ఫాసిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముస్సోలినీ, అదాల్ఫ్ హిట్లర్ లు ఫాసిజం ఇటలీ నాయకులు.

ఇటలీ దేశంలో 1920-1945 మధ్య ముస్సోలినీ మొదలుపెట్టి,పరిపాలనారెండో ప్రపంచ యుద్ధానికి ఒక ముఖ్య కారణంగా పరిగణించబడుతున్న తీవ్ర నియంతృత్వ జాతీయవాద పరిపాలనా విధానానికే ఫాసిజం అని పేరు. ఈ పదం సామాన్యార్థంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాఁటి ప్రభుత్వ, సంస్థా పాలనా యాజమాన్య పద్ధతులను సూచించే అర్థం లే ప్రాచుర్యం లో ఉంది.

ఫాసిజం జాతీయత పేరిట ప్రజా సమూహాలని ఒక్కతాటి మీదకు తేవడానికి ప్రయత్నిస్తుంది. విప్లవాత్మక నియంతల నాయకత్వంలో అధికపక్ష ప్రజల కొమ్ముగాచి (ఆ ప్రక్రియలో అల్పసంఖ్యాక వర్గాల అవసరాలను విస్మరిస్తూ) కొనసాగే వేర్పాటువాద ధోరణి ఫాసిజం. సహజం గానే ఈ పదానికి నవీన సమాజంలో ఆపాదన చెడు అర్థంలోనే ఉంది. మధ్య ముస్సోలినీ మొదలుపెట్టి, రెండో ప్రపంచ యుద్ధానికి ఒక ముఖ్య కారణంగా పరిగణించబడుతున్న తీవ్ర నియంతృత్వ జాతీయవాద పరిపాలనా విధానానికే ఫాసిజం అని పేరు. ఈ పదం సామాన్యార్థంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాఁటి ప్రభుత్వ, సంస్థా పాలనా యాజమాన్య పద్ధతులను సూచించే అర్థం లే ప్రాచుర్యం లో ఉంది.

ఫాసిజం జాతీయత పేరిట ప్రజా సమూహాలని ఒక్కతాటి మీదకు తేవడానికి ప్రయత్నిస్తుంది. విప్లవాత్మక నియంతల నాయకత్వంలో అధికపక్ష ప్రజల కొమ్ముగాచి (ఆ ప్రక్రియలో అల్పసంఖ్యాక వర్గాల అవసరాలను విస్మరిస్తూ) కొనసాగే వేర్పాటువాద ధోరణి ఫాసిజం. సహజం గానే ఈ పదానికి నవీన సమాజంలో ఆపాదన చెడు అర్థంలోనే ఉంది.

ఫాసిజం నిర్వచనము

[మార్చు]

ఫాసిజం అనగా ఏమిటి? ఎవరిని ఫాసిస్ట్ వాదులు అని అంటారు? అనేవి ఖచ్చితమైన సమాధానం దొరకని ప్రశ్నలు. ఎందుకనగా పాసిజం అనే భావాన్ని రాజకీయ ప్రయోజనాలకు, పరస్పర దూషణలకు వినియోగించడం జరిగుతున్నది. ఒకే వ్యక్తి సొంతం చేసుకున్న ప్రభుత్వ వ్యవస్థ గా ఫాసిజం ను ఫ్రాంక్లిన్ డి.రూజ్‌వెల్ట్ నిర్వచించాడు. ప్రజలు ఎప్పుడైతే ప్రజాస్వామిక సంస్థలకంటె బలమైనవిగా ఇతర శక్తులను పెరగనిస్తారో, అప్పుడు ప్రజాస్వామిక స్వేచ్చ అంతరిస్తుంది ఆయన భావించాడు.

ఫాసిజం అవతరణ

[మార్చు]

మొదటి ప్రపంచయుద్ధం తరువాత ఇటలీలో అనేక పరిస్థితులు ఫాసిజం ఆవిర్భావానికి దారితీసాయి. ఆర్ధిక సాంఘిక రంగాలలో అవ్యవస్థత, ద్రవ్యోల్బణము, నిరుద్యోగము, సమ్మెలు, సైన్యంలో అసంతృప్తి ప్రజల అపనమ్మకం నియోతృత్వ వాదానికి దారితీసాయి. ప్రాచీన రోమన్ సామ్రాజ్య వైభవాన్ని ఇటలీకి తిరిగి కల్పించాలన్న ఆశ ప్రజల్ని శాంతి భద్రతకోసం ఆకాంక్షించేటట్లు చేసింది. 1922లో బెనిటో ముసోలిని నాయకత్వంలో ఫాసిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1922 నుండి 1945 వరకు ఇటలీలో ఫాసిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇటలీ పరాజయంతో ముసోలినీ పతనంతో ముగిసింది.

