Jump to content

ముస్సోలినీ

వికీపీడియా నుండి
బెనిటో ముస్సోలినీ
ముస్సోలినీ


పదవీ కాలం
అక్టోబరు 31, 1922 – జూలై 25, 1943
చక్రవర్తి విక్టర్ ఇమ్మాన్యుయెల్ III
ముందు లుయిగి ఫాక్టా
తరువాత పియెట్రో బడోగ్లియో (Provisional Military Government)

పదవీ కాలం
మార్చి 30, 1938 – జూలై 25, 1943
తరువాత పియెట్రో బడోగ్లియో

పదవీ కాలం
సెప్టెంబరు 23, 1943 – ఏప్రిల్ 26, 1945

వ్యక్తిగత వివరాలు

జననం (1883-07-29)1883 జూలై 29
ప్రెడాప్పియో, ఫోర్లై, ఇటలీ
మరణం 1945 ఏప్రిల్ 28(1945-04-28) (వయసు 61)
గియూలినో డి మెజ్జాగ్రా, ఇటలీ
జాతీయత ఇటాలియన్
రాజకీయ పార్టీ రిపబ్లికన్ ఫాసిస్టు పార్టీ
(1943-1945)
జాతీయ ఫాసిస్టు పార్టీ
(1921-1943)
ఇటలీ సోషలిస్టు పార్టీ
(1901-1914)
జీవిత భాగస్వామి రచేలే ముస్సోలినీ
వృత్తి రాజకీయ నాయకుడు, జర్నలిస్టు
మతం రోమన్ కేథలిక్ గా 1927 లో మతాంతీకరణ, ప్రాథమిక జీవితంలో మతరహితంగా వున్నాడు.

బెనిటో అమిల్‌కేర్ ఆండ్రియా ముస్సోలినీ (ఆంగ్లం :Benito Amilcare Andrea Mussolini, GCB KSMOM GCTE (జూలై 29, 1883ఏప్రిల్ 28, 1945) ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఇతడు జాతీయ ఫాసిస్టు పార్టీని నడిపాడు, ఫాసిజంను సృష్టించిన వారిలో అగ్రగణ్యుడు. ఇతను 1922 లో ఇటలీ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు, డ్యూస్గా 1925 లో బిరుదు పొందాడు. 1936 తరువాత, అధికారికంగా ఇతడి బిరుదు, "హిజ్ ఎక్సెల్లెన్సీ బెనిటో ముస్సోలినీ, హెడ్ ఆఫ్ గవర్నమెంట్, డ్యూస్ ఆఫ్ ఫాసిజం, అండ్ ఫౌండర్ ఆఫ్ ద ఎంపైర్".[1] రెండవ ప్రపంచ యుద్ధంలో ముస్సోలినీ, జపాన్, జర్మనీలతో కలసి అక్ష రాజ్యాలు ఏర్పరచాడు, జూన్ 10 1940 లో ఇటలీని యుద్ధప్రవేశం గావించాడు

ముస్సోలినీ

జననం

[మార్చు]

ముస్సోలినీ 1883లో ఇటలీలో ఫోర్లీ అను చోట ఒక కమ్మరి కుటుంబములో జన్మించాడు.ముస్సోలినీ తండ్రి కమ్మరి, సామ్యవాది. విద్యార్థిదశలోనే రాచరిక సర్వాధికారాన్ని ప్రబోధించు గ్రంథములను చదివి విప్లవ సామ్యవాదిగా మారాడు.కొతకాలము తర్వాత సోషలిస్టు పత్రికైన అవంత్ కు సంపాదకత్వం వహించాడు.మొదటగా ఉపాధ్యాయునిగా తన జీవితం ఆరంభించినప్పటికి తరువాత ముస్సోలినీ సామ్యవాద సిద్ధాంతాలను స్విట్జర్లాండ్,ఆస్ట్రియా,ఇటలీ లలో ప్రచారం చేసాడు.

ఫాసిస్ట్ పార్టీ స్థాపన

[మార్చు]

మొదటి ప్రపంచయుద్దంలో ఇటలీ ప్రవేశించుటను సోషలిస్టులు వ్యతిరేకించడముతో ముస్సోలినీ సోషలిస్టు పార్టీని విడిచిపెట్టి 'పాపులోడి ఇటాలియా' అను పత్రిక ద్వారా తన జాతీయత భావాలను ప్రచారం చేసాడు.సైన్యములో చేరి 1917 వరకు మొదటి ప్రపంచ యుద్దంలో పాల్గొనినాడు.1919 లో మిలాన్ లో ఫాసిస్ట్ పార్టీ స్థాపించాడు.

