ఫటా మార్గానా (1971 సినిమా)
Appearance
ఫటా మార్గానా | |
---|---|
దర్శకత్వం | వెర్నర్ హోర్జోగ్ |
రచన | వెర్నర్ హోర్జోగ్ |
నిర్మాత | వెర్నర్ హోర్జోగ్ |
Narrated by | లోట్టె హెచ్. ఐస్నర్, వుల్ఫ్గాంగ్ బుచ్లర్,మన్ఫ్రేడ్ ఐగెన్దోర్ఫ్ |
ఛాయాగ్రహణం | జోర్గ్ ష్మిత్-రీట్వీన్ |
కూర్పు | బీట్ మెయిన్కా-జెల్లీహాస్ |
సంగీతం | బ్లైండ్ ఫెయిత్, థర్డ్ ఇయర్ బ్యాండ్, లియోనార్డ్ కోహెన్ |
నిర్మాణ సంస్థ | వెర్నర్ హోర్జోగ్ ఫిల్మ్ ప్రొడక్షన్ |
విడుదల తేదీs | 19 ఏప్రిల్, 1971 |
సినిమా నిడివి | 79 నిముషాలు |
దేశం | పశ్చిమ జర్మనీ |
భాష | జర్మన్ భాష |
ఫటా మార్గానా వెర్నర్ హోర్జోగ్ దర్శకత్వంలో 1971, ఏప్రిల్ 19న జర్మన్ సినిమా. 1968, 69లలో చిత్రీకరించిన ఈ చిత్రంలో మయాన్ మిథ్ ని బేస్ చేసుకుని సృష్టి ఎలా జరిగింది అనే విషయాన్ని వివరిస్తూ దాదాపు పదహేడు రకాల ఆఫ్రికా నేలని చూపిస్తూ దేవుడు మనుషులను ఎందుకు చేసాడనేది వివరించబడింది.
కథా నేపథ్యం
[మార్చు]ఫటా మార్గానా ఒక డాక్యుమెంటరీ దృశ్య కావ్యం. సృష్టి, స్వర్గం, స్వర్ణయుగం అనే భాగాలుగా డాక్యుమెంటరీని విడగొట్టి మానవ పరిణామక్రమం గురించి వారి పరివర్తన నాగరికత గురించి, స్వర్ణయుగంలో చావు భయంతో మనిషి కోల్పోయే సంతోషం చెప్పడం జరిగింది.
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, నిర్మాత, దర్శకత్వం: వెర్నర్ హోర్జోగ్
- వ్యాఖ్యానం: లోట్టె హెచ్. ఐస్నర్, వుల్ఫ్గాంగ్ బుచ్లర్,మన్ఫ్రేడ్ ఐగెన్దోర్ఫ్
- సంగీతం: బ్లైండ్ ఫెయిత్, థర్డ్ ఇయర్ బ్యాండ్, లియోనార్డ్ కోహెన్
- ఛాయాగ్రహణం: జోర్గ్ ష్మిత్-రీట్వీన్
- కూర్పుం బీట్ మెయిన్కా-జెల్లీహాస్
- నిర్మాణ సంస్థ: వెర్నర్ హోర్జోగ్ ఫిల్మ్ ప్రొడక్షన్
చిత్రీకరణ విషయాలు
[మార్చు]- 1968, నవంబరు నుండి 1969 డిసెంబరు వరకు 13 నెలలలో ఆఫ్రికాలో చిత్రీకరించారు.
- దృశ్యకావ్యంగా సాగిపోతున్న ఈ డాక్యుమెంటరీ తీసేప్పుడు వెర్నెర్ ఏ కథ అనుకోకుండా వెళ్లి అన్నీ చిత్రీకరించి వచ్చాక స్క్రిప్ట్ రాసుకున్నాడు.
- వెర్నర్ హోర్జోగ్ వ్యాన్ నడుపుతుండగా, జోర్గ్ ష్మిత్-రీట్వీన్ వ్యాన్ పైనుండి పొడవైన ట్రాకింగ్ షాట్లు తీయడం జరిగింది. దీనికోసం చిత్ర బృందం అక్కడి రోడ్లను చదను చేశారు.[1]
- హెర్జోగ్, సిబ్బంది చిత్రీకరణ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. కెమెరామన్ ష్మిత్-రిట్వీన్ యొక్క పేరు ఒక జర్మన్ కిరాయి రౌడి పేరును పోలివుండడంతో కామెరూన్ లో జైలు శిక్షను కూడా అనుభవించారు.[1]
- వారు ఇసుక తుఫానులు, వరదలను కూడా ఎదుర్కొన్నారు. వాహనం సరిహద్దు దాటడంతో సామగ్రి లేకపోవడంతో చివరికి చిత్రీకరణ చిత్రీకరణ నిలిచిపోయింది.
- చిత్రీకరణ సందర్భంగా, హెర్జోగ్ ఎలుకలు ఉన్న జైలులో పడవేయబడ్డాడు. ఈవి గాయ పరచడం వల్ల బిలార్జియా అనే రక్త సంబంధిత వ్యాధి వచ్చింది.[2]
విడుదల - స్పందన
[మార్చు]- 1970లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రదర్శించబడింది.[2]
- వెర్నర్ హోర్జోగ్ ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ నుండి 1971,ఏప్రిల్ 19న విడుదలయింది.[3]
- 2013, డిసెంబరులో పశ్చిమ హాలీవుడ్ యొక్క సినీఫమేమిచే అమెరికన్ డ్రోన్ మెటల్ బ్యాండ్ ఎర్త్ యొక్క ప్రత్యక్ష ప్రసారంతో ప్రదర్శించబడింది.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Herzog, Werner (2001). Herzog on Herzog. Faber and Faber. p. 303. ISBN 0-571-20708-1.
- ↑ 2.0 2.1 Wickum, Mark (1990), Fata Morgana, DVD Film Notes, Anchor Bay: ABD4436. DVD embedded title and search points.
- ↑ "Fata Morgana". Filmportal.de. Retrieved 11 April 2019.
- ↑ Bret. "TELETHON 2013: Primetime (feat. live score to Herzog's "Fata Morgana" by Earth, and more!)". cinefamily.org. Archived from the original on 2 జనవరి 2017. Retrieved 11 April 2019.
- ↑ TELETHON 2013: Earth plays Herzog's "Fata Morgana" (trailer) యూ ట్యూబ్ లో
- ↑ "An homage to the wonderfully weird Cinefamily Telethon". kcrw.com. Retrieved 11 April 2019.