బ్రష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దంతాలను శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించే టూత్ బ్రష్
జుట్టు దువ్వుకునేందుకు ఉపయోగించే ఒక హెయిర్ బ్రష్

బ్రష్ (Brush) అనేది వెంట్రుకలు లేదా తీగలు లేదా పోగులు వెలుపలికి వుండేలా అంటించబడిన ఒక సాధనం. బ్రష్‌లు చాలా రకాలు ఉన్నాయి. చాలా బ్రష్‌లు ఒక చివర (హ్యాండిల్) పట్టుకోవటానికి ఒక పొడవైన భాగాన్ని కలిగి ఉంటాయి, మరొక చివర తల నుండి వెంట్రుకలు లేదా తీగలు లేదా పోగులు కలిగి ఉంటాయి. వస్తుపులను శుభ్రపరచడానికి, జుట్టు అందంగా కనిపించడానికి, దంతాలను శుభ్రం చేసుకునేందుకు, చిత్రలేఖనం గీయడానికి, గోడలకు రంగులు వేయడానికి, అనేక ఇతర ప్రయోజనాల కోసం మనం బ్రష్‌లను ఉపయోగిస్తాము.

శుభ్రపరచడానికి బ్రష్లు[మార్చు]

శుభ్రపరచడం కోసం అనేక రకాల బ్రష్‌లు తయారు చేస్తారు, ఉదాహరణకు దంతాలను శుభ్రం చేసుకునేందుకు టూత్ బ్రష్‌లు లేదా నేలను శుభ్రం చేయడానికి ఉపయోగించే బ్రష్‌లు.

పెయింట్ బ్రష్లు[మార్చు]

కాగితంపై సిరా లేదా పెయింట్ వేయడానికి మనం పెయింట్ బ్రష్‌లను ఉపయోగిస్తాము. కంప్యూటర్ గ్రాఫిక్స్, చిత్రాల తయారీకి డిజిటల్ పెయింట్ బ్రష్లను ఉపయోగిస్తుంది.

పెయింట్ బ్రష్లు మూడు ఆకారాలను కలిగి ఉంటాయి:

రౌండ్: ఈ బ్రష్‌ల యొక్క పొడవైన, దగ్గర దగ్గరగా ఉండే వెంట్రుకల కుచ్చు ఎక్కువ పెయింట్‌ను అంటి పెట్టుకోగలదు. అందుకే చాలా మంది కళాకారులు చిత్రాలు చిత్రించడానికి, కలర్ వాషెస్ కోసం రౌండ్ బ్రష్‌లను ఇష్టపడతారు.

"https://te.wikipedia.org/w/index.php?title=బ్రష్&oldid=3175752" నుండి వెలికితీశారు