ఫ్యూజీ పర్వతం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఫ్యూజీ పర్వతం
Mt. Fuji, enhanced.JPG
జనవరి 2016 లో ఫ్యూజీ పర్వతం
ప్రాముఖ్యత 3,776 m (12,388 ft)ప్రపంచంలో 35వ ప్రాముఖ్యమైన పర్వత శిఖరం
ప్రదేశం
ఫ్యూజీ పర్వతం is located in Japan
ఫ్యూజీ పర్వతం
భౌగోళిక అక్షాలు 35°21′29″N 138°43′52″E / 35.35806°N 138.73111°E / 35.35806; 138.73111Coordinates: 35°21′29″N 138°43′52″E / 35.35806°N 138.73111°E / 35.35806; 138.73111[1]
భూగర్భశాస్త్రం
Last eruption 1707 to 1708
అధిరోహణం
మొదటి అధిరోహణ 663 లో ఎన్ నో గ్యోజా, ఎన్ నో ఒడ్జునో
సులభమైన అధిరోహణా
మార్గము
పర్వతారోహణం
Official name Fujisan, sacred place and source of artistic inspiration
Type సాంస్కృతిక
Criteria iii, vi
Designated 2013 (37th session)
Reference no. 1418
State Party జపాన్
ప్రాంతం ఆసియాలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు

ఫ్యూజీ పర్వతం జపాన్ దేశంలోని అత్యంత ఎత్తైన పర్వత ప్రదేశం. ఇది హొన్షు ద్వీపంలో ఉంది. దీని శిఖరం 3776 మీటర్ల (12,389 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఇది ఒక అగ్నిపర్వతం. 1707-08 సంవత్సరాల మధ్యలో ఒకసారి బద్ధలైంది. ఇది జపాన్ రాజధాని నగరమైన టోక్యోకి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాతావరణం నిర్మలంగా ఉన్న రోజున టోక్యో నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. సంవత్సరంలో చాలా నెలలపాటు మంచుతో కప్పబడి ఉండే దీని చక్కని శంఖాకారపు ఆకృతి వల్ల జపాన్ దేశాన్ని సూచించడానికి ఈ పర్వతాన్ని అనేక కళాఖండాలలో వాడుతుంటారు. దీన్ని నిత్యం అనేక మంది యాత్రికులు, పర్వతారోహకులు సందర్శిస్తుంటారు.

ఈ పర్వతం జపాన్ యొక్క మూడు పవిత్ర పర్వతాల్లో ఒకటి. మిగతా రెండు పర్వతాలు టేట్ పర్వతం, హకు పర్వతం. ప్రకృతి అందాల్లో ప్రత్యేకత కలిగిన ఈ పర్వతం జపాన్ దేశపు ప్రాచీన స్థలాల్లో ఒకటి.[2] జూన్ 22, 2013 న యునెస్కో వారు దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించారు.[2] యునెస్కో వారు ఈ ఫ్యూజీ పర్వతం కొన్ని శతాబ్దాలుగా కళాకారులకు, కవులకు స్ఫూర్తి కలిగిస్తూందనీ, అనేక మంది యాత్రికులను ఆకట్టుకుంటోందని ప్రశంసించారు.

మూలాలు[మార్చు]

  1. Triangulation station is 3775.63m. "Information inspection service of the Triangulation station" (in Japanese). Geospatial Information Authority of Japan, (甲府-富士山-富士山). Retrieved February 8, 2011. 
  2. 2.0 2.1 [1] Archived జూన్ 27, 2013 at the Wayback Machine