ఫలక్‌నుమా ప్యాలెస్

వికీపీడియా నుండి
(ఫలక్నుమా ప్యాలెస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఫలక్‌నుమా ప్యాలెస్
సాధారణ సమాచారం
ప్రదేశంహైదరాబాదు, భారతదేశం
ప్రారంభం2010 (హోటల్ గా)
1893 (ప్యాలెస్ గా)
మార్చి 3, 1884 (ప్యాలెస్ శంకుస్థాపన)
వ్యయం60 లక్షలు
యజమానినవాబ్ సర్ వికారుల్ ఉమ్రా, అమీరే పైగా (1884 నుంచి 1897 వరకు), తరువాత హైదరాబాదు నిజాం
యాజమాన్యంతాజ్ హోటల్స్
ఇతర విషయములు
గదుల సంఖ్య60

తెలంగాణాలోని హైదరాబాదులో ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్ ఉత్తమమైన భవనాల్లో ఒకటి. ఇది హైదరాబాదు రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందినది, [1] తరువాత నిజాముల సొంతమైంది. ఇది ఫలక్‌నుమాలో 32 ఎకరాల (13 హెక్టార్లు) ప్రదేశంలో చార్మినార్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని హైదరాబాద్ ప్రధానమంత్రి, ఆరవ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ బహదూర్ యొక్క మామయ్య, బావ అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించారు.[2] ఉర్దూలో ఫలక్‌నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా) చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

అందులోని ఒక అద్దం విలువ నేడు రూ. 35 కోట్లకు పైగా ఉంది. ఈ భవనాన్ని మూడు వందల ఎకరాల్లో నిర్మించారు.[3] ఫలక్‌నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం. దీన్ని 'పైగా' వంశానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాని సర్‌ వికారుల్‌ ఉమ్రా ఇక్బాల్‌ దౌలా బహదూర్‌ నిర్మించారు. చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం మీద నుంచి తిలకిస్తే కనుచూపు మేర నగర అందాలు కనువిందు చేస్తాయి. ఈ భవనానికి 1884 మార్చి 3వ తేదీన పునాది వేయించారు.1892-93 నాటికి నిర్మాణం పూర్తి చేయించారు. అప్పట్లో ఈ ప్యాలెస్‌ నిర్మాణానికి రూ. 40 లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఆరో నిజాం మహబూబ్‌ అలీ పాషాకు ఈ భవనమంటే ఎంతో మక్కువ. 1895లో నిర్మాణం ఖర్చులు చెల్లించి వికార్‌ నుంచి దీనిని కొనుగోలు చేశాడు. కింగ్‌ ఎడ్వర్డ్స్‌, వైస్రాయ్‌ లార్డ్‌ వేవెల్‌, తొలి భారతీయ గవర్నర్‌ జనరల్‌ సి.రాజగోపాలాచారి, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ గతంలో ఈ ప్యాలెస్‌లో విడిది చేశారు.

భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ సంస్థానం లోని ఫైగా వంశస్థులకు చెందినది. ఆతర్వాత దీనిని నిజాం రాజులు సొంతం చేసుకున్నారు.[4] చార్మినార్ కు 5 కిలోమీటర్ల దూరంలో 32 ఎకరాల (13 హెక్టార్లు) సువిశాల ప్రదేశంలో ఫలక్ నుమా ఫ్యాలెస్ నిర్మించారు. దీనిని అప్పటి హైదరాబాద్ రాజ్య ప్రధాన మంత్రి (నాలుగవ నిజాం రాజైన మీర్ మహబూబ్ అలీఖాన్ బహద్దూర్ బావమరిది) నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా నిర్మించారు.[5] ఫలక్ నుమా అంటే ఉర్దులో “ఆకాశాన్ని ఇష్టపడటం” లేదా "ఆకాశ అద్దం" అని అర్థం.

నిర్మాణాకృతి

[మార్చు]
1900లో ఫలక్‌నుమా ప్యాలెస్

ఫలక్ నూమా ప్యాలెస్ కు ఆంగ్లేయ ఆర్కిటెక్టర్ నిర్మాణాకృతినిచ్చారు. 1884 మార్చి 3లో ఈ నిర్మాణానికి సర్ వికార్ శంకుస్థాపన చేయగా అన్ని హంగులతో నిర్మాణం పూర్తి కావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. ఫలక్ నుమా ప్యాలెస్ లోని 93,971 చదరపు మీటర్ల విస్తీర్ణం గల మర్దనా భాగాన్ని ఇటలీ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన పాలరాళ్లతో పరిచారు. తేలు ఆకృతిలో నిర్మించిన ఈ ప్యాలెస్ మధ్య భాగంలో ప్రధాన భవనం, వంటగది, గోల్ బంగ్లా, జెన్నా మహల్ తో పాటు దక్షిణ భాగంలో పట్టపు రాణులు, చెలికత్తెల కోసం క్వార్టర్లను నిర్మించారు. ఫలక్ నుమా ప్యాలెస్ మొత్తం అరుదైన ఇటాలియన్, టుడూర్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇందులోని కిటికీలకు ఉపయోగించిన రంగు రంగుల అద్దాల పట్టకాల నుంచి వచ్చే కాంతి గదులకు ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తాయి.

