ్ర గాథలు ప్రముఖ రచయిత, పండితుడు తిరుమల రామచంద్ర గారు గాథాసప్తశతిలోని కొన్ని గాథలు తీసుకుని అల్లిన కథలు. రెండువేల యేళ్లనాటి ఆంధ్రుల ఆచార వ్యవహారాలు, తిండితిప్పలు, కష్టసుఖాలు ఈ కథల్లో ప్రతిబింబిస్తాయి.

రచన నేపథ్యం

[మార్చు]

ఆంధ్రశాతవాహన కాలం నాటి ప్రాకృత సాహిత్యం నుంచి విశ్వసాహిత్యంలో శాశ్వత స్థానం సంపాదించున్న రెండు గ్రంథాల్లో గాథాసప్తశతి ఒకటి. సా.శ. 25-30 మధ్య శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిన కవి వత్సలుడు హాలుడు ఈ గ్రంథాన్ని సంతరించాడు. ఆనాడు ప్రచారంలో ఉన్న కోటి గాథల నుంచి ఏర్చి కూర్చిన గ్రంథం "గాథాసప్తశతి". 300వందల మంది రచయితలు, రచయిత్రులు ఈ కథలను రచించారంటే ఆనాటి ప్రాకృత సాహితీ వైభవం తెలుస్తుంది. అపురూపమైన ఈ కావ్యాన్ని శ్రీనాథుడు తెనుగు చేయడంతోపాటు, ప్రోలయ వేమారెడ్డి తదితరులు ఈ గ్రంథానికి తెలుగులో టీక తాత్పర్యాలు రచించారు. సంస్కృత, ప్రాకృత, తెలుగు, కన్నడ, హిందీ, ఆంగ్లాది బహుభాషల్లో పండితుడు, సృజనాత్మక రచయిత, అనువాదకుడు తిరుమల రామచంద్ర విశిష్టమైన గాథాసప్తశతి గాథలను కథలుగా మలిచారు. ఈ కథలు మొదట పల్లకి పత్రికలో ధారావాహికంగా వెలువడగా తిరుమల రామచంద్ర శతజయంతి సందర్భంగా 2013 జూన్న ఎమెస్కో బుక్స్ ప్రచురణ సంస్థ వారు తిరుమల రామచంద్రకు నివాళిగా ప్రచురించారు.

ఇతివృత్తాలు

[మార్చు]

కథనం

[మార్చు]

శైలి,ఉదాహరణలు

[మార్చు]

ఇతరుల మాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]