Jump to content

ప్రేమ్ కుమార్ (2023 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
ప్రేమ్ కుమార్
దర్శకత్వం
  • అభిషేక్ మహర్షి
రచన
  • అభిషేక్ మహర్షి
నిర్మాత
  • శివ ప్రసాద్ పన్నీరు
తారాగణం
ఛాయాగ్రహణంరంపి నందిగం
కూర్పుగ్యారీ బిహెచ్
సంగీతంఅనంత్ శ్రీకర్‌
నిర్మాణ
సంస్థ
సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీs
18 ఆగస్టు 2023 (2023-08-18)(థియేటర్)
13 అక్టోబరు 2023 (2023-10-13)( అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో)
భాషతెలుగు

ప్రేమ్ కుమార్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమాకు అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించాడు. సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచిత సాదినేని, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 18న విడుదల చేయగా[2], సినిమాను ఆగస్ట్ 18న విడుదలై, 13 అక్టోబర్ నుండి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

నటీనటులు

[మార్చు]
  • సంతోష్ శోభన్
  • రాశీ సింగ్
  • రుచిత సాదినేని
  • కృష్ణ చైతన్య
  • కృష్ణ తేజ
  • సుదర్శన్
  • అశోక్ కుమార్
  • శ్రీ విద్య
  • రాజ్ మాదిరాజు
  • సురభి ప్రభావతి

ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్) పెళ్లిళ్లు పీటల మీదే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏం చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ప్రేమ్ కుమార్‌కు పెళ్లి అవ్వదు. దింతో పెళ్లిళ్లు చెడగొట్టే, బ్రేకప్‌లు చేయించేలా తన మిత్రుడు రోషన్ (కృష్ణ చైతన్య)తో కలిసి ఓ డిటెక్టివ్ ఏజెన్సీపెట్టుకుంటాడు. నిత్య (రాశీ సింగ్) పెళ్లిళ్లు చేసే ఈవెంట్ మేనెజ్మెంట్‌ను నడుపుతూ ఉంటుంది. ఈ కథలో అంగనా (రుచిత), రైజింగ్ స్టార్ రోషన్ (చైతన్య కృష్ణ)ల పాత్ర ఏమిటి? చివరకు ప్రేమ్ కుమార్‌కు పెళ్లి అవుతుందా..? ప్రేమ్ కుమార్ ప్రేమ సఫలం అవుతుందా ? లేదా..? అనేదే మిగతా సినిమా కథ.[4]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాత: శివ ప్రసాద్ పన్నీరు[5]
  • కథ: అభిషేక్ మహర్షి, అనిరుధ్ కృష్ణమూర్తి
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్ మహర్షి[6][7]
  • సంగీతం: ఎస్. అనంత్ శ్రీకర్
  • సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగాం
  • పాటలు: కిట్టు విస్సాప్రగడ

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (18 March 2022). "'నా లైఫ్‌లో ఎలాగో క‌ల‌ర్ లేదు.. మీరైనా ర‌క‌ర‌కాల రంగుల‌తో పండ‌గ చేస్కోండి'". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  2. Hindustantimes Telugu (18 July 2023). "పెళ్లిళ్లు ఆపే డిటెక్టివ్.. ఫన్నీగా ప్రేమ్ కుమార్ ట్రైలర్". Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.
  3. TV9 Telugu (13 October 2023). "కడుపుబ్బా నవ్వించేందుకు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'ప్రేమ్‌ కుమార్‌'.. ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (18 August 2023). "రివ్యూ: ప‌్రేమ్‌కుమార్‌.. సంతోష్‌ శోభన్‌ కొత్త మూవీ మెప్పించిందా?". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
  5. Andhra Jyothy (15 August 2023). "పెళ్లి ఆగిపోయిన‌ప్పుడు పెళ్లి కొడుకు పడే బాధే.. ప్రేమ్ కుమార్ సినిమా | Prem Kumar Movie Producer Shiva Prasad Panneeru Interview KBK". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
  6. News18 Telugu (14 August 2023). "'ప్రేమ్ కుమార్' కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం : దర్శకుడు అభిషేక్ మహర్షి." Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. A. B. P. Desam (14 August 2023). "'ప్రేమ్ కుమార్' కథ అదే, విశ్వక్ సేన్ సినిమాతో పోలిక లేదు: దర్శకుడు అభిషేక్ మహర్షి". Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.

బయటి లింకులు

[మార్చు]