ఫైబర్ గ్రిడ్ పథకం
Jump to navigation
Jump to search
ఫైబర్ గ్రిడ్ పథకం | |
---|---|
![]() ఫైబర్ గ్రిడ్ కోసం ఉంచిన గొట్టములు | |
ప్రాంతం | తెలంగాణ, భారతదేశం |
ప్రధాన వ్యక్తులు | తెలంగాణ ప్రజలు |
వెబ్ సైటు | తెలంగాణ ప్రభుత్వ అధికారిక జాలగూడు |
నిర్వాహకులు | ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ ప్రభుత్వం |

ఫైబర్ గ్రిడ్ పథకం గురించి ఆధికారులతో చర్చిస్తున్న కెటీఆర్
ఫైబర్ గ్రిడ్ పథకం (టి. ఫైబర్) ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకం. దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ ఫైబర్ గ్రిడ్ పథకాన్ని 2018 డిసెంబరు నెలాఖరుకు పూర్తి చేయాలని భావిస్తున్నది.[1][2] 4000 కోట్ల రూపాయలు వ్యయం అవుతున్న ఈ పథకానికి భారత్ నెట్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోంది.
లక్ష్యాలు[మార్చు]
- తెలంగాణ రాష్ట్రం లోని 31 జిల్లాల్లోని 464 మండలాల్లోని 8778 గ్రామ పంచాయతీల్లోని 10,128 గ్రామాల్లోని 83లక్షల 58వేల గృహాలలోని 3కోట్ల 5లక్షల కంటే ఎక్కువ ప్రజలకు అందుబాటు ధరలతో అధిక వేగం కలిగిన అంతర్జాలమును అందించడం
- ప్రభుత్వం నుండి ప్రభుత్వమునకు, ప్రభుత్వం నుండి ప్రజలకు (గవర్నమెంట్ టూ గవర్నమెంట్ (జి2జి), గవర్నమెంట్ టూ సిటిజన్స్ (జి2సి) ) ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బ్యాంకులు, ఇతర ప్రజా సేవ సంస్థలకు అధిక వేగం కలిగిన అంతర్జాలమును అందించడం
- ఎలాంటి తేడాలు లేకుండా అందరికి ఒకే విధమైన అంతర్జాలమును అందించడం
- గృహాలకు 4-20 ఎం.బి.పి.ఎస్. ఇతర సంస్థలలకు 20-100 ఎం.బి.పి.ఎస్. ల వేగంతో అంతర్జాల పంపిణీ
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్రప్రభ. "తెలంగాణలో ఫైబర్ గ్రిడ్‌కి 4,000 కోట్లు". Retrieved 10 March 2017.[permanent dead link]
- ↑ నమస్తే తెలంగాణ. "నీటితోపాటే ఇంటింటికీ నెట్!". Retrieved 10 March 2017.[permanent dead link]