ఫాసజమ్

[మార్చు]

ఫాసిజమనే పదాన్ని 'కడ్డిల కట్టా అను అర్ధం గల 'ఫాసియో' అను రోమన్ పదం నుండి ఉత్పన్నం అయింది.ఫాసిస్టులు తమ వస్త్రధారణము చేసేవారు.వారందరు నల్లచొక్కాలను ధరించేవారు.సైనిక కంపేనీల మాదిరిగా కవాతులు చేసేవారు.వీరు ఇటాలియన్ జాతీయవాదం కోసం బద్ధులయినారు.అంతర్జాతీయ కమ్యునిస్టు ఉద్యమానికి సంబంధించిన సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇటలీలో ఫాసిజం వృద్ధి చెందింది.ఫాసిస్టులు దేశం మొత్తంమీద క్లబ్బులను ఏర్పాటుచేసారు.

సిద్ధాంతాలు

[మార్చు]
  • ఫాసిజం ప్రజాస్వామ్యాన్ని,సామ్యవాదాన్నీ,ఉదారవాదాన్నీ వ్యతిరేకించింది.
  • వ్యక్తిగత ప్రయొజనాల కన్నా దేశ ప్రయొజనాలకే అత్యధక ప్రాధాన్యం ఇచ్చింది.
  • దేశానికి ఒకేఒక పార్టీ ఉపయొగకరమయినని ఇది విశ్వసించింది.
  • వీరికి శాంతి పట్ల విశ్వాసం లేదు.

ముస్సోలినీ అధకారంలోకి రావడం

[మార్చు]

ఫాసిస్ట్ పార్టీ ఏర్పాటయిన తరువాత క్రమక్రమముగా సోషలిస్టులు,కమ్యునిస్టులు ముస్సోలినీకి వ్యతిరేకులయిరి.పెట్టుబడిదారుల తరపున వీరు సామ్యవాదులను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి,భూస్వాములు వీరికి నిధులు సమకూర్చారు.మధ్య తరగతి ప్రజలు,విద్యార్థులు,సైనికులు ఈ పార్టిలో చేరారు.విద్యా సంస్థలు,రేడొయోలు,సిని

మాలు,పత్రికలు వీరి సిద్ధాంతములను ప్రచారంలోకి తెచ్చాయి. 1922లో నేపుల్స్ లో ఫాసిస్ట్ పార్టీ సమావేశము జరిగింది.ఆ సభలో ముస్సోలినీ నాటి ఇటలీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించాడు.దాదాపు 50,000 ల మంది ఈ సభకు నల్ల చొక్కాలు ధరించి హాజరైనారు.ఈ చర్య తరువాత నాటి ఇటలీ రాజైన విక్టర్,ప్రభుత్వం ఏర్పాటుచేయమని ముస్సోలినీనీ అహ్వానించాడు. ముస్సోలినీనీ ఇటలీ ప్రధానమంత్రిగా రాజు నియమించాడు.

ప్రధానిగా ముస్సోలినీ సంస్కరణలు

[మార్చు]

పార్టీ వ్యవస్థీకరణము

[మార్చు]

ఫాసిస్ట్ పార్టీ మినహా మిగిలిన పార్టీలు రద్దు పరచబడినవి.పార్టీ రాజ్యాంగమును అనుసరించి,ప్రభుత్వ నిర్ణయములను పార్టీయో చేయును.20 మంది సభ్యులతో కూడిన ఒక మండలిని ఏర్పాటుచేసి దానికి శాశ్వత అధ్యక్షుడిగా ముస్సోలినీ ఎన్నిక చేయబడినాడు.

అధికార నియంతృత్వము

[మార్చు]

ముస్సోలినీ ఫాసిస్టు మండలికి శాశ్వత అధ్యక్షుడు కాగానే,వ్యక్తి స్వాతంత్ర్యమును,పత్రిక స్వాతంత్ర్యమును రద్దుచేసాడు.స్థానిక సంస్థల కున్న అధికారాలను రద్దు పరచి వాటిని ప్రభుత్వ ఉద్యోగుల ఆధినములో ఉంచాడు.కార్మిక,ఉద్యోక సంఘములు నిషేధించబడ్డాయి.ఆర్ధ్క హక్కుల కోసం కార్మికులు సమ్మె చేయు హక్కులు రద్దయినాయి.పార్టీ వవ్యతిరేకులను దేశం న్యుండి బహిష్కరించడం,మరికొదరిని చంపించడం చేసాడు.

