ప్రేమ (1989 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ
Prema (1989 film).jpg
దర్శకత్వంసురేష్ కృష్ణ
నిర్మాతడి. రామానాయుడు
నటవర్గంవెంకటేష్, రేవతి
ఛాయాగ్రహణంపి. ఎస్. ప్రకాష్
కూర్పుకె. ఎ. మార్తాండ్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
పంపిణీదారులురాజేశ్వరి ఫిల్మ్స్
విడుదల తేదీలు
1989 జనవరి 12 (1989-01-12)
భాషతెలుగు

ప్రేమ 1989 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో డి. రామానాయుడు నిర్మాణ సారథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదలైన విషాద ప్రేమకథా చిత్రం. వెంకటేష్, రేవతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.

కథ[మార్చు]

పృథ్వి ఒక అనాథ యువకుడు. మంచి గాయకుడు కావాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఒకసారి అతనికి మ్యాగీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. పృథ్వి మ్యాగీని పెళ్ళి చేసుకోవడం మ్యాగీ తల్లి స్టెల్లాను అడుగుతారు. కానీ స్టెల్లాకు పృథ్వి ఆవేశం గురించి తెలుస్తుంది. అంతే కాకుండా అతను తల్లి ఆత్మహత్యకు కారణమైనందుకు స్వంత తండ్రినే హత్య చేశాడని తెలుసుకుంటుంది. అలాంటి వాడికి తన కూతురునిచ్చి పెళ్ళి చేయనని చెబుతుంది. మ్యాగి కూడా అతని కోపాన్ని తగ్గించుకోమని చెబుతుంది.

పృథ్వి ఎలాగోలా కష్టపడి మ్యాగీని పెళ్ళి చేసుకోవడానికి ఆమె తల్లిని ఒప్పిస్తాడు. తీరా పెళ్ళి జరిగే సమయానికి మ్యాగీ కళ్ళు తిరిగి పడిపోతుంది. వైద్యసహాయం కోసం వెళితే, ఆమె చిన్న చిన్న సమస్యలకు కూడా మందుకు ఎక్కువగా వాడటం వలన శరీరంలో అతి కీలకమైన అవయవాలు పనికిరాకుండా పోయాయనీ, ఆమె ఇక ఎంతోకాలం బతకదనీ చెబుతారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • ప్రియతమా! నా హృదయమా!
గానం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
  • ఈనాడే ఏదో అయ్యింది
గానం - చిత్ర, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
  • మాటే మంత్రము
గానం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ

మూలాలు[మార్చు]