ఫరూఖ్ జమాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫరూఖ్ జమాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫరూఖ్ జమాన్
పుట్టిన తేదీ (1956-04-02) 1956 ఏప్రిల్ 2 (వయసు 68)
పెషావర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 72)1976 అక్టోబరు 23 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 1 137
చేసిన పరుగులు 1,420
బ్యాటింగు సగటు 10.51
100లు/50లు 0/3
అత్యధిక స్కోరు 54
వేసిన బంతులు 80 24,382
వికెట్లు 0 403
బౌలింగు సగటు 27.85
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 14
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1
అత్యుత్తమ బౌలింగు 7/42
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 57/–
మూలం: ESPNcricinfo, 2017 జూన్ 15

ఫరూఖ్ జమాన్ (జననం 1956, ఏప్రిల్ 2) పాకిస్థాన్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ గా, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా రాణించిన ఇతను 1976లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు.[1]

జననం[మార్చు]

ఫరూఖ్ జమాన్ 1956, ఏప్రిల్ 2న పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించాడు.

క్రికెట్ రంగం[మార్చు]

పాకిస్తాన్‌తోపాటు ముస్లిం కమర్షియల్ బ్యాంక్ క్రికెట్ జట్టు, కెపికె, పాకిస్తాన్ రైల్వేస్, పెషావర్ క్రికెట్ అసోసియేషన్, పంజాబ్‌ వంటి క్రికెట్ జట్టులలో రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడాడు. ఇతని కుమారుడు ఫహద్ జమాన్ (జననం 1988, డిసెంబరు 22) కూడా పాకిస్తాన్ అండర్-19, పెషావర్ తరపున క్రికెట్ ఆడాడు.

టెస్ట్ క్రికెట్[మార్చు]

1976లో హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఫరూఖ్ జమాన్ జట్టులోకి వచ్చాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో ఫరూఖ్ జమాన్ కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.[2]

మూలాలు[మార్చు]

  1. "Farrukh Zaman Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
  2. "PAK vs NZ, New Zealand tour of Pakistan 1976/77, 2nd Test at Hyderabad, October 23 - 27, 1976 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.