Jump to content

ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి

ఫిల్మ్ డివిజన్ ఆఫ్ ఇండియా (ఎఫ్డిఐ) (The Films Division of India (FDI) భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని చలనచిత్ర నిర్మాణ సంస్థ. డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించడం, వార్తా పత్రికలను ప్రచురించడం, భారతీయ చరిత్ర సినిమా రికార్డులను సంరక్షించడం ముఖ్య ఉద్దేశ్యాలతో 1948 సంవత్సరంలో స్థాపించబడిన సంస్థ. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దీనితో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో 12 ప్రాంతీయ కేంద్రాలు కూడా ఉన్నాయి.[1]

ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా
రకంపబ్లిక్
పరిశ్రమఎలక్ట్రానిక్ మీడియా
శైలిElectronic
స్థాపన1948
స్థాపకుడుభారత ప్రభుత్వం
విధివిలీనంనేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
ప్రధాన కార్యాలయం24, డాక్టర్ జి.దేశ్ ముఖ్ మార్గ్, సమాచార,మంత్రిత్వ శాఖ, ముంబై -26
Number of locations
ప్రాంతీయ కార్యాలయాలు:
కోల్ కతా
బెంగళూరు
న్యూ ఢిల్లీ
చెన్నై
తిరువనంతపురం
హైదరాబాద్
విజయవాడ[2]
మాతృ సంస్థసమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వెబ్‌సైట్www.filmsdivision.org

చరిత్ర

[మార్చు]

ఫిల్మ్స్ డివిజన్ ప్రపంచంలోని అతిపెద్ద షార్ట్ ఫిల్మ్ నిర్మాణ సంస్థలలో ఒకటి. 1948 సంవత్సరంలో ప్రారంభం నుండి మొదటి 25 సంవత్సరాలలో మొత్తం 3,848 డాక్యుమెంటరీలు, న్యూస్ రీల్స్ ను నిర్మించింది. 15 భాషల్లో విడుదలైన ఈ చిత్రాల ప్రింట్లు కలిపితే సుమారు 7,52,324 వరకు ఉన్నాయి. ఫిల్మ్ డివిజన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ డి ఐ ) ,ఈ సమయంలో ఎఫ్డి వెనిస్, కార్లోవీ వేరీ, బెర్లిన్, మాస్కో, క్రాకో, తాష్కెంట్, లీప్జిగ్, టెహ్రాన్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నుండి 79 ప్రధాన అవార్డులు, 495 డిప్లొమాలు గుర్తింపు పొందింది. స్వాతంత్య్రం వచ్చిన కొన్ని సంవత్సరాలు ఎఫ్ డి ఐ ఉద్దేశ్యం ప్రధానంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయడం వంటివి చేసింది.[3]

1948లో ఫిల్మ్ డివిజన్ ఏర్పడినప్పటి నుంచి 1964 సంవత్సరం వరకు దేశ నిర్మాణం, సమైక్యత, అభివృద్ధి వంటి పెద్ద ప్రాజెక్ట్ కోసం డాక్యుమెంటరీ సినిమాలను చేర్చడానికి నెహ్రూ ఫిల్మ్స్ డివిజన్ ఏర్పాటు చేశారు..1948 నుండి 1964 వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యానికి వ్యతిరేకంగా భారతదేశ చలనచిత్ర విభాగం మూలాలు, లక్ష్యాలు, పరిణామాలపై చిత్ర సంప్రదాయం ప్రభావం . భారత చలనఉంటుంది. చిత్ర విభాగం జాతీయ స్వాతంత్ర్యం, వలసరాజ్య అనంతర కాలంలో జాతీయ గుర్తింపు ఆవిష్కరణల పై శ్రద్ధ వహించి,.దశాబ్దాల బ్రిటిష్ వలస పాలన తరువాత భారతదేశ గుర్తింపును పునరుద్ధరించడంలో ఫిల్మ్ డివిజన్ గణనీయమైన పాత్ర పోషించింది. భారతదేశం గురించి ఈ డాక్యుమెంటరీలు ప్రదర్శించిన చిత్రాల రకాలు, చలనచిత్రాలకు, దేశం వాస్తవ పరిస్థితికి మధ్య ఉన్న అంతరంపై మరింత ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది.[4]

