ఫన్‌డాక్టర్‌ చంద్రశేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ (నవంబర్ 10, 1904 - మే 29, 1996) ధ్వన్యనుకరణ నిపుణులు.[1]

నాటక ప్రస్థానం[మార్చు]

1918 ప్రాంతంలో పాఠశాల నాటకాలలో నటించారు. 1920 ఏకపాత్రాభినయాల్లో నటించడం ప్రారంభించారు. 1924-28ల మధ్యకాలంలో వీరు పలు షేక్స్పియర్, షెరిడాన్, మోలియర్, భారతీయ రచయితలు రచించిన ఇంగ్లీష్ నాటకాలలో నటించారు. వీరు వేష అనుకరణ, ఆహార్యం, స్వరానుకరణ, కదలికలు - ఇలా సుమారు 80 మంది ప్రముఖులను అనుకరించారు. వీరిలో గాంధీ, నెహ్రూ, జాకీర్ హుస్సేన్, ఐన్‌స్టీన్, బెర్నార్డ్ షా, టంగుటూరి ప్రకాశం, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఎస్. రాధాకృష్ణన్ మొదలైన ప్రముఖులు ఉన్నారు.

1930-34 మధ్యకాలంలో తెలుగు, ఇంగ్లీష్ నాటకాలకు దర్శకత్వం వహించారు. సెమినార్లు ఏర్పాటుచేశారు.

1936లో నాటకసంస్థని ప్రారంభించి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 1940లో నాటక రిపర్టరీని ప్రారంభించారు. ఇది 1983 వరకి పనిచేసింది.

1944లో సంచార నాటక విధానంతో వివిధ గ్రామాలు తిరిగి, ఔత్సాహిక కళాకారులను నాటకరంగానికి పరిచయం చేశారు.

అవార్డులు, సత్కారాలు[మార్చు]

ఇతర విశేషాలు[మార్చు]

వీరు నెల్లూరు జిల్లాకు చెందినవారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి వీరి మేనకోడలు.

వీరు మే 29, 1996 తేదీన పరమపదించారు.

ఇతర లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. చంద్రశేఖర్ ఫన్ డాక్టర్, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 172.