ఫోటోషాప్ పరికరాల పెట్టె
Appearance
పరికరాలు (టూల్స్)ల గురించి
[మార్చు]ఫోటోషాప్ ని మొదలు పెట్టిన వెంటనే పరికరాల పెట్టె (టూల్ బాక్స్) ఫోటోషాప్ తెర మీద ఎడమ వైపున కనిపిస్తుంది.ప్రతి పరికరం గుర్తు దాని ఉపయోగం గురించి (దాదాపు)సూచిస్తుంది.ప్రతి ప్రాథమిక టూల్ మీద మీరు మౌస్ కర్సర్ వుంచిన వెంటనే ఆ పరికరం గురించి దాని పనితనం గురించి సమాచారం వస్తుంది.కొన్ని పరికరాల క్రింద చిన్న బాణం గుర్తు వుందంటే ఆ పరికరం క్రింద దానికి సంబంధించిన మరికొన్ని అనుభంద పరికరాలు ఉన్నట్టు.
(కుడి ప్రక్కన ఫైన ఉన్న చిత్రం పెద్దదిగా చేసి పరిశీలించండి)
క్రింది పట్టికలో ఒక్కో పరికరం ఉపయోగం గురించి క్లుప్తమయిన సమాచారం
పరికరం | వివరణ | ఉదా: చిత్రం |
---|---|---|
ఎంచుకునే పరికరాలు (Selection Tools) గురించి మరింత వివరమయిన సాఫ్టువేరు తయారిదారుల అధీకృత సమాచారం: ఇక్కడ నొక్కండి > వెళ్లండి > వర్క్ స్పేస్ > టూల్స్ | ||
మూవ్ టూల్ (కదిలించే పరికరం) పరికరాల పెట్టెలో మొదటి స్థానంలొ ఉండటంతొనే దీని ప్రాముఖ్యత ఏమిటొ అర్థం చేసికోవచ్హు.ఒక చిత్రం లోని కొంత కత్తరించిన భాగాన్ని కాని,మొత్తం చిత్రాన్ని కాని,లేయర్లని కాని కదిలించాలంటే ఈ పరికరం ఉపయోగించాలి. | ||
సేలేక్షన్ పరికరాలలో ఉన్న చదరపు,గుండ్రని,ఒక్క కాలము(నిలువు),గీత (అడ్డము)మార్క్యూ టూల్(marquee tool) వలన ఒక ఫోటో లేదా చిత్రం లోని అంతటి లేక కొంత బాగాన్ని ఎన్నుకోవచ్చు.అంటే ఆ ఎన్నుకున్న భాగానికే మనము చేసిన మార్పులు జరుగుతాయి. ఇంకా ఎంచుకున్న భాగాన్ని కాపీ చేసికోవటం,కత్తరించుకోవటం లేదా కావలసిన చోటికి కదలించికోవచ్చు. ఇది ఫోటోషాప్ లో ఎక్కువగా ఉపయోగించే ప్రధానమయిన పరికరం.ఈ టూల్ దాదాపు అన్ని రాస్టార్ ఎడిటింగ్ సాఫ్టువేరు లలో వాడుతున్నారు. | ||
గుండ్రని మార్క్యూ టూల్( eliptical marquee tool) వలన ఒక ఫోటో లేదా చిత్రం లోని కొంత బాగాన్ని(గుండ్రని లేదా కోడిగుడ్డు లాంటి ఆకారం)ఎన్నుకోవచ్చు. | ||
సేలేక్షన్ పరికరాలలో ఉన్న ఒక్క కాలము అడ్డము గీత మార్క్యూ టూల్(marquee tool) వలన ఒక ఫోటో లేదా చిత్రం లోని కొంత బాగాన్ని ఎన్నుకోవచ్చు.అంటే ఆ ఎన్నుకున్న భాగానికే మనము చేసిన మార్పులు జరుగుతాయి. ఇది ఫోటోషాప్ లో అరుదుగా అవసరమవుతుంది. | ||
