ప్రియల్ గోర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రియల్ గోర్
ప్రియల్ గోర్ (2012)
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

ప్రియాల్ గోర్, మహారాష్ట్రకు చెందిన టెలివిజన్, సినిమా నటి. రొమాంటిక్ ఫాంటసీ డ్రామా ఇచ్ఛప్యారీ నాగిన్‌లో ఇచ్ఛా పాత్రలో నటించి, గుర్తింపు పొందింది. 2014లో తెలుగులో వచ్చిన సాహెబా సుబ్రమణ్యం సినిమాలో కూడా నటించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ప్రియల్ గోర్ ముంబైలోని గుజరాతీ కుటుంబంలో జన్మించింది.[1][2]

టివిరంగం[మార్చు]

2010లో వచ్చిన రామ్ మిలాయే జోడి అనే సీరియల్ ద్వారా నటిగా పరిచయమయింది. 2010లోనే డిస్నీ ఛానల్ వారి ఇషాన్: సప్నో కో ఆవాజ్ దే నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత జీ టీవీ షో రామ్ మిలాయే జోడిలో మోనా అనే ప్రధాన పాత్రను పోషించింది.[3] పలు సీరియళ్ళలో నటించింది.

సినిమారంగం[మార్చు]

2013లో జస్ట్ యూ & మీ అనే పంజాబీ రొమాంటిక్ కామెడీ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది. ఈ సినిమాలో గీత్ అనే ప్రవాస భారతీయురాలు పాత్రను పోషించింది.[4] 2014లో శశి కిరణ్ నారాయణ తీసిన సాహెబా సుబ్రమణ్యం అనే సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[2] 2015 అనార్కలి అనే మలయాళ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పక్కన కథానాయికగా నటించింది.[5]

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాష
2013 జస్ట్ యూ & మీ గీత్ పంజాబీ
2014 సాహెబా సుబ్రహ్మణ్యం సాహెబా తెలుగు
2015 అనార్కలి నదీరా ఇమామ్ మలయాళం
2018 చందమామ రావే ప్రియా తెలుగు
2021 బద్నాం సోనియా హిందీ

మూలాలు[మార్చు]

  1. Navya Malini. "Don't know much of politics, but will vote for sure: Priyal Gor". The Times of India. Retrieved 2022-04-15. A proud Gujarati, actress Priyal Gor is excited to be voting for the first time this election.
  2. 2.0 2.1 "Priyal Gor to debut in Tollywood". The Times of India. 2014-10-22. Retrieved 2022-04-15.
  3. Jambhekar, Shruti (2012-04-30). "Priyal's glowing with love". The Times of India. Archived from the original on 2012-05-17. Retrieved 2022-04-15.
  4. "Life Style: Couple chemistry". The Tribune (Chandigarh, India).
  5. "In fashion in Mollywood". The Hindu. 25 November 2015. Retrieved 2022-04-15.

బయటి లింకులు[మార్చు]