Jump to content

ప్లాస్టిక్ తో ప్రమాదాలు

వికీపీడియా నుండి
Plastic Pollution in Ghana | Plastic Pollution covering Accra beach
అక్ర బీచ్‌, ఘనాలో ప్లాస్టిక్ కాలుష్యం
Plastic pollution in Campus area of Visva Bharati , Santiniketan, West Bengal
శాంతినికేతన్ క్యాంపస్ ప్రాంతంలో ప్లాస్టిక్ కాలుష్యం, విశ్వ భారతి, పశ్చిమ బెంగాల్

ప్లాస్టిక్ ఓ అద్భుతమైన రసాయన సమ్మిళిత పదార్థము. దీనితో అనేక వస్తువులు తయారు చేయవచ్చును. ఇవి అత్యంత అందంగాను, రంగురంగులతో వుండి అత్యంత చౌకగా వుండటంతో ప్లాస్టిక్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. దీనితో తయారు కాబడని వస్తువంటూ ఏది లేదు. స్వతహాగా ప్రాస్టిక్ విష పూరితము కాదు, ఆరోగ్యానికి హాని కరము అంతకన్నా కాదు. కాని వాటి వ్యర్థ పదార్థాల వలన పర్యావరణానికి కలిగే ముప్పు అంతా ఇంతా కాదు.

ప్లాస్టిక్ సంచులు- ఒక పర్యావరణ ప్రమాదం

[మార్చు]

ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన జరిగే సమస్య, వ్యర్ధ పదార్థాల యాజమాన్య పద్ధతులలోని లోపాలే ప్రాథమికంగా కారణము. కాలువలు మూసుకుపోవడం, భూగర్భజలాల [కాలుష్యం] మొదలైనవాటితోపాటు విచక్షణారహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు కలుగుతాయి.

ప్లాస్టిక్ అంటే ఏమిటి?

[మార్చు]

ప్లాస్టిక్ అంటే పోలిమర్లు, మోనోమర్లు అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో, పునరుక్తమయ్యే యూనిట్లు “ఎథిలిన్”. పోలిఎథిలిన్ ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినపుడు, అవి పొడవైన కర్బన అణువుల చెయిన్లను ఏర్పరుస్తాయి. ఇందులో ప్రతి కార్బన్ రెండు హైడ్రోజన్ పరమాణువులతో బంధం ఏర్పరచుకుంటుంది.

ప్లాస్టిక్ సంచులు వేటితో తయారవుతాయి?

[మార్చు]

ప్లాస్టిక్ సంచులు మూడు రకాల మౌలిక పోలిమర్లలో ఏదైన ఒక దానితో తయారవుతాయి. పోలీఎథిలిన్- 1) ఎక్కువ సాంద్రతగల పోలి ఎథిలిన్ (హెచ్ డి పి ఇ), 2) తక్కువ సాంద్రతగల పోలి ఎథిలిన్ (ఎల్ డి పి ఇ), 3) సరళంగా తక్కువ సాంద్రతగల పోలి ఎథిలిన్ (ఎల్ ఎల్ డి పి ఇ). కిరాణా సంచులు సామాన్యంగా హెచ్ డి పి ఇతో, డ్రై క్లీనర్ నుండి ఇచ్చే సంచులు ఎల్ డి పి ఇ అయి ఉంటాయి. ఈ మెటీరియల్ లో పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, పోలిమర్ చెయన్ శాఖలుగా ఏర్పడే పరిమాణం. హెచ్ డి పి ఇ, ఎల్ ఎల్ డి పి ఇ శాఖలుకాని చెయిన్లతో సరళంగా చెయన్లు ఉంటాయి ; ఎల్ డి పి ఇలో శాఖలుతో చెయిన్ల ఏర్పడతాయి.

ప్లాస్టిక్ ఆరోగ్యా నికి హానికరం

[మార్చు]

ప్లాస్టి సైజర్లు అనేవి తక్కువ బాష్పశీల స్వభావముగల సేంద్రీయ ఈస్టర్లు. అవి, ఆహార పదార్థాలకి స్రవించిడం ద్వారా వలస పోగలుగుతాయి. ప్లాస్టిసైజర్లలో కూడా కేన్సరు కలుగ చేసే పదార్థాలని కలిగి ఉంటాయి. యాంటి ఆక్సిడింట్లు, స్టెబిలైజర్లు సేంద్రీయ, అసేంద్రీయ రసాయనాలు. వీటి తయారీ విధాన సమయంలో, ఉష్ణ వియోగం చెందకుండా రక్షిస్తాయి.

కాడ్మియం, సీసం వంటి విషపూరిత ధాతువులు, ప్లాస్టిక్ సంచుల మాన్యుఫేక్చరింగులో ఉపయోగించినప్పుడు కూడా శ్రవించి ఆహార పదార్ధాలని కలుషితం చేస్తాయి. కాడ్మియం చిన్న మోతాదులలో శోషించినపుడు, వాంతులని, గుండె పెద్దది కావడం కలగచేస్తుంది. ఎక్కువ కాలం సీసానికి గురైతే, మెదడు టిష్యూలు క్షీణించి పోతాయి.

