ఫార్పింగ్
ఫార్పింగ్ | |
---|---|
టౌన్ | |
ఫార్పింగ్ (ఫామ్టింగ్ ) ఖాట్మండు లోయకు దక్షిణాన ఉన్న బాగ్మతి నదికి ఎగువన ఉన్నటువంటి ఒక చిన్న నెవార్ పట్టణం. ఇది ఇప్పుడు దక్షిణ కాళి మున్సిపాలిటీలో భాగంగా ఉంది.
ఈ పట్టణం దాని పరిసర ప్రాంతాలు అనేక ముఖ్యమైన బౌద్ధ యాత్రా స్థలాలతో పాటు బౌద్ధ ఆరామాలు, ధ్యాన విరమణ కేంద్రాలను కలిగి ఉన్నాయి.
పట్టణానికి దక్షిణాన 1 కి.మీ దూరంలో దక్షిణ కాళి ఆలయం ఉంది, ఇది నేపాల్‌లోని ప్రధాన హిందూ దేవాలయాలలో ఒకటి, ఇది తల్లి కాళీ దేవతకి అంకితం చేయబడింది.
ఫార్పింగ్ నేపాల్‌లోని పురాతన జలవిద్యుత్ కేంద్రం. ఇప్పుడు ఇది మ్యూజియంగా ఉంది.[1]
బౌద్ధ యాత్రా స్థలాలు
[మార్చు]ఫామ్టింగ్ వజ్రయోగిని ఆలయం
[మార్చు]వజ్రయోగినికి అంకితం చేయబడిన ఈ ఆలయం, యాంగ్లేషో గుహలకు ఫార్పింగ్ పట్టణమునకు మధ్య ఉన్న కొండ ప్రాంతంలో ఉంది. ఈ పట్టణంలోని ప్రధానమైన నేవార్ బౌద్ధ వజ్రయోగిని దేవాలయాలు,
- శంఖు వజ్రయోగిని,
- విద్యేష్వరి వజ్రయోగిని,
- ఫామ్టింగ్ వజ్రయోగిని,
- గయేశ్వరి
- పుల్చౌక్ ఖగయోగిని.
ఈ ఆలయం బౌద్ధ మహాసిద్ధులైన నరోపా,మైత్రేపా శిష్యులలో ముఖ్యమైన ‘పామ్టింగ్పా’ సోదరులచే స్థాపించబడింది. ప్రస్తుత ఈ నిర్మాణం 17వ శతాబ్దానికి చెందినది.
యాంగ్లేషో గుహ
[మార్చు]యాంగ్లేషో గుహ (టిబ్. ཡང་ལེ་ཤོད་ཀྱི་བྲག་ཕུག, వైల్. yang le shod kyi brag phug ) ఫార్పింగ్ పట్టణం నుండి కాళీ నడకన పది నిమిషాలలో చేరు కోవచ్చు. యాంగ్లేషో గుహకు సమీపంలో శేష నారాయణుని రూపంలో విష్ణువుకు అంకితం చేయబడిన అనేక పెద్ద చెరువులు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. గురు పద్మసంభవుడు డోర్జే టోట్రెంగ్ త్సాల్, అతని భార్య యువరాణి ’ శాక్యాదేవి’ రూపంలో ఇక్కడి గుహలో యాంగ్‌డక్ తంత్రంపై ధ్యానం చేశారని చెబుతారు. అలాగే ‘యోగిన్ చత్రల్ సాంగ్యే దోర్జ్’కూడా ఇక్కడ అనేక సంవత్సరాల బస చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.ఈ మఠం లాంగ్‌చెన్ న్యింగ్‌థిగ్ సంప్రదాయంకు సంబందించిన ధ్యాన అభ్యాసాలకు అంకితం చేయబడింది.
బౌద్ధ విహారాలు
[మార్చు]నెయిడో తాషి చోలింగ్ మొనాస్టరీ
[మార్చు]నేడో తాషి చోలింగ్ అనేది 200 మంది సన్యాసులతో కూడిన ఒక పెద్ద ఆశ్రమం, ఇది ఫార్పింగ్ శివార్లలోని సెటిదేవి భంజ్యాంగ్ వద్ద ఉంది. ఈ మఠాన్ని 2006లో ఏడవ కర్మ చాగ్మే తుల్కు (1926-2013) స్థాపించారు. ఇది మొదటి కర్మ చాగ్మే, రాగ ఆస్య (1613-1678) ద్వారా టిబెట్‌లో స్థాపించబడిన కర్మ. కాగ్యు సంప్రదాయంలోని నీడో ఉప-విభాగానికి చెందినది. ఈ మఠం ఆశ్రమం పక్కనే అతిథి గృహాన్ని కూడా నడుపుతోంది.
