ఐదు వికెట్ల పంట

వికీపీడియా నుండి
(ఫైవ్ వికెట్ హాల్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లార్డ్స్‌లో ఇంగ్లీషు ఐదు లేదా పది వికెట్ల హాల్‌లను గుర్తుచేసే లార్డ్స్ ఆనర్స్ బోర్డు.
సమిత్ పటేల్ సాధించిన 5 వికెట్ల పంటను చూపిస్తున్న స్కోరుబోర్డు. ఒక్కో ఓవరుకూ ఇచ్చిన పరుగులు (తెల్ల దీర్ఘ చతురస్రాలు), తీసుకున్న వికెట్లు (ఎర్ర చుక్కలు) బార్ చార్టులో చూడవచ్చు.
సమిత్ పటేల్ సాధించిన 5 వికెట్ల పంటను చూపిస్తున్న స్కోరుబోర్డు. ఒక్కో ఓవరుకూ ఇచ్చిన పరుగులు (తెల్ల దీర్ఘ చతురస్రాలు), తీసుకున్న వికెట్లు (ఎర్ర చుక్కలు) బార్ చార్టులో చూడవచ్చు.

క్రికెట్‌లో, ఒక బౌలరు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడాన్ని ఐదు వికెట్ల పంట అంటారు. దీన్ని ఇంగ్లీషులో :ఫైవ్ వికెట్ హాల్" అని "ఫైవ్-ఫర్" లేదా " ఫైఫర్ " అని అంటారు. [1] [2] జరుగుతుంది. విమర్శకులు దీనిని చెప్పుకోదగ్గ విజయంగా పరిగణిస్తారు.[3] ఇది బ్యాటర్ చేసే శతకానికి సమానం.[4]

లార్డ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బౌలరుకు లార్డ్స్ ఆనర్స్ బోర్డులో స్థానం లభిస్తుంది. [5]

రికార్డులు

[మార్చు]

2023 నాటికి, మొత్తం మూడు అంతర్జాతీయ ఫార్మాట్ల లోనూ ( టెస్ట్ క్రికెట్, వన్డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ ) ఐదు వికెట్లు పడగొట్టినది పన్నెండు మంది క్రికెటర్లు మాత్రమే. వీరు: శ్రీలంకకు చెందిన అజంతా మెండిస్, లసిత్ మలింగ, భారతదేశానికి చెందిన భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, న్యూజీలాండ్‌కు చెందిన టిమ్ సౌతీ, దక్షిణాఫ్రికాకు చెందిన ఇమ్రాన్ తాహిర్, లుంగి ఎన్‌గిడి, వెస్టిండీస్‌కు చెందిన జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్, పాకిస్థాన్‌కు చెందిన ఉమర్ గుల్, ఆఫ్ఘన్ రషీద్ ఖాన్.

2018లో, ఆఫ్ఘన్ క్రికెటర్ ముజీబ్ జద్రాన్, 16 ఏళ్ల వయస్సులో, వన్‌డేలో ఐదు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన బౌలర్‌గా నిలిచాడు. [6] 2019లో, 16 ఏళ్ల వయసున్న పాకిస్థాన్ క్రికెటర్ నసీమ్ షా టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన బౌలరు. [7] ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన బౌలరు. ఆ సమయంలో అతనికి 18 సంవత్సరాలు. [8]

శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధికంగా 67 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.[9] పాకిస్థానీ వకార్ యూనిస్ వన్‌డే లలో అత్యధికంగా 13 సార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు.[10] టి20I లలో అత్యధికంగా ఐదు వికెట్లు తీసినది రెండు సార్లు. ఇది ఏడుగురు క్రికెటర్లు సాధించారు. [11]

మూలాలు

[మార్చు]
  1. "Eight five-fors and counting: Starc's record setting ODI pace". ICC]. 21 July 2021. Retrieved 10 November 2021.
  2. "Fifer in cricket: What do commentators mean when they say that a bowler has picked a fifer?". Sports Rush. 20 June 2021. Retrieved 10 November 2021.
  3. Pervez, M.A. (2001). A Dictionary of Cricket. Universities Press. ISBN 978-81-7370-184-9.
  4. de Lisle, Tim; Booth, Lawrence (2011). Young Wisden: A new fan's guide to cricket. A&C Black. p. 110. ISBN 9781408165256. Retrieved 30 June 2022.
  5. "About The Honours Boards". Lords.org. Retrieved 20 December 2021. By scoring a century, taking five wickets in an innings or ten wickets in a match, a player ensures that their name is added to one of the famous Honours Boards in the Pavilion.
  6. "Mujeeb Zadran becomes youngest bowler to pick ODI five-for". The Indian Express. 16 February 2018. Retrieved 8 September 2018.
  7. "Pakistan's Naseem Shah becomes youngest pacer to pick five-wicket haul in Tests". The Hindu. 23 December 2019. Retrieved 12 February 2021.
  8. "Five-wicket hauls in WT20I matches – by age at the start of the match (youngest)". ESPNcricinfo. Archived from the original on 23 February 2020. Retrieved 23 February 2020.
  9. "RECORDS / TEST MATCHES / BOWLING RECORDS / MOST FIVE-WICKETS-IN-AN-INNINGS IN A CAREER". ESPNcricinfo. Retrieved 21 October 2018.
  10. "RECORDS / ONE-DAY INTERNATIONALS/ BOWLING RECORDS / MOST FIVE-WICKETS-IN-AN-INNINGS IN A CAREER". ESPNcricinfo. Retrieved 21 October 2018.
  11. "RECORDS / TWENTY20 INTERNATIONALS/ BOWLING RECORDS / MOST FIVE-WICKETS-IN-AN-INNINGS IN A CAREER". ESPNcricinfo. Retrieved 21 October 2018.