సేలేక్షన్ పరికరాలలో ఉన్న ఒక్క కాలము నిలువు గీత మార్క్యూ టూల్(marquee tool) వలన ఒక ఫోటో లేదా చిత్రం లోని కొంత బాగాన్ని ఎన్నుకోవచ్చు.అంటే ఆ ఎన్నుకున్న భాగానికే మనము చేసిన మార్పులు జరుగుతాయి. ఇది ఫోటోషాప్ లో అరుదుగా అవసరమవుతుంది. | ||
ఈ లాస్సో పరికరపుతోటి(lasso tool), కాగితం మీద కలంతోటి గాని పెన్సిల్ తోటి గాని మన ఇష్టం వచ్చినట్టు అల్లిబిల్లిగా వృత్తాలు,ఆకారాలు గీసినట్టు ఒక ఫోటోమీద (లేదా చిత్రం) కావలసిన విధంగా మౌస్ తోటి గీసి ఎన్నుకోవచ్చు(select).కాకపొతే, మొదలు పెట్టిన దగ్గర అంచుని తిరిగీ కలపాలి. | ||
ఈ పాలిగోనల్ లాస్సో పరికరపుతోటి(polygonal lasso tool) ఒక ఫోటోమీద (లేదా చిత్రం) కావలసిన విధంగా గీతల రూపంలో వంపులు లేకుండా కావలసిన చోట నొక్కుతో మౌస్ తోటి ఎన్నుకోవచ్చు(select).కాకపొతే, మొదలు పెట్టిన దగ్గర అంచుని తిరిగీ కలపాలి. | ||
మాగ్నటిక్ లాస్సో పరికరం(magnetic lasso tool) కూడా పాలిగోనల్ లాస్సో పరికరం లాగే పనిచేస్తుంది,కాకపొతే ఫోటోలోని ఎన్నుకున్న భాగం అంచులని తనే ఎన్నుకుని పనిని సులభతరం చేస్తుంది. | ||
క్విక్ సెలక్షన్ పరికరాన్ని (quick selection) ఎన్నుకుని మనకు కావలసిన కొలతలతో కుంచె (బ్రష్)ని తీసుకుని ఫోటోమీద (కావలసిన రంగుని)మౌసుతో వ్రాస్తూ లేదా రుద్డుతూ ఉంటే మనము ముందే ఎంచుకున్న రంగుని ఎన్నుకుంటూ వెళుతుంది. | ||
మేజిక్ వాండ్ పరికరాన్ని (magic wand) ఎన్నుకుని ఫోటోమీద మనకు కావలసిన భాగం మీద క్లిక్ చేస్తే అక్కడ ఉన్న ఒకే రంగు పిక్షేల్స్ ఎన్నుకోబడతాయి.ఈ ఎన్నుకునే స్థాయిని (కావలసిన రంగుని)ఆప్షన్స్ లో నిర్దారించుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు.ఒక్క క్లిక్ తో ఫొటోలోని ఒకరంగు పిక్షేల్స్ సులభంగా ఎన్నుకుంటుంది కావున దీనికి మంత్రదండం (మేజిక్ వాండ్)పేరుపెట్టారు. | ||
కత్తరింపు, కోత పరికరాలు (Crop and Slice Tools)గురించి మరింత వివరమయిన సాఫ్టువేరు తయారిదారుల అధీకృత సమాచారం: ఇక్కడ నొక్కండి > వెళ్లండి > వర్క్ స్పేస్ > టూల్స్ > | ||
