ప్రీతి అదానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రీతి గౌతమ్ అదానీ
2021 లో అదానీ
జననం (1965-08-29) 1965 ఆగస్టు 29 (వయసు 58)
విద్యాసంస్థగవర్నమెంట్ డెంటల్ కాలేజ్ & హాస్పిటల్, అహ్మదాబాద్ (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ)
వృత్తివ్యాపారవేత్త
బిరుదుచైర్‌పర్సన్, అదానీ ఫౌండేషన్
జీవిత భాగస్వామిగౌతమ్ అదానీ
పిల్లలు2, కరణ్ అదానీ (కుమారుడు)
జీత్ అదానీ (కుమారుడు)
బంధువులుప్రణవ్ అదానీ

ప్రీతి గౌతమ్ అదానీ (జననం: 29 ఆగస్టు 1965) భారతీయ వ్యాపారవేత్త, దంతవైద్యురాలు, అదానీ ఫౌండేషన్ చైర్‌పర్సన్. [1] [2]ఈమె భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. [3]

వ్యక్తి గత జీవితం[మార్చు]

ప్రీతి అదానీ 1965లో ముంబైలోని గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఈమె అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. [4] ప్రీతి అదానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని వివాహం చేసుకుంది. [5] వీరికి కరణ్ అదానీ [6], జీత్ అదానీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

వృత్తి[మార్చు]

ప్రీతి అదానీ మొదట డెంటిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించింది. ఆ తరువాత 1996లో అదానీ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా నియమించబడింది. 2001లో, భుజ్ భూకంపం తర్వాత, ఆమె ముంద్రాలో అదానీ డీఏవీ స్కూల్‌ను ప్రారంభించింది. తరువాత ఆ పాఠశాలకు అదానీ పబ్లిక్ స్కూల్ అని పేరు పెట్టారు. జూన్ 2009లో, ఆమె, ఆమె భర్త కలిసి భద్రేశ్వర్‌లో (ముంద్రా సమీపంలో) అదానీ విద్యా మందిరాన్ని స్థాపించారు. [7] దీనిలో పేద పిల్లలకు ఉచిత ఉన్నత మాధ్యమిక విద్యను అందిస్తున్నారు. [8] ఆమె నాయకత్వంలో, అదానీ గ్రూప్ 2018-19 సిఎస్ఆర్ బడ్జెట్ ఒక సంవత్సర కాలంలో ₹95 కోట్ల నుండి ₹128 కోట్లకు పెరిగింది. [9] [10]

అవార్డులు[మార్చు]

 • ఎఫ్ఐసిసిఐ ఫ్లో ఉమెన్ ఫిలాంత్రోపిస్ట్ అవార్డు (2010–11). [11]
 • గుజరాత్ లా సొసైటీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్. [12]

మూలాలు[మార్చు]

 1. "Adani Vidya Mandirs win Samagra Shiksha awards". The Times of India. February 21, 2020. Retrieved 2021-03-08.
 2. "Leading by example". Ahmedabad Mirror. August 22, 2019. Retrieved 2021-03-08.
 3. "A few good women". The Financial Express. 2010-11-01. Retrieved 2021-03-08.
 4. Kohli, Namrata (2019-03-13). "A business can only thrive if it is sensitive to its society: Priti Adani". Business Standard India. Retrieved 2021-03-08.
 5. "Ratio of working women in India lower than in Afghanistan, Bangladesh: Priti Adani". The Indian Express. 2019-08-29. Retrieved 2021-03-08.
 6. Saxena, Aditi. "Adani household in celebration mode, Karan & Paridhi to become first-time parents". The Economic Times. Retrieved 2021-03-08.
 7. "Goodness at the grassroots: Dr Priti G Adani explains how Adani Foundation is changing lives". Free Press Journal. Retrieved 2021-03-08.
 8. Ranjan, Abhinav (2017-05-08). "This Ahmedabad school offers free education to poor children". www.indiatvnews.com. Retrieved 2021-03-08.
 9. "Our projects aligned with nation-building: Priti Adani". Business Standard India. Press Trust of India. 2019-09-10. Retrieved 2021-03-08.
 10. "Our projects aligned with nation-building Priti Adani". The Week. Retrieved 2021-03-08.
 11. "Women Philanthropist Awards 2010-11, FICCI" (PDF). Federation of Indian Chambers of Commerce & Industry. Retrieved 8 March 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 12. "Dr. Priti Adani receives Doctorate for her contribution to CSR". Outlook India. Retrieved 2021-03-08.{{cite web}}: CS1 maint: url-status (link)