చరిత్ర

[మార్చు]

1897-98 వరకు సర్ వికార్ తన వ్యక్తిగత నివాసంగా ఫలక్ నుమా ప్యాలెస్ ను ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత దీని యాజమాన్య బాధ్యతలను హైదరాబాద్ రాజైన 6వ నిజాంకు అప్పగించారు. ఫలక్ నుమా ప్యాలెస్ చాలా ఖరీదైన కట్టడం. దీని కోసం చేసిన అప్పులు తీర్చేందుకు వికార్ కు చాలా కాలం పట్టిందట. ఆయ భార్య వికారుల్ ఉమ్రా ఇచ్చిన సలహా మేరకు మహబూబ్ అలీ పాషా నిజాంను ఈ ప్యాలెస్ కు ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన మహెబూబ్ అలీ పాషా.. ప్యాలెస్ ను చూసి మంత్రముగ్దులయ్యారు. ప్యాలెస్ నిర్మాణంతో వికార్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకుని కావాల్సిన ఆర్థిక సహాయం అందించారు.

1950లో ఇక్కడి నుంచి 6వ నిజాం వెళ్లిపోయిన తర్వాత ఫలక్ నుమా ప్యాలెస్ మొత్తం నిశ్శబ్ధం ఆవరించింది. చివరి అతిథిగా అప్పటి భారత రాష్ట్ర పతి బాబూ రాజేంద్ర ప్రసాద్ 1951లో ఇక్కడ విడిది చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ ప్యాలెస్ ను మూసివేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఈ ప్యాలెస్ ను తాజ్ గ్రూప్ సంస్థకు 30 సంవత్సరాల పాటు అద్దెకు ఇచ్చారు.

ప్యాలెస్

[మార్చు]
డైనింగ్ హాలు
గ్రంథాలయం

ప్యాలెస్ లోని అద్భుతాల్లో... ప్రధాన రిసెప్షన్ గది ఒకటి. ఈ గదిలోని సీలింగ్ కు ఇసుక, సున్నం, నీటితో కలిపిన డెకరేషన్ అచ్చంగా బంగారు తాపడం చేసిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్యాలెస్ లో 60 విలాసవంతమైన గదులు, 22 విశాలమైన హాళ్లు ఉన్నాయి. ఈ ప్యాలెస్ లోని భోజనశాలలో ఉన్న డైనింగ్ టేబుల్ పై ఒకేసారి 100 మంది అతిథులు ఒకేసారి కూర్చుని భోజనం చేయవచ్చు. 108 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తున్న డైనింగ్ టేబుల్ ను బంగారం, క్రిస్టల్ తో తయారు చేశారు. ప్యాలెస్ లోని గ్రంథాలయంలో భారత్ దేశంలోని అతి అరుదైన ఖురాన్ గ్రంథాలున్నాయి. ఇక్కడ బిలియర్డ్స్ టేబుల్స్ చాలా అరుదైనవి. ఇలాంటి టేబుల్స్ రెండు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లండ్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఉంటే మరొకటి ఫలక్ నుమా ప్యాలెస్ లో మాత్రమే ఉంది.[6]

ప్యాలెస్ గోడలపై ఆయిల్ పెయింటింగ్ తో వేసిన ప్రముఖుల ఫోటోలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇలాంటి విశేషాలెన్నో ఫలక్ నుమా ప్యాలెస్ సొంతం. 1883లోనే ఈ భవనములో విద్యుత్, టెలిఫోన్ ఉపయోగించారు. కరెంట్ ఉపయోగించారనడానికి భారతదేశంలోనే అతి పెద్ద స్విచ్ బోర్డు ఇక్కడ చూడవచ్చు. ఈ భవనానికి ఆరోజుల్లో విద్యుత్తును అందించడానికి బొగ్గు ఆదారిత యంత్రాలను ఉపయోగించేవారు. ఆ ప్రాంతంపేరు ఇంజన్ బౌలి అని అంటారు. ఆ ప్రాంతాన్ని ఈ నాటికి అదే పేరుతో పిలుస్తున్నారు.

విలాసవంతమైన హోటల్ గా ఆధునీకరణ

[మార్చు]

2000 సంవత్సరం ముందు వరకు సాధారణ ప్రజలను ఈ ప్యాలెస్ లోకి రానిచ్చేవారు కాదు. కానీ.. తాజ్ గ్రూప్ దీనిని అద్దెకు తీసుకున్న తర్వాత.. దీనిని మరింత ఆధునీకరించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు.[7] ఈ హోటల్ 2010 నవంబరులో ప్రారంభమైంది.[8] ఫ్రాన్స్ నుంచి తెప్పించిన అందమైన ఫర్నీచర్, హస్తకళా వస్తువులతో ఈ హోటల్ ను అందంగా అలంకరించారు.[9]

మూలాలు

[మార్చు]
  1. "Taj Falaknuma Palace".
  2. "Falaknuma Palace". Archived from the original on 2008-03-16.
  3. "Falaknuma palace". 3 March 2015. Archived from the original on 2 April 2015. Retrieved 16 March 2015.
  4. "Affairs of state". Business-standard.com. Retrieved 2012-12-20.
  5. "Falaknuma Palace". Archived from the original on 2013-11-05. Retrieved 2015-03-16.
  6. "Taj Falaknuma Palace review - One with the sky, one with royalty". The Hindu Business Line.
  7. "Ratan Tata to meet K Rosaiah on November 7 - Money - DNA". Dnaindia.com. 2010-10-31. Retrieved 2012-12-20.
  8. "Taj Falaknuma Palace Hyderabad". cleartrip.com.
  9. "The Tribune, Chandigarh, India - Main News". Tribuneindia.com. 2012-12-20.

బయటి లంకెలు

[మార్చు]