క్రాప్ పరికరం(crop tool) కూడా రెక్టాంగులార్ పరికరం లాగే ఫోటోలోని కావలసిన భాగాన్ని కత్తరించు కోవచ్చు కాని ఇంకా ఉపయుక్తమయిన విధంగా వాడవచ్చు. అంటే ఫోటోలోని కొంత భాగాన్ని ఎన్నుకున్న తరువాత కావలసిన భాగాన్ని అంటే పొడవు వెడల్పులు సరిదిద్దుకోవచ్చు.ఇంకో సౌకర్యమేమంటే ఫోటోలోని ఎన్నుకున్న కొంత భాగం మినహా మిగత ఫోటో బూడిద రంగులో కనిపిస్తూ మనకు ఎంత కత్తరింపు అవసరమో సూచిస్తుంది. ఈ కత్తరింపు స్థాయిని (కావలసిన కొలతలని)ఆప్షన్స్ లో నిర్దారించుకోవచ్చు. | ||
స్లైస్ పరికరముతొ(slice tool) పెద్ద ఫొటొని కావలసిన కొలతలతొ ముక్కలుగ కత్తరించు కోవచ్హు.ఈ కత్తరించిన ఫోటోలోని అన్ని ముక్కలు (సంఖ్యలతో) ఒకదానితో ఒకటి సంబంధం కలిగివుంటాయి.ఈ విధానం వలన ప్రధాన ఉపయోగం వెబ్ పేజీని డిజైన్ చేసేటప్పుడు ఒక ఫోటో లేదా చిత్రముగా సృష్టించి దానిని హెచ్ టి ఎం ఎల్ పేజీగా మార్చుకోవచ్చు. తిరిగి అంతర్జాలం(ఇంటర్నెట్)ద్వారా వీక్షించేటప్పుడు ఒక్కో ముక్కగా (వెబ్ పేజి లేదా ఫోటో) త్వరగా డౌన్లోడ్ అయ్యి తిరిగి ఒకే ఫోటోగా(కత్తరించక ముందు ఉన్నట్టుగా) కనిపిస్తుంది. | ||
స్లైస్ సెలక్షన్ పరికరం (slice selection) స్లైస్ టూల్ కి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ పరికరంతో కత్తరించిన ఫోటోలోని ముక్కని కదిలించేదానికి,ఇంకో అలాంటి ముక్కని సృష్టించుకునేదానికి,కలిపెదానికి,విడదీయటానికి,కొలతల మార్పు (resize),తొలగింపు,స్థానం మార్పు,కలపటం (align), ఇతర పరికరాలకి సరఫరా (distribution)చేయవచ్చు. | ||
సరిదిద్దే కుంచెలు (Healing Brushes)గురించి మరింత వివరమయిన సాఫ్టువేరు తయారిదారుల అధీకృత సమాచారం: ఇక్కడ నొక్కండి > వెళ్లండి > వర్క్ స్పేస్ > టూల్స్ > | ||
స్పాట్ హీలింగ్ బ్రష్ పరికరంతో ( spot healing brush) ఫోటోలోని తప్పులని సరిదిద్దుకోవచ్చు.అంటే ఫొటోలో ఒకరి మొఖం మీద కాని ఇతర భాగం మీదకాని ఉన్న మచ్చలు,ముడతలు లాంటి వాటిని బావున్న ప్రధాన మయిన భాగంనుండి తీసుకున్న పిక్సల్స్ తో సరిదిద్దవచ్చు. ప్రధాన మయిన ఫొటో నుండి తీసుకున్న భాగపు కాంట్రాస్ట్,రంగు,సాంద్రత,ప్రకాశపు స్థాయి మొదలగు అన్ని సరిదిద్దిన భాగానికి చక్కగా వర్తింపచేయవచ్చు.చిరిగిన,నలిగిన పాత ఫోటోలని దీనితో చక్కదిద్దవచ్చు. | ||
హీలింగ్ బ్రష్ పరికరంతో (healing brush)ఫోటోలోని చెడిపోయిన భాగాన్ని,మచ్చలని,తప్పులని ఫోటోలోని బావున్న బాగాన్ని ఎన్నుకుని ఈ బ్రషుతో పెయింటు చేస్తూ సరిదిద్దవచ్చు. | ||
