ప్రియవ్రతుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రియవ్రతుడు స్వాయంభువ మనువునకు శతరూప యందు పుట్టినపెద్దకొడుకు. ఉత్తానపాదుని అన్న. ఇతఁడు కర్దమప్రజాపతి కూఁతురు అయిన సుకన్య అను దానిని పెండ్లాడెను. ఆమెయందు ఇతనికి సమ్రాట్టు, కుక్షి అని ఇరువురు కూతురులును; ఆగ్నీధ్రుడు, అగ్నిబాహువు, వపుష్మంతుడు, ద్యుతిమంతుడు, మేధ, మేధాతిథి, భవ్యుడు, సవనుడు, పుత్రుడు, జ్యోతిష్మంతుడు అని పదుగురు కొడుకులును పుట్టిరి. వారలో మేధ, పుత్రుఁడు, అగ్నిబాహువు ఈమువ్వురును యోగపరాయణులు అయిరి. తక్కిన ఏడుగురు కొమారులకును ప్రియవ్రతుఁడు భూమిని ఏడుద్వీపములుగ భాగించి ఇచ్చెను. అందు ఆగ్నీధ్రునికి జంబూద్వీపమును, మేధాతిథికి ప్లక్షద్వీపమును, వపుష్మంతునకు శాల్మలద్వీపమును, జ్యోతిష్మంతునికి కుశద్వీపమును, ద్యుతిమంతునకు క్రౌంచద్వీపమును, భవ్యునికి శాకద్వీపమును, సవనునికి పుష్కరద్వీపమును వచ్చెను.