తీసుకువెళ్లే ప్లాస్టిక్ సంచులు వలన కలిగే సమస్యలు

[మార్చు]

ప్లాస్టిక్ సంచులని సరిగా పారవేయకపోతే, డ్రైనేజి సిస్టమ్ లోకి వెళ్ళి వాటిని మూసి వేయడం వలన అశుభ్రమైన వాతావారణాన్ని కలుగచేసి, నీటి ద్వారా వచ్చే వ్యాధులను కలుగచేస్తాయి. పునర్వినియోగం /రంగుల ప్లాస్టిక్ సంచులు, భూమిలోనికి శ్రవించి మట్టిని, ఉప మట్టి నీటిని కలుషితం చేసే కొన్ని రసాయనాలని కలిగి ఉండవచ్చు. పునర్వినియోగం చేయడానికి ఉపయోగించే యూనిట్లు పర్యావరణపరంగా పటిష్టమైనవి కాకపోతే, పునర్వినియోగం సమయంలో ఉత్పత్తి అయ్యే విషపూరిత ఆవిరి వలన పర్యావరణ సమస్యలు కలుగుతాయి. మిగిలిపోయిన ఆహారం కలిగిఉన్న లేదా ఇతర వ్యర్ధ పదార్ధాలతో కలిసిపోయి ఉన్న కొన్ని ప్లాస్టిక్ సంచులను జంతువులు తినడం వలన హానికరమైన ప్రభావాలు కలుగుతాయి. పాడవ్వని, చొచ్చుకు పోనీయని స్వభావంకల ప్లాస్టిక్ కారణంగా, మట్టిలో పారవేస్తే, భూగర్భ జల ఏక్విఫెర్లు నింపకుండా అడ్డుకోవచ్చు. అంతే కాకుండా, ప్లాస్టిక్ ఉత్పాదనల లక్షణాలని మెరుగు పరచడానికి, పాడయ్యే ప్రతి చర్యని నిరోధించడానికి సాధారణంగా ఎడిటివ్లను, ప్లాస్టిసైజర్లను, ఫిల్లర్లను, ఆగ్నిమాపకాలని, పిగ్ మెంట్లని ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యం మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

వ్యర్ధ ప్లాస్టిక్ యాజమాన్య వ్యూహరచనలు

[మార్చు]

పలుచని ప్లాస్టిక్ సంచులు తక్కువ విలువ కలిగి ఉండి వాటిని వేరుపరచడం కష్టతరంగా ఉంటాయి. ప్లాస్టిక్ సంచుల మందాన్ని పెంచితే, ప్లాస్టిక్ సంచుల ఖరీదైనవిగా ఉండి, వాటి ఉపయోగాన్ని తగ్గించ వచ్చు. ప్లాస్టిక్ మేన్యుఫేక్చర్ అసోసియేషన్, చెత్తని తీసుకు వెళ్ళేవారు కూడా వ్యర్ధ సేకరణ, తొలగించే విధానంలో పాల్గొనాలి.

ప్లాస్టిక్ నీటి సీసాలు, ప్లాస్టిక్ సంచులు పారవేయడం వలన మున్సిపల్ ఘన వ్యర్ధ యాజమాన్యానికి ఒక సవాలుగా తయారయింది. పర్యాటక ప్రదేశాలలో, చాలా పర్వత రాష్ట్రాలలో (జమ్ము & కాశ్మీర్, సిక్కిం, పశ్చిమ బెంగాలు) ప్లాస్టిక్ సంచులు/సీసాలని ఉపయోగించడాన్ని నిషేధించాయి. హిమాచల్ ప్రదేశ్ లో, రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ పి బయోడిగ్రేడబుల్ గార్బేజ్ (నియంత్రణ) చట్టం, 1995 క్రింద, 15.08.2009 నుండి రాష్ట్ర మంతటా, ప్లాస్టిక్ ఉపయోగించ డానిని నిషేధించడానికి క్యాబినెట్ తీర్మానం తీసుకుంది. కమీటీలని, టాస్క్ ఫోర్స్ లని నియమించడం ద్వారా, దేశంలో వ్యర్ధ ప్లాస్టిక్ వలన వాతావరణానికి కలిగిన నష్టాన్ని క్రేంద్ర ప్రభుత్వం కూడా అంచనా వేసింది. కమిటీ, టాస్క్ ఫోర్స్, సమస్యని అధ్యయనం చేసి సిఫార్సు చేస్తారు. ప్లాస్టిక్ సంచులు, కంటైనర్లని నిర్వహించడానికి, నియంత్రించడానికి, పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ, పర్యావరణ (సంరక్షణ) చట్టం, 1986 క్రింద, రిసైకిల్డ్ ప్లాస్టిక్ మేన్యుఫేక్చర్, వినియోగ నిబంధనలు 1999ని జారీ చేసింది, దానిని 2003లో సవరించింది. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ మీద, బ్యురో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బి ఐ ఎస్) 10 ప్రమాణాలని ప్రకటించింది.

ప్లాస్టిక్ వలన ప్రకృతికి కలిగే ప్రత్యామ్నాయాలు

[మార్చు]

ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార లేదా క్లాత్ సంచులని వినియోగించడాన్ని జనరంజకం చేయాలి, ఆర్థికపరమైన ఇన్సెంటివ్లతో ప్రేరేపించాలి. అయినప్పటికీ, పేపరు సంచులు తయారీలో చెట్లని కొట్టి వాటిని ఉపయోగించడం జరుగుతుంది, కాబట్టి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ముఖ్యముగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులని మాత్రమే ఉపయోగించాలి, మరి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ని అభివృద్ధి చేయడానికి పరిశోధన జరుగుతుంది.

వనరులు

[మార్చు]

http://te.pragatipedia.in/rural-energy/environment/environment-facts#section-1[permanent dead link]