Jump to content

ఫౌద్ బాకస్

వికీపీడియా నుండి
ఫౌద్ బాకస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షేక్ ఫౌద్ అహముల్ ఫైజల్ బాకస్
పుట్టిన తేదీ (1954-01-31) 1954 జనవరి 31 (వయసు 70)
జార్జిటౌన్, గయానా
బ్యాటింగుకుడిచేతివాటం
బౌలింగుకుడిచేతివాటం మీడియం పేస్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 171)1978 ఏప్రిల్ 15 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1982 జనవరి 30 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 23)1978 ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1983 జూన్ 25 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1971–1980డెమెరారా
1972–1983గయానా
1984–1985వెస్టర్న్ ప్రావిన్సు
1985–1986బోర్డర్
1985–1986ఇంపాలాస్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే ఇంటర్నేషనల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లిస్ట్ ఎ క్రికెట్
మ్యాచ్‌లు 19 29 111 66
చేసిన పరుగులు 782 612 5,944 1,871
బ్యాటింగు సగటు 26.06 26.60 35.17 33.41
100లు/50లు 1/3 0/3 8/37 1/12
అత్యుత్తమ స్కోరు 250 80* 250 132
వేసిన బంతులు 6 0 470 96
వికెట్లు 0 8 6
బౌలింగు సగటు 24.62 16.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/18 3/28
క్యాచ్‌లు/స్టంపింగులు 17/– 10/– 88/– 18/–
మూలం: CricInfo, 2010 అక్టోబరు 17

షేక్ ఫౌద్ అహముల్ ఫాసియల్ బాకస్ (జననం 1954 జనవరి 31) వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ తరపున ఆడిన మాజీ క్రికెటర్.[1]

తొలినాళ్ళ కెరీర్

[మార్చు]

కుడిచేతివాటం బ్యార్ అయిన ఇతను 1977/78లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో 24 ఏళ్ల వయసులో వెస్టిండీస్ తరపున టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. 1978/79లో భారతదేశంపై జరిగన సీరీస్ అతని అత్యుత్తమ సీరీస్‌గా నిలిచింది. భారతదేశంలో అతను రెండవ టెస్ట్‌లో 96, ఆరవ టెస్ట్‌లో 250 చేశాడు.[2] అయితే మొత్తంగా తన 19 టెస్ట్ మ్యాచ్‌లలో 26.06 సగటుతో నిలవడంతో 1981/82 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత జట్టు నుండి అతన్ని తొలగించారు.[3]

అతను 1977, 1983 మధ్య వెస్టిండీస్ తరపున 29 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. అత్యధిక స్కోరు 80 కాగా 26.60 సగటుతో రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.[3]

వర్ణవివక్ష కారణంగా దక్షిణాఫ్రికాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరించిన నిర్ణయాన్ని ధిక్కరిస్తూ 1983-84లో రెబెల్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో చేరిన తర్వాత బాకస్‌ని వెస్టిండీస్ నిషేధించడంతో అతని కెరీర్ ముగిసింది.[ <span title="This claim needs references to reliable sources. (September 2023)">వివరణ అవసరం</span> ]

అమెరికా కెరీర్

[మార్చు]

అమెరికాకు వలస వెళ్ళాకా, అతను 1997, 2001 ICC ట్రోఫీ టోర్నమెంట్‌లలో యునైటెడ్ స్టేట్స్‌కు కెప్టెన్‌గా, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం కొనసాగించాడు.[ <span title="This claim needs references to reliable sources. (September 2023)">వివరణ అవసరం</span> ]

బ్యూనస్ ఏరిస్‌లో జరిగిన 2002 ఐసీసీ అమెరికాస్ ఛాంపియన్‌షిప్‌లో, యునైటెడ్ స్టేట్స్ క్రికెట్ జట్టు తన మొదటి అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. కెప్టెన్సీ చేసిన బాకస్ 83 పరుగుల స్కోరు చేసినందుకు "మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్"గా ఎంపికయ్యాడు. [4]

అతను 2020లో 11 ఇతర దేశాలతో దక్షిణాఫ్రికాలో పోటీ చేసేందుకు వెస్టిండీస్ ఓవర్ 50స్ ప్రపంచ కప్ జట్టులో చేరాడు [3]

బచ్చస్ US జట్టుకు కోచ్‌గా కూడా ఉన్నాడు. [5] [6]

మూలాలు

[మార్చు]
  1. Williamson, Martin. "Faoud Bacchus's Cricinfo Profile". Cricinfo. Retrieved 12 June 2015.
  2. "History this week:Guyanese single test centurions". Stabroek News (in అమెరికన్ ఇంగ్లీష్). 2010-09-16. Retrieved 2021-01-01.
  3. 3.0 3.1 3.2 "Faoud Bacchus bats for West Indies Over 50s team 2nd Over 50s World Cup bowls off in SA March 10th -24th". Kaieteur News (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-02-23. Retrieved 2020-12-31. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. Correspondent, Joseph Hayes, Sentinel. "CHAMPIONS IN OUR MIDST". nydailynews.com. Retrieved 2021-01-01.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  5. "Faoud Bacchus" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2004-09-02. Retrieved 2021-01-01.
  6. "Cricket: ICC Champions Trophy: States all-rounder caught in eye of the storm". the Guardian (in ఇంగ్లీష్). 2004-09-06. Retrieved 2021-01-01.

బాహ్య లింకులు

[మార్చు]