ఫ్రాంక్లిన్ రోజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Franklyn Rose
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Franklyn Albert Rose
పుట్టిన తేదీ (1972-02-01) 1972 ఫిబ్రవరి 1 (వయసు 52)
చాకీ హిల్, జమైకా
మారుపేరుFrankie, Rosey
ఎత్తు6 అ. 5 అం. (1.96 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేతి ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 215)1997 మార్చి 6 - భారత్ తో
చివరి టెస్టు2000 ఆగస్టు 3 - ఇంగ్లండు తో
తొలి వన్‌డే (క్యాప్ 82)1997 ఏప్రిల్ 26 - ఇండియా తో
చివరి వన్‌డే2000 జూలై 20 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1992–2003జమైకా
1998Northamptonshire
2001–2002గౌటెంగ్
2003సర్రీ
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్-డే ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 19 27 94 81
చేసిన పరుగులు 344 217 1,426 419
బ్యాటింగు సగటు 13.23 12.05 13.08 9.52
100లు/50లు 0/1 0/0 0/2 0/0
అత్యుత్తమ స్కోరు 69 30 96 37
వేసిన బంతులు 3,124 1,326 14,273 3,777
వికెట్లు 53 29 296 99
బౌలింగు సగటు 30.88 36.06 26.51 27.37
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 1 14 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 2 0
అత్యుత్తమ బౌలింగు 7/84 5/23 7/39 5/14
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 6/– 24/– 18/–
మూలం: Cricket Archive ఫ్రాంక్లిన్ రోజ్.webp, 2016 అక్టోబరు 24

ఫ్రాంక్లిన్ ఆల్బర్ట్ రోజ్ (జననం 1972 ఫిబ్రవరి 1) మాజీ వెస్ట్ ఇండియన్ క్రికెట్ ఆటగాడు. అతను ఒక కుడిచేతి వాటం బ్యాట్స్ మాన్, కుడి చేతి ఫాస్ట్ బౌలరు. అతడి పూర్తి నిడివి అవుట్ స్వింగ్ లో చాలా శక్తి ఉంది.

అతను ఆడిన మొదటి ఇన్నింగ్స్‌లో అతను 100 పరుగులిచ్చి 6 వికెట్లు సాధించాడు. కానీ అ తర్వాత జరిగిన టెస్టుల్లో అతని బౌలింగ్ నిరాశ కలిగించింది. డర్బన్‌లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో మాత్రమే అతను 84 పరుగులకు 7 వికెట్లు తీసుకున్నాడు..

2000 లో జింబాబ్వేపై రోజ్ 69 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. జింబాబ్వే చేసిన 308 కి సమాధానంగా, వెస్టిండీస్ 7 వికెట్లకు 170 పరుగులు చేసిన సమయంలో అతడు క్రీజు లోకి వచ్చాడు. అతడు, జిమ్మీ ఆడమ్స్ (101 నం) కలిసి 8 వ వికెట్టుకు 148 పరుగులు జోడించారు. అదొక రికార్డు. విండీస్ 10 వికెట్లతో ఆ మ్యాచ్‌ను గెలిచింది. అనంతరం ఆయనకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బహుమతి వచ్చింది.

అదే సంవత్సరం, అతని దూకుడు వలన వెస్టిండీస్ లార్డ్స్‌లో జరిగిన రెండవ టెస్టు కోల్పోయింది. ఇంగ్లండ్‌కు చెందిన డొమినిక్ కార్క్‌ను షార్ట్ పిచ్ బౌలింగ్‌తో బెదరగొట్టే ప్రయత్నాలు చేసినపుడు విలువైన పరుగులు ఇచ్చుకున్నాడు. అవే ఆ తక్కువ స్కోరుల మ్యాచిని వెస్టిండీస్ ఓటమికి దోహదపడ్డాయి.

అతను 28 ఏళ్ళ వయసులోనే జట్టు నుంచి శాశ్వతంగా తొలగించినప్పటికీ, అతని టెస్ట్ బౌలింగ్ సగటు 30.88 అతడి సమకాలీన వెస్టిండీస్ బౌలర్లందరి కంటే అది తక్కువ. దాదాపు ఒక దశాబ్దం తరువాత కెమర్ రోచ్ వచ్చే వరకూ ఆ రికార్డు చెదరలేదు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2016 వరకు అతను న్యూజీలాండ్ లోని ఆక్లాండ్‌లో నివసించాడు, అక్కడ అతను 2011-12 సీజన్లో ఆక్లాండ్ యొక్క నార్త్ షోర్‌లోని బిర్కెన్‌హెడ్ సిటీ క్రికెట్ క్లబ్‌లో శిక్షణ ఇచ్చాడు.

న్యూజిలాండ్‌లో అతని పని వీసా 2012 మార్చిలో ముగిసింది. అయితే 2016 ఏప్రిల్ లో జమైకాకు తిప్పి పంపేవరకూ అతడు అక్కడే ఉన్నాడు. 2014 లో అతడికి బహిష్కరణ ఉత్తర్వులు ఇచ్చారు. బహిష్కరణకు 5 వారాల ముందు అతన్ని మౌంట్ ఈడెన్ జైలులో అదుపులోకి తీసుకున్నారు [1] [2]

అతను న్యూజిలాండ్‌లో ఉండటానికి ప్రయత్నించినప్పుడు అతని వీసా అప్పటికే గడువు ముగిసింది. అత్యాచారం కేసులో న్యూజిలాండ్‌లో విచారణలో ఉన్నాడు. అతన్ని జమైకాకు పంపించారు. [3]

అంతర్జాతీయ రికార్డు

[మార్చు]

టెస్ట్ 5 వికెట్లు

[మార్చు]
# గణాంకాలు మ్యాచ్ ప్రత్యర్థి వేదిక నగరం దేశం ఇయర్
1 6/100 1 link=|border   సబీనా పార్క్ కింగ్స్టన్ జమైకా 1997
2 7/84 11 link=|border   కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్ డర్బన్ దక్షిణ ఆఫ్రికా 1998
ఫ్రాంక్లిన్ రోజ్

వన్డే 5 వికెట్లు

[మార్చు]
# గణాంకాలు మ్యాచ్ ప్రత్యర్థి వేదిక నగరం దేశం ఇయర్
1 5/23 18 link=|border   ఆర్నోస్ వేల్ గ్రౌండ్ కింగ్స్‌టౌన్ సెయింట్ విన్సెంట్ 2000

మూలాలు

[మార్చు]
  1. http://www.stuff.co.nz/sport/cricket/80963450/west-indies-cricketer-says-nz-is-not-safe-for-black-cricketers
  2. http://www.stuff.co.nz/sport/cricket/78844480/Depressed-ex-Windies-cricketer-deported-after-attempt-to-stay-in-NZ-fails
  3. http://m.nzherald.co.nz/nz/news/article.cfm?c_id=1&objectid=11626336