ఫైన్ ఆర్ట్స్ థియేటర్స్, బాపట్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫైన్ ఆర్ట్స్ థియేటర్స్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, బాపట్లలో 1952లో ప్రారంభించిన నాటక సంస్థ. ఈ సంస్థ ప్రదర్శించిన సంఘంచెక్కిన శిల్పం నాటక ప్రదర్శనకు పలుచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టేవారు.[1]

ప్రారంభం[మార్చు]

1952లో రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత కె.ఎస్.టి. శాయి తన మిత్రులతో కలిసి బాపట్లలో విద్యార్థి కళా సమితి అనే సంస్థను స్థాపించి కళారంగ కార్యక్రమాలు నిర్వహించేవాడు. గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడు సంస్థ తరపున ఆచార్య ఆత్రేయ రాసిన ఎవరు దొంగ నాటికను ప్రదర్శించి విరాళాలు సేకరించి, బాధితులకు సహాయం అందించారు. 1953లో ఫైన్ ఆర్ట్స్ థియేటర్స్ గా మార్చబడింది.

ప్రదర్శనలు[మార్చు]

 1. కన్యాశుల్కం
 2. ఈనాడు
 3. కప్పలు
 4. సంఘంచెక్కిన శిల్పం
 5. భోగిమంటలు
 6. భయం
 7. అన్నాచెల్లెల్లు
 8. పల్లెపడుచు
 9. పూలదోసిళ్ళు
 10. వారసత్వం
 11. వాపస్
 12. అసమర్థుని డైరీ
 13. కలి పురుషుడు
 14. సర్పజాతి
 15. మహనీయులు
 16. పరమపదం
 17. బొమ్మలు
 18. త్రిశంకులు
 19. గాజుపెంకులు
 20. సంతృప్తులు
 21. జీవనయాత్ర
 22. నగ్నసత్యం
 23. మమకారం
 24. పులి-మేక
 25. కోపం
 26. ఉత్తరం
 27. జననీ జన్మభూమిశ్చ
 28. జైజవాన్

నటీనటులు[మార్చు]

 1. పి.ఎల్. నారాయణ
 2. జీపీఆర్ విఠల్
 3. పూల నాగేశ్వరరావు
 4. కేబీ శర్మ
 5. కేపీ రెడ్డయ్య
 6. ఎ. మురళీకృష్ణ
 7. భారతుల రామకృష్ణ
 8. అగస్టీన్ బాబు
 9. సీతాలత
 10. ఉమ

ఇతర వివరాలు[మార్చు]

ఈ సంస్థ రథసారథి కె.ఎస్.టి. శాయికి 2011లో నంది నాటక పరిషత్తు - 2011 సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం అందజేయబడింది.

మూలాలు[మార్చు]

 1. తెలుగు నాటక దీపిక ఫైన్ ఆర్ట్స్ థియేటర్స్, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 6 మార్చి 2017, పుట.14