Jump to content

హర్షితా గౌర్

వికీపీడియా నుండి
హర్షిత శేఖర్ గౌర్
2018లో హర్షిత గౌర్
జననం (1991-10-12) 1991 అక్టోబరు 12 (వయసు 33)
వృత్తి
  • నటి
  • నర్తకి
క్రియాశీల సంవత్సరాలు2013 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మీర్జాపూర్ (టీవీ సిరీస్)
సద్దా హక్‌-మై లైఫ్ మై ఛాయిస్ (టీవీ సిరీస్)

హర్షిత శేఖర్ గౌర్ (జననం 1992 అక్టోబరు 12) భారతీయ నటి.[1] ఛానల్ వి ఇండియాలో ప్రసారమైన సద్దా హక్‌-మై లైఫ్ మై ఛాయిస్ (2013), అమెజాన్ ప్రైమ్ వీడియో మిర్జాపూర్‌ (2018) లాంటి వెబ్ సిరీస్ లలో తన నటనతో ప్రసిద్ధి చెందింది.[2][3]

2019లో విశ్వక్ సేన్ కథానాయకుడిగా, స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఫలక్‌నుమా దాస్‌ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.[4]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఆమె న్యూఢిల్లీలో వైద్యుల కుటుంబంలో జన్మించింది. ఆమె నోయిడాలోని అమిటీ యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది.[5]

కెరీర్

[మార్చు]

ఆమె ఇంజనీరింగ్‌ చదువుతున్న రోజుల్లోనే మోడల్‌గా తన వృత్తిని ప్రారంభించింది. అదే సమయంలో ఆమెకు సద్దా హక్ నుండి ఆఫర్ వచ్చింది, ఇది ఆమె టెలివిజన్ అరంగేట్రం.[6]

ఆమె కథక్లో శిక్షణ పొంది నృత్యకారిణిగా భారతదేశం అంతటా స్టేజ్ షోలలో ప్రదర్శన ఇచ్చింది. ఆమె డాబర్ వాటికా హెయిర్ ఆయిల్, గార్నియర్ లైట్ క్రీమ్, సన్‌సిల్క్‌తో సహా అనేక వాణిజ్య ప్రకటనలలో కూడా నటించింది. ఆమె తాజా వాణిజ్య ప్రకటన రెనాల్ట్ క్విడ్. 2018లో, అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ మీర్జాపూర్‌లో డింపీ పండిట్ పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఆమె మీర్జాపూర్ రెండవ సీజన్‌లో కూడా నటించింది.[7][8][9][10]

మూలాలు

[మార్చు]
  1. "I don't think Anurag can harass a woman: Harshita". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-09-22. Retrieved 2021-02-12.
  2. Nayak, Elina Priyadarshini. "Sadda Haq hottie Harshita Gaur roped in for Vishwak Sen's remake of Angamaly Diaries". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-01-23.
  3. "Mirzapur actress Harshita Gaur: Web series have a great scope in India". mid-day (in ఇంగ్లీష్). 2018-11-19. Retrieved 2019-01-23.
  4. "With native flavour". The Hindu. 2019-02-19. Retrieved 2019-06-09.
  5. "'साड्डा हक' फेम इस एक्‍ट्रेस ने कराया हॉट Photoshoot, इंटरनेट पर आते ही मच गई सनसनी". hindi.timesnownews.com (in హిందీ). Archived from the original on 2018-12-09. Retrieved 2019-01-23.
  6. Debnath, Neela (2018-11-23). "Mirzapur cast: Who plays Dimpy Pandit? Who is Harshita Gaur?". Express.co.uk (in ఇంగ్లీష్). Retrieved 2019-01-23.
  7. "Harshita Gaur: I refused to get out of my house for days and also stopped meeting people". The Times of India. 27 August 2018. Retrieved 2018-12-07.
  8. "Harshita Gaur : 'साड्डा हक' की हर्षिता गौर ने बताई डिप्रेशन की दुनिया में पहुंचने की कहानी". Navbharat Times (in హిందీ). 2018-08-27. Retrieved 2018-12-07.
  9. "Ghulam actor Param Singh and girlfriend Harshita Gaur call it quits after four years of being together – Shocking break-ups of TV actors, here's the list". The Times of India. Retrieved 2018-12-07.
  10. "Web series have a great scope in India, says Mirzapur actress Harshita Gaur | Bollywood News". www.timesnownews.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2019-01-23.