ఫైసల్ హష్మీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫైసల్ హష్మీ
2019లో షార్ట్ సర్క్యూట్ ప్రీమియర్‌లో ఫైసల్.
జననం (1985-08-01) 1985 ఆగస్టు 1 (వయసు 38)
విద్యమెకానికల్ ఇంజనీరింగ్‌
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం

ఫైసల్ హష్మీ గుజరాత్ కు చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. ఇతడు తొలిసారిగా దర్శకత్వం వహించిన విటమిన్ షీ అనే సినిమా థియేటర్లలో ఆరువారాలపాటు హౌస్‌ఫుల్‌గా నడిచి, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది.[1][2] తరువాత, గుజరాతీ మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ ఫీచర్ షార్ట్ సర్క్యూట్‌ సినిమాను వ్రాసి దర్శకత్వం వహించాడు. గుజరాతీ సినిమారంగంలో కొత్త శైలికి మార్గాన్ని వేశాడు.[3] ఈ సినిమా షార్ట్ సర్క్యూట్ బాక్సాఫీస్ వద్ద నాలుగువారాలపాటు విజయవంతమైంది, గుజరాత్ అంతటా అభిమానుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[4]

అహానా కుమ్రా, షరీబ్ హష్మీ నటించిన "క్యాన్సర్" అనే హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌తో బాలీవుడ్‌ సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[5]

ప్రారంభ జీవితం, విద్య[మార్చు]

ఫైసల్ 1985, ఆగస్టు 1న గుజరాత్ లోని పాలన్‌పూర్‌లో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా, తల్లి గృహిణి. జురాసిక్ పార్క్ సినిమా ఇతనిపై అపారమైన ప్రభావం చూపింది, అప్పుడే తను సినిమా దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. స్టీవెన్ స్పీల్‌బర్గ్ ని ప్రేరణగా తీసుకున్నాడు. చిన్నతనంలోనే కామిక్ పుస్తకాలు, అమర్ చిత్ర కథ కామిక్స్ సుప్తకాలను చదివాడు. ఆ పుస్తకాలలోని సూపర్‌హీరోలు అతనిపై భారీ ప్రభావాన్ని చూపారు, మునుపెన్నడూ చూడని ప్రపంచాలు, పాత్రల పట్ల అతని ప్రవృత్తిని పెంచుకున్నాడు. ఫైసల్ కు ఖగోళ శాస్త్రం, సైన్స్‌పై లోతైన ఆసక్తి ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. కానీ ఫిల్మ్ మేకింగ్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు.[6]

అవార్డులు[మార్చు]

విటమిన్ షీ సినిమా గుజరాతీ ఐకానిక్ ఫిల్మ్ అవార్డులలో 6 నామినేషన్లు పొందింది. నటుడు స్మిత్ పాండ్యాకు ఉత్తమ సహాయ నటుడి కేటగిరీని గెలుచుకుంది.[7] ఇతని రెండవ సినిమా షార్ట్ సర్క్యూట్ కు గిగా అవార్డులలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథ, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఫైసల్ హష్మీకి ఉత్తమ సంభాషణలతోసహా 11 నామినేషన్‌లను పొందింది. షార్ట్ సర్క్యూట్ సినిమా ఇంటర్నేషనల్ గుజరాతీ ఫిల్మ్ ఫెస్టివల్ లో అనేక విభాగాల్లో నామినేట్ చేయబడింది, ఉత్తమ ఎడిటర్ అవార్డును గెలుచుకుంది.[8]

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు దర్శకుడు రచయిత నటుడు ఇతర వివరాలు
2017 విటమిన్ షీ Yes Yes కాదు
2019 షార్ట్ సర్క్యూట్ Yes Yes Yes నామినేట్ —ఉత్తమ దర్శకుడిగా సినిమా ఇంటర్నేషనల్ గుజరాతీ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ [8]
నామినేట్ —ఉత్తమ కథా రచయితగా సినిమా ఇంటర్నేషనల్ గుజరాతీ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు
నామినేట్ —ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా సినిమా ఇంటర్నేషనల్ గుజరాతీ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు
నామినేట్ —ఉత్తమ సంభాషణల రచయితగా సినిమా ఇంటర్నేషనల్ గుజరాతీ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు
నామినేట్ —ఉత్తమ దర్శకుడిగా గుజరాతీ ఐకానిక్ ఫిల్మ్ అవార్డు అవార్డు[9]
నామినేట్ —ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా గుజరాతీ ఐకానిక్ ఫిల్మ్ అవార్డు అవార్డు
నామినేట్ —ఉత్తమ సంభాషణల రచయితగా గుజరాతీ ఐకానిక్ ఫిల్మ్ అవార్డు అవార్డు
పూర్తయింది దౌద్ పకడ్ Yes కాదు కాదు
2024 ఫాతి నే?[10] Yes Yes కాదు
2024 క్యాన్సర్[5] Yes Yes కాదు

మూలాలు[మార్చు]

  1. "૯૩.૪ ટકા કલેક્શન સાથે વિટામિન She સુપરહિટ". www.gujaratimidday.com. Archived from the original on 2017-08-07.
  2. "વીકેન્ડ સુધારી દે એવી છે 'વિટામિન She". www.divyabhaskar.co.in. Archived from the original on 2017-08-05.
  3. "Sci-fi and horror comedies: Dhollywood moves beyond formulas". Times of India. 3 July 2020.
  4. "ચાર વીક બાદ પણ થિયેટર્સમાં અડીખમ છે Short Circuit". Mid-Day. February 9, 2019.
  5. 5.0 5.1 Jhunjhunwala, Udita (November 22, 2022). "U.S. Producer Lonestar Films Attaches Lead Cast for 'Cancer' Foray Into Bollywood". Variety (magazine).
  6. "શું હશે 'કેન્સર' ફિલ્મમાં?". Divya Bhaskar. November 23, 2022.
  7. "'જિફા એવોર્ડ્સ 2017': 'કેરી ઓન કેસર' બેસ્ટ ગુજરાતી ફિલ્મ, સ્મિત પંડ્યા બેસ્ટ કોમેડિયન".
  8. 8.0 8.1 "'શું થયું' માટે મલ્હાર ઠાકરને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, વાંચો આખું લિસ્ટ". www.gujaratimidday.com. 10 June 2019.
  9. "GIFA -Gujarati Iconic Film Award on Facebook". Facebook. Archived from the original on 2020-07-07. Retrieved 2023-07-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. Rathod, Vaishali (November 3, 2022). "Director Faisal Hashmi announces his next Faati Ne?". Times of India.

బయటి లింకులు[మార్చు]