ఫలక్‌నుమా దాస్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'''ఫలక్‌నుమా దాస్‌''' 2019 మే 31 న విడుదలైన తెలుగు సినిమా. విశ్వక్ సేన్ నాయుడు కథా నాయకుడిగా నటించి, దర్శకత్వ్ం వహించాడు.[1]. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై విడుదల అయ్యింది.[2]

కథ[మార్చు]

ఈ కథ హైదరాబాదు లోని ఫలక్‌నుమా లోని దాస్ (విశ్వక్‌ సేన్‌) అనే కుర్రాడి చుట్టూ తిరుగుతుంది . దాస్‌ చిన్నప్పట్నుంచి ఆ ఏరియా లోని శంకర్ అనే దాదాని చూసి పెరుగుతాడు. పెద్దయ్యాక శంకర్ లా అవ్వాలని కలలు కంటాడు. చిన్నప్పుడే ఓ రౌడీ మూకని కూడా తయారు చేసుకుంటాడు. ఈ మూక కు శంకర్ సహకారం కూడా ఇస్తాడు. పాఠశాల స్థాయు లోనే శంకర్ మూక తో తింటూ తిరుగుతూ సరదాగా గడిపేస్తుంటారు. కళాశాలలో అడుగుపెట్టాక ప్రేమ, గొడవలతో దాస్ జీవితం గడుస్తుండగా శంకర్ హత్యకు గురవుతాడు. రవి, రాజు అనే వ్యక్తులు శంకర్‌ను హత్య చేస్తారు.

శంకర్ హత్యతో  మూక ఒంటరి అయిపోతుంది. అప్పటి వరకు హాయిగా బతికిన ఈ మూక కు కష్టాలు మొదలవుతాయి. వీటి నుంచి బయట పడటానికి వ్యాపారం చేద్దామని ఫలక్‌నుమా ప్రాంతంలోనే మాంసం అంగడిని ప్రారంభిస్తారు. అప్పటికే మాంసం వ్యాపారంలో రవి, రాజుదే పైచేయి ఉంటుంది. కానీ దాస్ వ్యాపారం ప్రారంభించాక చేశాక వారి వ్యాపారం మందగిస్తుంది. దాస్ బృందం తమ వ్యాపారానికి అడ్డు వస్తుందని  రవి, రాజు గొడవకు దిగుతారు. ఆ గొడవలో దాస్ మాంసం అంగడిపై నాటు బాంబు వేస్తారు. ఇక అప్పటి నుంచి మొదలైన గొడవలు ఓ హత్యకు దారి తీస్తాయి. దాస్ నాటు బాంబు విసరడంతో ఓ వ్యక్తి చనిపోతాడు. ఇక అప్పటినుంచి దాస్ జీవితం మారిపోతుంది. ఆ కేసు నుంచి బయట పడడానికి దాస్ బృందం చాలా ప్రయత్నిస్తుంది. చివరకు దాస్ ఆ కేసు నుంచి బయట పడ్డాడా? బయటపడడానికి చేసిన ప్రయత్నాలేంటి? అనేది మిగతా కథ లో భాగం.

తారాగణం[మార్చు]

 • విశ్వక్‌ సేన్‌
 • సలోని మిశ్రా
 • హర్షితా గౌర్‌
 • ప్రశాంతి

సాంకేతికవర్గం[మార్చు]

 • పతాకము : వన్మయి క్రియేషన్స్‌[3][4]
 • కూర్పు: రవితేజ
 • సంగీతం: వివేక్‌ సాగర్‌[5]
 • ఛాయాగ్రహణం: విద్యాసాగర్‌ చింతా
 • నిర్మాత: కరాటే రాజు, చర్లపల్లి సందీప్ గౌడ్, మనోజ్ కుమార్ కటోర్ కర్ [6]
 • దర్శకత్వం: విశ్వక్‌ సేన్‌

మూలాలు[మార్చు]

 1. "With native flavour". The Hindu. 2019-02-19. Retrieved 2019-06-09. Cite web requires |website= (help)
 2. "Suresh Productions releasing six films". telugucinema.com. 2019-04-26. Retrieved 2019-06-09. Cite web requires |website= (help)
 3. "::: Media 9 - Celebrity Management". Media9.in. 2015-01-10. Retrieved 2019-06-09. Cite web requires |website= (help)
 4. "Media9 Celebrity Management Private Limited Information - Media9 Celebrity Management Private Limited Company Profile, Media9 Celebrity Management Private Limited News on The Economic Times". M.economictimes.com. Retrieved 2019-06-09. Cite web requires |website= (help)
 5. Saumya (2019-02-19). "Falaknuma Das, Paye Song - Vivek Sagar Delivers Mass With Confidence". Mirchi9.com. Retrieved 2019-06-09. Cite web requires |website= (help)
 6. hybiz.tv. "Manoj Kumar Katokar CEO Of Media9 | My South Diva Calendar - 2019". hybiz.tv. Retrieved 2019-06-09. Cite web requires |website= (help)

బయటి లంకెలు[మార్చు]