పాట్చ్ పరికరంతో ఫోటోలోని చెడిపోయిన భాగాన్ని,మచ్చలని,తప్పులని ఫోటోలోని బావున్న బాగాన్ని ఎన్నుకుని సరిదిద్దవచ్చు. | ||
రెడ్ ఐ పరికరంతో (red eye) ఎలక్ట్రానిక్ ఫ్లాష్ ఉపయోగించి తీసిన ఫొటోలో వచ్చే కంటిలోని ఎర్రటి చుక్కని తేసివేయవచ్చు. | ||
క్లోన్ స్టాంప్ పరికరంతో ఫోటోలోని కావలసిన భాగాన్ని ఎంచుకుని తిరిగి ఫోటోలోని ఇతర భాగంలో కాని కొత్త ఫోటోలోకాని అలాంటి నకిలీ ( duplicate copy) బొమ్మని (లేదా భాగాన్ని)సృష్టించవచ్చు. | ||
పాటేర్న్ స్టాంప్ పరికరంతో (pattern stamp tool) ఫోటోలోని ఎన్నుకున్న భాగపు చిత్రాన్ని వరుసలుగా చిత్రీకరిస్తుంది. | ||
ఎరేసర్ పరికరంతో (eraser) ఫోటోలోని కావలసిన భాగాన్ని తుడిచేయవచ్చు. ఆప్షన్స్ లో తగిన కొలతలతో,సాంద్రతతో మౌసుతో రుద్డుతూ కావలసిన భాగాన్ని తుడిచేయవచ్చు. ఈ పరికరం కాగితము మీద గీసిన పెన్సిల్ గీతలని, రబ్బర్ ముక్కతో తుడిచిన విధంగానే పనిచేస్తుంది అనుకోవచ్చు. | ||
బాక్గ్రౌండ్ ఎరాసర్ పరికరంతో ఫోటోలోని ఎన్నుకున్న వెనకున్న భాగాన్ని తుడిచేయవచ్చు. | ||
మాజిక్ ఎరాసర్ పరికరంతో (magic eraser) ఫోటోలోని ఎన్నుకున్న ఒక రంగుని ఒక్క క్లిక్కుతో తేసివేస్తుంది. | ||
బ్లర్ పరికరంతో (blur tool) ఫోటోలోని తీక్షనమయిన (షార్ప్)భాగాన్ని సున్నితంగా (సాఫ్ట్) మార్చవచ్చు.ఆప్షన్స్ లో తగిన కొలతలతో,సాంద్రతతో మౌసుతో రుద్డుతూ కావలసిన మొత్తాన్ని (సాఫ్ట్ నెస్)సాధించవచ్చు. | ||
షార్ప్ పరికరంతో ఫోటోలోని సున్నితమయిన (సాఫ్ట్)భాగాన్ని తీక్షనంగ (షార్ప్) మార్చవచ్చు. ఈ పరికరం బ్లర్ పరికరానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనుకోవచ్చు. ఆప్షన్స్ లో తగిన కొలతలతో,సాంద్రతతో మౌసుతో రుద్డుతూ కావలసిన మొత్తాన్ని (షార్ప్ నెస్)సాధించవచ్చు. | ||
స్మడ్జ్ పరికరంతో (smudge tool)ఫోటోలోని కావలసిన భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా లేదా గీతలుగా లాగవచ్చు లేదా తుడిచేయవచ్చు. | ||
డాడ్జి పరికరంతో (dodge tool) ఫోటోలోని కావలసిన భాగాన్ని తెల్లని రంగులో ప్రకాశవంతంగా చేయవచ్చు. | ||
బర్న్ పరికరంతో (burn tool) ఫోటోలోని కావలసిన భాగాన్ని నల్లటి రంగుతో ప్రకాశవంతం స్థాయిని తగ్గించవచ్చు. | ||