సైనిక పునర్మిమాణము

[మార్చు]

ఇటలీ తన స్వయంప్రతిపత్తిని పరిరక్షించుకొనుటకు దేశ పౌరులందరు సంసిద్దిలయి ఉండవలెనని ప్రాభోదించి వారిలో దేశాభిమానమును పెంపొందించాడు.సైనిక,వైమానిక,నౌకదళములను వృద్ధి పరచాడు.

ఆర్ధిక నియంత్రణ

[మార్చు]

ఫాసిజం కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఒక నూతన ఆర్థికవ్యవస్థను ఏర్పరిచాడు.ఇందువల్ల ప్రజస్వామ్యమునకు బదులు ఒక సంఘటితమైన రాజ్యము అవతరించింది.పెట్టుబడిదారులు,శ్రమజీవులు కలిసి దేశాభ్యుదయమునకు పాల్పడవలెనని ఆయుత్తపరచాడు..ఆర్ధిక రంగమును 13 సిండికేట్లుగా విభజించి వాటిని యజమానులు,కార్మికులచే నిర్వహించబడునట్లు చేసాడు.యాజమాన్యాలకు,కార్మికులకు మద్య తగాదాలను పరిష్కరించుటకు ప్రత్యేక పారిశ్రామిక న్యాయస్థానాలను ఏర్పరిచాడు.చిత్తడి నేలలను,బంజరు నేలలను సాగులోకి తీసుకువచ్చి వ్యవసాయాభివృద్ధికి తోర్పాడ్డాడు.

సాంఘీక సమన్యయం

[మార్చు]

కార్మికులకు రోజులో 8గంటల పని,వారంలో ఒకరోజు వేతనముతో కూడిన సెలవు ప్రకటించాడు.కార్మిక సంక్షేమమునకు భీమ,పింఛను పధకములను,వైద్య సదుపాయాలను ప్రకటించాడు.ప్రాచిన కట్టడములను పరిరక్షించుట,శిథిలావస్థలో ఉన్నవాటిని మరమ్మతు చేయించుట,పూరవస్తు పరిశోధశాఖను ఏర్పాటుచేయుట చేసాడు.ఇటలీలో పాఠశాలలను విస్తరించి,వాటిలో విద్యా విధానమునను ఫాసిస్టు సిద్ధాంతాల అనుగూణముగా మార్చాడు.ఇట్టి పనుల వల్ల నిరుద్యోగ సమస్య చాలావరకు తీరింది.

పోప్ తో ఒప్పందము

[మార్చు]

పోప్ తో విభేదములు దేశ విచ్చితికి కారణమవునని గ్రహించిన ముస్సోలినీ 1929 లో నాటి పోప్ 11వ పయన్ తో ఒక ఒప్పందమును కుదుర్చుకున్నాడు.దీని ద్వారా పోప్ భుభాగములపై పోప్ను అధిపతిగా ముస్సోలినీ గుర్తించాడు.అదే విధముగా పోప్ కూడా ఇటలీలో ముస్సోలినీ సర్వాధికారములను పోప్ గుర్తించాడు.

విదేశి విధానాలు

[మార్చు]

ఫాసిస్టు ప్రభుత్వ అధీనములో సామృజ్య విస్తరనకు ముస్సోలినీ కృషి చేసాడు.1924 లో ఒక సంధి ప్రకారము యుగోస్లేవియా నుండి 'ప్యూమ్' అను ఓడరేవును సంపాదించాడు.తూర్పు ఆఫ్రికాలోను,లిబియా లోను వలసలు ఏర్పరిచాడు.1936లో ఇథియోపియాను జయించాడు.స్పెయిన్ అంతర్యుద్దములో జనరల్ ఫ్రాంకోకు సహాయం చేసాడు.కమ్యూనిజాన్ని అరికట్టుటకు జర్మనీ,జపాన్ లతో కలిసి సంధి చేసుకున్నాడు.ఓక విధముగా రెండవ ప్రపంచ యుద్ద కారకుడయినాడు.