పల్యుల్ సామ్టెన్ ఓసెల్ లింగ్
[మార్చు]పల్యుల్ సామ్టెన్ ఓసెల్ లింగ్ 1996లో స్థాపించబడింది. 1997లో డ్రబ్‌వంగ్ పెమా నోర్బు రిన్‌పోచేచే ఆశీర్వదించబడింది. 1997లో చత్రాల్ సంగ్యే డోర్జే ద్వారా 1984 జూలై 19న పవిత్రం చేయబడింది. ఈ మఠానికి ప్రస్తుతం ఖెంచెన్ నామ్‌డ్రోల్ త్సెరింగ్ రిన్‌పోచే నాయకత్వం వహిస్తున్నాడు.
టెగ్చెన్ లెక్షీలింగ్ రిట్రీట్ సెంటర్
[మార్చు]టెగ్చెన్ లెక్షీలింగ్ రిట్రీట్ సెంటర్ సన్యాసినుల కోసం ఏర్పాటుచేసిన ఒక చిన్న క్లోజ్డ్ రిట్రీట్ సెంటర్, ఇది కర్మ థిన్లీ రిన్‌పోచేచే స్థాపించబడింది, ఇది ఫర్పింగ్‌లోని బెంచెన్ షెడ్రా ,రిట్రీట్ సెంటర్‌కు సమీపంలో ఉంది. ఈ సెంటర్ కీ సమీపంలో రింపోచే టెగ్చెన్ లెక్షీలింగ్ సన్యాసినులకు అనుబంధంగా ఉంది. . ఇక్కడ సన్యాసినులు మూడు సంవత్సరాలు, మూడు నెలలు, మూడు రోజుల సాంప్రదాయబద్దమైన ధ్యానం సాధచేస్తారు.
హిందూ దేవాలయాలు
[మార్చు]దక్షిణకాళి ఆలయం
[మార్చు]దక్షిణ కాళి ఆలయం, ఫార్పింగ్ పట్టణానికి 1 కిలోమీటరు ముందు ఉంది. ఇది నేపాల్‌లోని తల్లి ఉగ్రకాళికి అంకితం చేయబడిన ప్రధాన దేవాలయాలలో ఒకటి. జంతు బలి, ఇక్కడ దేవతను పూజించే ప్రధాన మార్గాలలో ఒకటి. ప్రత్యేకించి మగ మేకలను ఎక్కువగా బలి ఇస్తారు. ఇది ముఖ్యంగా దశైన్ పండుగ సమయంలో కనిపిస్తుంది.
శేషనారాయణ దేవాలయం
[మార్చు]యాంగ్లేషో గుహకి దిగువన ఉన్న ఈ ఆలయం ఖాట్మండు లోయలోని నాలుగు ప్రధాన నారాయణ దేవాలయాలలో ఒకటి. మిగిలిన మూడు దేవాలయాలు ‘ఇచ్చంగు నారాయణ్, ‘బిశంకు నారాయణ్ ‘చంగు నారాయణ్’ . లోయకు నాలుగు ప్రధాన దిశలలో ఉన్న ఈ దేవాలయాలు లిచ్ఛవి రాజు విష్ణుగుప్త పాలనలో నిర్మించబడినవి అని నమ్ముతారు.
ఫార్పింగ్ జలవిద్యుత్ కేంద్రం
[మార్చు]ఫార్పింగ్ జల విద్యుత్ కేంద్రాన్ని 1911లో ప్రధాన మంత్రి ‘చంద్ర షంషేర్ జంగ్ బహదూర్ రాణా చంద్రజ్యోతి’
హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్‌గా స్థాపించారు. 2010 వ సంవత్సరం లో, దీనిని నేపాల్ ప్రభుత్వం "లివింగ్ మ్యూజియం"గా ప్రకటించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
ఈ రిజర్వాయర్ ఇప్పటికీ లలిత్‌పూర్‌లోని కొన్ని ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ "Pharping".
{{cite web}}
: CS1 maint: url-status (link)
వెలుపలి లంకెలు
[మార్చు]- Asura Cave & Yangleshö Archived 2019-04-09 at the Wayback Machine
- Pharping Archived 2021-12-14 at the Wayback Machine - at Nepal Power Places
- Pharping – The Sacred Site of Asura Cave and Yangleshö