స్పాంజి పరికరంతో (sponge tool) ఫోటోలోని రంగుల స్థాయి తీవ్రతని తగ్గించవచ్చు. | ||
చిత్రీకరణ పరికరాలు (painting Tools) | ||
బ్రష్ పరికరంతో లేదా కుంచె పరికరంతో (brush tool)ఎన్నుకున్న రంగులో గీతలు (పాయలుగా,ముద్దలుగా)గీయవచ్చు.ఆప్షన్స్ లోని బ్రష్ కొలతలు,సాంద్రత,ఆకారం మొదలుగునవి మార్చుకోవచ్చు. | ||
పెన్సిల్ పరికరంతో (pencil)ఎన్నుకున్న రంగులో గీతలు గీయవచ్చు. | ||
కలర్ రీప్లేసుమెంట్ పరికరంతో (color replacement)ఎన్నుకున్న రంగుని అప్పటికే ఫొటోలో ఉన్న రంగుని మార్చేదానికి వాడతారు. | ||
హిస్టరీ బ్రష్ పరికరంతో (history brush) ఎన్నుకున్న ఫొటోలోని బాగాన్ని తిరిగీ చిత్రించేదానికి వాడతారు. | ||
ఆర్ట్ హిస్టరీ బ్రష్ పరికరంతో (art history brush)ఎన్నుకున్న ఫొటోలోని బాగాన్ని తిరిగి రకరకాలయిన విధాలుగా (స్టైల్)చిత్రించేదానికి వాడతారు. | ||
గ్రేడియంట్ పరికరంతో (gradient tool) ఎన్నుకున్న ఒకటి లేదా రెండు (ఎన్ని రంగులయిన ఎన్నుకోవచ్చు) రంగులని పూర్తి సాంద్రత నుండి తక్కువ సాంద్రత వరకు కలిసిపోయినట్టు చిత్రించేదానికి వాడతారు.రంగులతోనే కాకుండా ఫోటోలనికూడా ఒక వైపు పూర్తిగా ఇంకో వైపు అతితక్కువ సాంద్రతతో మార్చవచ్చు. | ||
పెయింటు బకెట్ పరికరంతో (paint bucket)ఎన్నుకున్న రంగుతో కావలసిన చోట లేదా ఫొటోలోని వెనక వైపు లేదా కొత్త ఫైల్ లోకాని రంగుని ఒక్క క్లిక్ తో నింపవచ్చు. | ||
పెన్ పరికరంతో (pen tool)ఫొటోలోని ఎన్నుకున్న భాగం మీద వంపులతో చిత్రీకరించుకుంటూ వెళ్లి చివర పూర్తి చేసిన చిత్రీకరణని మాస్క్ (సెలక్షన్)రూపంలోకి మార్చుకుని కాపీ,కత్తరింపు,మార్పులు చేర్పులు లాంటివి చేసికోవచ్చు. | ||
ఫ్రీఫాం పెన్ పరికరంతో (freeform pen tool) ఫోటోమీద కాని, ఖాళీ ఫైలులో కాని కావలసిన ఆకారములో గీస్తూ పొతే (కాగితం మీద పెన్సిల్ తో ఇష్టమొచ్చినట్టు గీసినట్టు) మార్పులకి కావలసిన యాంఖర్ పాయింట్లు సృష్టింపబడతాయి. యాంఖర్ పాయింట్లని జరుపుతూ గీతల ఆకారాలు మార్చుకోవచ్చు. | ||
యాడ్ యాంఖర్ పాయింట్ పెన్ పరికరంతో (add anchor point pen tool) యాంఖర్ పాయింట్లని కొత్తగా సృష్టించవచ్చు. | ||
డిలీట్ యాంఖర్ పాయింట్ పెన్ పరికరంతో (delete anchor point pen tool) యాంఖర్ పాయింట్లని తొలగించవచ్చు. | ||