పతనం

[మార్చు]
ఎడమ నుండి కుడికి, మీరు మాజీ కమ్యూనిస్ట్ రాజకీయవేత్త నికోలా బొంబాక్సీ, డ్యూస్ బెనిటో ముస్సోలినీ, అతని నమ్మకమైన ప్రేమికుడు క్లారా పెటాచి, మంత్రి అలెశాండ్రో పావోలిని, ప్రఖ్యాత ఫాసిస్ట్ రాజకీయవేత్త అకిల్ స్టారేస్ యొక్క నిర్జీవ దేహాలను ప్లాజా లోరెటోలో ప్రదర్శించడం చూడవచ్చు. 1945లో మిలన్ నగరం.

ముస్సోలినీ యొక్క ప్రణాళికలు వ్యయంతో కూడుకున్నవి కావడం వల్ల ప్రజలపై పన్నుల భారం పెరిగింది.1929-33 ల మద్య ఏర్పడ్డ ప్రపంచ ఆర్థిక మాంద్యం ఇటలీని దెబ్బతీసింది.హిట్లర్తో సంధి చేసుకుని రెండవ ప్రపంచ యుద్దమునకు కారకుడైన 1943 వరకు విజయాలు సాధించాడు.అయితే 1943 లో మిత్ర రాజ్యాల సేనలు సిసిలీని ఆక్రమించినవి.ఫాసిస్ట్ మహాసభ అతని నాయకత్వమును తిరస్కరించింది.యుద్ద వైఫల్యానికి అతడే కారణమని 1945 ఏప్రిల్ 28 న ఇటాలియన్లు అతనిని కాల్చి చంపారు.

మొదటి ప్రపంచయుద్దనంతరం ఇటలీలో గల అరాచక శక్తులను అణిచి సమైక్యతను ఏర్పరిచాడు.తన ఆర్థిక సంస్కరణల ద్వారా కమ్యూనిజానికి ఇటలీలో తావులేకుండా చేసాడు కాని తీవ్ర జాతీయవాదము,దురాక్రమణల ద్వారా రెండవ ప్రపంచ యుద్ద కారకుల్లో ఒకడైనాడు.

మూలాలు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

ముస్సోలినీ రచనలు

[మార్చు]
  • Giovanni Hus (జాన్ హుస్), il veridico Rome (1913) Published in America under John Hus (New York: Albert and Charles Boni, 1929) Republished by the Italian Book Co., NY (1939) under John Hus, the Veracious.
  • The Cardinal's Mistress (trans. Hiram Motherwell, New York: Albert and Charles Boni, 1928)
  • There is an essay on "The Doctrine of Fascism" credited to Benito Mussolini but ghost written by Giovanni Gentile that appeared in the 1932 edition of the Enciclopedia Italiana, and excerpts can be read at Doctrine of Fascism. There are also links to the complete text.
  • La Mia Vita ("My Life"), Mussolini's autobiography written upon request of the American Ambassador in Rome (Child). Mussolini, at first not interested, decided to dictate the story of his life to Arnaldo Mussolini, his brother. The story covers the period up to 1929, includes Mussolini's personal thoughts on Italian Politics and the reasons that motivated his new revolutionary idea. It covers the march on Rome and the beginning of the dictatorship and includes some of his most famous speeches in the Italian Parliament (Oct 1924, Jan 1925).
  • From 1951 to 1962 Edoardo and Duilio Susmel worked for "La Fenice" publisher in order to print opera omnia (all the works) of Mussolini in 35 volumes.

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
Benito Mussolini గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

  • Benito Mussolini in pictures
  • Commando Supremo: Benito Mussolini
  • Did Mussolini really make the trains run on time?
  • Is Mussolini quote on corporatism accurate?
  • Mussolini comemoration in Latvia
  • Mussolini’s War Statement - Declaration of War against USA, December 11, 1941
  • Declaration of War on France and England
  • Benito Mussolini Speeches
  • My Rise and Fall. Click on the result titled "My Rise and Fall" (usually the top result). Then use the search form in the left column titled "search within this book."
  • The 1928 autobiography of Benito Mussolini. Online. Archived 2006-02-22 at the Wayback Machine My Autobiography. Book by Benito Mussolini; Charles Scribner's Sons, 1928.
  • Michael Schirru's failed attempt on Mussolini's life
  • The Jewish mother of Fascism Haaretz article on Margherita Sarfatti by Saviona Mane