ఫాసిజం ఒక రాజనీతితత్త్వంగా అవతరించలేదు. అయితే ఫాసిస్ట్ సిద్ధాంతకర్తలు డార్విన్ సిద్ధాంతము ( సమాజిక చైతన్యము, రాజ్యవిస్తరణ), మేధాశక్తి వ్యతిరేకవాదము, జర్మన్ ఆదర్శవాదము (హెగెల్,కాంట్, ఫిచీ మొదలగువారి రాజ్యం ఒక మహోన్నతవ్యవస్థ) మొదలగు సిద్ధాంతాలపై ఆధరపడి అవతరించిందనే చెప్పవచ్చును. ఫాసిజం ఒక క్రమబద్దమైన సిద్ధాంతముకాదు. దీనికి ఒక నిర్ణీతమైన, స్పష్టమైన కార్యక్రమము లేదు. హింసాకండద్వారా దమన నీతిద్వారా అధికారాన్ని సంపాదించుకొని, పదవిలో కొనసాగటానికి ఉపయోగపడే సాధనాలను మాత్రమే ఫాసిజం సూచిస్తుంది. వాటిని ప్రజలు విధేయతతో ఆచరించాలి.

ఫాసిస్ట్ ప్రధానకర్త అయిన రాకా (Alfredo Rocco) ఫాసిజం గురించి ఈవిధంగా చెబుతాడు. ఫాసిజం ఒక నూతన సమాజాన్ని శక్తివంతమైన, ప్రయోజనాత్మకమైన ఉద్యమంద్వారా ఒక నవీన సంస్కృతి ప్రారంభాన్ని సూచిస్తుంది. ఫాసిజంప్రజాస్వామ్యాన్ని, ఉదారవాదాన్ని, సామ్యవాదాన్ని వ్యతిరేకిస్తుంది. మొదటి రెండు వ్యక్తి అసక్తులకు, మూడవది ఒక ఆర్దికవర్గం ఆసక్తులకు ప్రాధాన్యత వహిస్తే ఫాసిజం అందరి ప్రయోజనాలను కాంక్షిస్తుంది. దీనికి సమాజ శ్రేయస్సు అంతిమ లక్ష్యం, సాధనాలు వ్యక్తులు.

ఫాసిస్ట్ రాజ్యం ప్రజల సంపదకు, వ్యక్తిగత రక్షణకు, సౌఖ్యాలకు మాత్రమే పరిమితం కాదు. ఫాసిస్ట్ భావనలలో రాజ్యం ద్వారానే వ్యక్తికి జీవనం సుఖమయం అవుతుంది. సర్వం రాజ్యం లోపలే; రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యానికి అతీతంగా ఏదీ సాధ్యంకాదు.

ఫాసిజం ప్రజాస్వామ్యానికి బద్దశత్రువు అన్నవాదం

[మార్చు]

ఫాసిస్ట్ లు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తారు.పార్లమంటరీ వ్యవస్థలకు వారు బద్ద శత్రువులు. వారిదృష్టిలో ప్రాతినిద్య సంస్థలు అసమర్ధతకు, అవినీతికి నిలయాలు. ప్రజాస్వామ్యాన్ని ముసోలిని ఈ విధంగా విమర్సించాడు: ఫాసిజం ప్రజాస్వామ్యాన్ని సిద్ధాంత రీత్యా, ఆచరణ రీత్యా వ్యతిరేకిస్తుంది. సంఖ్యాబల నిర్ణయాలద్వారా ప్రభుత్వాన్ని నిర్దేసించటాన్ని ఫాసిజం తోసిపుచ్చుతుంది. ప్రజలకు సార్వభూమాధికారం ఉందంటూ బాధ్యత లేని వ్యక్తులు చలాయించే విధానమే, వ్యవస్థే ప్రజాస్వామ్యము అని మేము అంటాము. ఫాసిస్ట్ లు ప్రజాస్వామ్య వ్యతిరేకులు కాబట్టే వారు ప్రతి పక్షాలను వారు సహించరు. తమ క్షేమానికి, పార్టీ క్షేమానికి భంగకరం అయినది దేశానికీ భంగకరమే. వాటిని నిషేధించటానికి ప్రయత్నిస్తారు.దీనికి అనుగుణంగా రాజ్యాంగ సవరణలు జరుపబడ్డాయి.అసత్యప్రచారం హిట్లర్ ప్రభుత్వంలో ప్రచారశాఖ అత్యంత కీలకమైన శాఖ. వాణిజ్య ప్రచార పద్దతులను రాజ్కీయ ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చునన్న విషయాన్ని మొట్ట మొదటిగా గుర్తించిన యూరోపియన్ రాజకీయవేత్త హిట్లర్. ఇటువంటి పద్దతినే ఆపై మిగతా ఫాసిస్ట్ లు కొనసాగించారు కుడా!

వ్యక్తారాధన (Hero Worship)

[మార్చు]

ఫాసిస్ట్ రాజ్యంలో నియంతకే సర్వాధికారాలు ఉంటాయి. అతని అభిప్రాయం గొప్పది. అతని నిర్ణయం తిరుగులేనిది. అతడే రాజ్యము. రాజ్యమే అతడు. నేనే రాజ్యము రాజ్యమే నేను లూయీస్ 4 ప్రభువు చెప్పుకున్నాడు ఈవిధంగా కూడా! ఫాసిస్ట్ నియంతలలో అందరికంటే నేనే గొప్ప (Maglomaniac) అనే మానసిక రోగం కనిపిస్తూ ఉంటుంది అనడంలో సందేహము లేదు.

మూలములు

[మార్చు]
  • 1980 భారతి మాసపత్రిక: వ్యాసము: ఫాసిజం - ఒకపరిశీలన్- వ్యాసకర్త: శ్రీ. వి. కృష్ణారావుగారు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫాసిజం&oldid=3713602" నుండి వెలికితీశారు