మ్యూజియమ్

[మార్చు]
బొంబాయిలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాలో జాతిపిత మహాత్మా గాంధీ గురించి

నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఇండియన్ సినిమా 2019 జనవరి 19 న ముంబైలోని పెద్దర్ రోడ్ లోని ఫిల్మ్ డివిజన్ కాంప్లెక్స్ లో ప్రారంభించబడింది. ఈ మ్యూజియం రెండు భవనాలలో ఉంది, కొత్తగా కట్టిన మ్యూజియం భవనం, 19 వ శతాబ్దపు వారసత్వ భవనం గుల్షన్ మహల్ - రెండూ ఫిల్మ్ డివిజన్ కాంప్లెక్స్ లో ఉన్నాయి. ఈ మ్యూజియం లో భారతీయ సినిమా చరిత్రను ప్రదర్శిస్తుంది, అనేక కళాఖండాలు, కియోస్క్లు, ఇంటరాక్టివ్ డిజిటల్ స్క్రీన్లు, సమాచార ఆధారిత స్క్రీన్ ఇంటర్ఫేస్ మొదలైన వాటితో సహా డిజిటల్ అంశాలను కలిగి ఉంది.

చలనచిత్ర నిర్మాణం లో ఉన్న కాస్ట్యూమ్స్, పాతకాలపు పరికరాలు, పోస్టర్లు, ముఖ్యమైన చిత్రాల కాపీలు, ప్రమోషనల్ కరపత్రాలు, సౌండ్ ట్రాక్స్, ట్రైలర్లు, ట్రాన్స్పారెన్సులు, పాత సినిమా మ్యాగజైన్లు, చలనచిత్ర నిర్మాణం, పంపిణీని తెలిపే చేసే గణాంకాలు మొదలైనవి భారతీయ సినిమా చరిత్రను కాలక్రమంలో ఉండి, క్రమబద్ధమైన పద్ధతిలో ప్రదర్శించబడతాయి.  ఈ మ్యూజియమ్ సామాన్య ప్రజలకు చలన చిత్ర సమాచారం అందించడమే కాకుండా, చిత్ర నిర్మాతలు, విద్యార్థులు, ఔత్సాహికులు,విమర్శకులకు కళాత్మక వ్యక్తీకరణ మాధ్యమంగా సినిమా అభివృద్ధిని తెలుసుకోవడానికి,అంచనా వేయడానికి సహాయపడుతుంది[5].

గత 60 ఏళ్లలో ఫిల్మ్ డివిజన్ 8000 పైగా చిత్రాలను నిర్మించింది ఇందులో సుమారు 5000 సినిమాలు ఆన్ లైన్ లో అమ్మకానికి ,డౌన్ లోడ్ ల కోసం అందుబాటులో ఉన్నవి.[6]

మూలాలు

[మార్చు]
  1. Resources, F. M. F. (2015-06-11). "This is How Film Division of India Helpful for Indie Filmmakers". Filmmakers Fans (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-19.
  2. "Contact us Film Division". Official website. Archived from the original on 3 జనవరి 2019. Retrieved 7 February 2019.
  3. "Films Division: Still a sacred cow". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-12-19.
  4. "The Films Division of India, 1948-1964: The Early - ProQuest". www.proquest.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-19.
  5. "National Museum of Indian Cinema | Films Division". filmsdivision.org. Archived from the original on 2022-12-19. Retrieved 2022-12-19.
  6. "Museum for Indian cinema to come up in Mumbai by 2013". The Indian Express (in ఇంగ్లీష్). 2010-11-24. Retrieved 2022-12-19.