కన్వర్ట్ పాయింట్ పరికరంతో (Convert point)పెన్ టూల్ లేదా ఫ్రీఫామ్ పెన్ టూల్ తో సృష్టించిన వంపుల (స్మూత్ బెండ్)ఆకారపు గీతలని చక్కని (సూటిగా ఉన్న గీతలుగా)గీతలుగా (స్త్రయిట్) లేదా వ్యతిరేకంగా మార్చవచ్చు. | ||
టైపు పరికరంతో ఫోటో మీద కాని,ఖాళి దస్త్రంలో (ఫైలు)కాని అక్షరాలని వ్రాసేదానికి (టైపు)వాడతారు. | ||
వర్టికల్ టైపు పరికరంతో నిలువుగా అక్షరాలని వ్రాయవచ్చు (టైపు). | ||
హారిజాంటల్ టైపు మాస్క్ పరికరంతో (horizontal mask) అక్షరాలని అడ్డంగా మార్క్యూ సేలేక్షన్ ముసుగు (మాస్క్)పద్ధతిలో వ్రాస్తుంది. | ||
వర్టికల్ టైపు మాస్క్ పరికరంతో (verticle type mask) నిలువుగా అక్షరాలని మార్క్యూ సేలేక్షన్ ముసుగు (మాస్క్)పద్ధతిలో వ్రాస్తుంది. | ||
పాత్ సెలేక్షన్ పరికరంతో (path selection)బహుళంగా ఉన్న పాత్ కంపోనంట్స్ నుండి పాయింటర్ కింద ఉన్న పాత్ కంపోనంట్ ని ఎన్నుకుంటుంది. | ||
డైరెక్ట్ సెలేక్షన్ పరికరంతో (direct selection) పెన్ పరికరంతో సృష్టించిన పాత్ కంపోనంట్ లోని కొంత సేగ్మంట్ ని ఎన్నుకోవచ్చు. | ||
రెక్టాంగ్యులార్ షేప్ పరికరంతో (rectangle shape) గుండ్రని అంచుల దీర్ఘ చతురస్రాకారపు లేదా చతురస్రాకారపు ఆకారముతో ఫోటోలో కాని,ఖాళీ దస్త్రంలో (ఫైలు)కాని వెక్టార్ గీతాల ఆకారాలు గీసికోవచ్చు. | ||
ఎల్లిప్స్ షేప్ పరికరంతో (Ellipse shape)గుండ్రని లేదా కోడిగుడ్డు ఆకారముతో ఫోటోలో కాని, ఖాళీ దస్త్రంలో (ఫైలు)కాని వెక్టార్ గీతాల ఆకారాలు గీసికోవచ్చు. | ||
పాలిగోన్ షేప్ పరికరంతో (polygon shape) అదే ఆకారముతో ఫోటోలో కాని, ఖాళీ దస్త్రంలో (ఫైలు)కాని వెక్టార్ (vector) గీతాల ఆకారాలు గీసికోవచ్చు. | ||
లైన్ పరికరంతో (line tool) ఫోటోలో కాని,ఖాళీ దస్త్రంలో (ఫైలు)కాని వెక్టార్ (vector)గీతలు గీసికోవచ్చు. | ||
కష్టమ్ షేప్ పరికరంతో (custom shape) ఫోటోలో కాని, ఖాళీ దస్త్రంలో (ఫైలు)కాని కావలసిన ఆకారములోవెక్టార్ గీతాల ఆకారాలు గీసికోవచ్చు. | ||
కొలతల పరికరాలు (Measuring Tools) | ||
నోట్స్ పరికరంతో (notes tool) ఫోటోకి ఏ ప్రదేశంలో అయినను అక్షరాలలో సూచిక (నోట్స్)ఇవ్వవచ్చు. | ||
ఆడియో నోట్స్ పరికరంతో (audio notes) ఫోటోకి ఏ ప్రదేశంలో అయినను శబ్ద రూపంలోకాని మాటల రూపములోకాని సూచిక (నోట్స్)ఇవ్వవచ్చు.ఈ పరికరాన్ని ఉపయోగించుకోవాలంటే మైక్రోఫోన్ అవసరం. | ||
ఐ డ్రాపర్ పరికరంతో (eye dropper)ఫోటోలోని ఏదయినా ఒక చోట క్లిక్ చేసి అక్కడి రంగుని కార్య క్షేత్రంలో ముందు ఉండే (ఫోర్ గ్రౌండ్), వెనుక ఉండే (బ్యాక్ గ్రౌండ్) రంగులని మార్చుకోవచ్చు. | ||
కలర్ శాంప్లర్ పరికరం (color sampler) కూడా ఐ డ్రాపర్ పరికరం లాగే పనిచేస్తుంది అనుకోవచ్చు.కారణం ఐ డ్రాపర్ తోటి కలర్ ని ఎన్నుకున్నట్టుగా కాకుండా,కలర్ శాంప్లర్ పరికరం తోటి ఆప్షన్స్ ద్వారా 3X3 లేదా 5X5 పిక్షల్స్ లోఉన్న అక్కడి రంగుని ఎంచుకోవటమే కాకుండా, ఒకటికంటే ఎక్కువ ఎంపికలని రక్షించుకుని (సేవ్),సరియినది వాడుకునే వెలుసుబాటు ఉంది. | ||
మెజర్ పరికరంతో (measure tool) ఫోటోలోని ఒక చోటి నుండి ఇంకో చోటు వరకు ఉన్న ప్రదేశపు దూరాన్ని (distance) కాని,పొడవు (length) వెడల్పులే (wedth) కాకుండా కోణాలని (angle) కూడా లెక్కపెట్టవచ్చు. | ||
కౌంట్ పరికరంతో (count tool) ఫోటోలోని భాగాల మీద క్లిక్ చేస్తూవుంటే చేసిన క్లిక్ ల ఆధారంగా లెక్కపెట్టుకుని ఎన్ని భాగాలు ఉన్నాయో లెక్క చూపిస్తుంది. | ||
హ్యాండ్ పరికరంతో (hand tool) ఫోటోని కార్యక్షేత్రంలో (workspace) కావలసిన వైపునకి కదిలించుకోవచ్చు. | ||
జూమ్ పరికరంతో (zoom tool) ఫోటోని కార్యక్షేత్రంలో (workspace) కావలసిన సైజుకి పెద్దదిగా (+) కాని చిన్నదిగా (-) కాని మార్చుకోవచ్చు. | ||
క్విక్ మాస్క్ మోడ్ (quick mask mode) బటన్ మీద నొక్కి కార్యక్షేత్రాన్ని మాస్క్ మోడ్ లోనికి మారవచ్చు. | ||
స్క్రీన్ మోడ్ బటన్ మీద నొక్కి స్టాండర్డ్ స్క్రీన్ మోడ్ నుండి పూర్తి స్క్రీన్ మోడ్ కి గాని మేనుతో ఉన్న పూర్తి స్క్రీన్ మోడ్ లోనికి మారవచ్చు.సృష్టించిన ఒక చిత్రం (image or graphic) కాని మార్పులు చేర్పులు చేసిన ఫోటో కాని మోనిటర్ తెర మీద పూర్తిగా చూసుకోనుటకు స్క్రీన్ మోడ్ అవసరమవుతుంది. | ||
రీసేట్ ఫోర్ గ్రౌండ్,బ్యాక్ గ్రౌండ్ (reset foreground and background) బటన్ మీద నొక్కి ఫోర్ గ్రౌండ్ రంగు నుండి బ్యాక్ గ్రౌండ్ రంగుకి మారవచ్చు. |
సమాచార సేకరణ
[మార్చు]- వికీపీడియా ఇంగ్లీష్
- అడోబ్.కాం
- ఫోటోషాప్ న్యూస్.కాం Archived 2008-03-07 at the Wayback Machine