Jump to content

ఫ్రాంక్ లాయిడ్

వికీపీడియా నుండి
ఫ్రాంక్ లాయిడ్
ఫ్రాంక్ లాయిడ్ (1939)
జననం
ఫ్రాంక్ విలియం జార్జ్ లాయిడ్[1]

1886, ఫిబ్రవరి 2
గ్లాస్గో, స్కాట్లాండ్
మరణం1960, ఆగస్టు 10 (74 సం)
కాలిఫోర్నియా, యుఎస్
సమాధి స్థలంఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్‌, గ్లెన్‌డేల్‌
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1913–1955
జీవిత భాగస్వామిఅల్మా హాలర్‌ (మ. 1952)
వర్జీనియా కెల్లాగ్‌ (1957-1960)

ఫ్రాంక్ విలియం జార్జ్ లాయిడ్ (1886, ఫిబ్రవరి 2 – 1960 ఆగస్టు 10) బ్రిటిష్ అమెరికన్ సినిమా దర్శకుడు, నటుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ స్థాపకులలో ఒకడిగా ఉన్న ఫ్రాంక్ లాయిడ్,[2] 1934 నుండి 1935 వరకు దాని అధ్యక్షుడిగా పనిచేశాడు.

జననం

[మార్చు]

లాయిడ్ 1886, ఫిబ్రవరి 2న గ్లాస్గో శివార్లలోని కాంబూస్లాంగ్‌లో జన్మించాడు. తల్లి జేన్ స్కాటిష్, అతని తండ్రి ఎడ్మండ్ వెల్ష్ (మెకానికల్ ఇంజనీర్). లాయిడ్ కుటుంబం లండన్‌లోని షెపర్డ్స్ బుష్‌లో స్థిరపడి, అక్కడ పబ్ నడుపింది. లాయిడ్ ఒక షూ దుకాణంలో పనిచేశాడు, బృందగాన బృందాలలో పాడాడు. వాడెవిల్లే సమూహంలో చేరాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1913, జూలై 11న ఫ్రాంక్ లాయిడ్ నటి అల్మా హాలర్‌తో వివాహం జరిగింది. ఆమె 1952 మార్చి 16న మరణించింది. 1955లో వర్జీనియా కెల్లాగ్‌ను వివాహం చేసుకున్నాడు.

సినిమాలు (కొన్ని)

[మార్చు]
  • ది టెస్ట్ (1914) (నటుడు)
  • ది స్పై (1914) (నటుడు)
  • ది ఓపెన్డ్ షట్టర్స్ (1914) (నటుడు)
  • ది బ్లాక్ బాక్స్ (1915) (నటుడు)
  • ది జెంటిల్‌మన్ ఫ్రమ్ ఇండియానా (1915)
  • జేన్ (1915)
  • ది టంగ్స్ ఆఫ్ మెన్ (1916)
  • ది కోడ్ ఆఫ్ మార్సియా గ్రే (1916)
  • ది ఇన్‌ట్రిగ్ (1916)
  • డేవిడ్ గారిక్ (1916)
  • ది కాల్ ఆఫ్ ది కంబర్లాండ్స్ (1916)
  • మేడమ్ లా ప్రెసిడెంట్ (1916)
  • ది మేకింగ్ ఆఫ్ మద్దలేనా (1916)
  • ది స్ట్రాంగర్ లవ్ (1916)
  • ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్ (1917)
  • ది హార్ట్ ఆఫ్ ఎ లయన్ (1917)
  • లెస్ మిజరబుల్స్ (1917)
  • వెన్ ఎ మ్యాన్ సీస్ రెడ్ (1917)
  • అమెరికన్ మెథడ్స్ (1917)
  • ది ప్రైస్ ఆఫ్ సైలెన్స్ (1917)
  • ది రెయిన్‌బో ట్రైల్ (1918)
  • రైడర్స్ ఆఫ్ ది పర్పుల్ సేజ్ (1918)
  • ది లవ్స్ ఆఫ్ లెట్టీ (1919)
  • ది మ్యాన్ హంటర్ (1919)
  • మేడమ్ X (1920)
  • ది సిల్వర్ హోర్డ్ (1920)
  • ది ఉమెన్ ఇన్ రూమ్ 13 (1920)
  • ది గ్రేట్ లవర్ (1920)
  • ది ఇన్విజిబుల్ పవర్ (1921)
  • ది గ్రిమ్ కమెడియన్ (1921)
  • ది మ్యాన్ ఫ్రమ్ లాస్ట్ రివర్ (1921)
  • రోడ్స్ ఆఫ్ డెస్టినీ (1921)
  • ఆలివర్ ట్విస్ట్ (1922)
  • ది ఎటర్నల్ ఫ్లేమ్ (1922)
  • ది సిన్ ఫ్లడ్ (1922)
  • ది వాయిస్ ఫ్రమ్ ది మినార్ (1923)
  • యాషెస్ ఆఫ్ వెంజియన్స్ (1923)
  • ది సీ హాక్ (1924)
  • ది సైలెంట్ వాచర్ (1924)
  • ది స్ప్లెండిడ్ రోడ్ (1925)
  • విండ్స్ ఆఫ్ ఛాన్స్ (1925)
  • ది వైజ్ గై (1926)
  • ది ఈగిల్ ఆఫ్ ది సీ (1926)
  • ది డివైన్ లేడీ (1929)
  • యంగ్ నోవేర్స్ (1929)
  • డ్రాగ్ (1929)
  • ది లాష్ (1930)
  • ది వే ఆఫ్ ఆల్ మెన్ (1930)
  • ది ఏజ్ ఫర్ లవ్ (1931)
  • ఈస్ట్ లిన్ (1931)
  • ఎ పాస్‌పోర్ట్ టు హెల్ (1932)
  • కావల్కేడ్ (1933)
  • బర్కిలీ స్క్వేర్ (1933)
  • హూప్-లా (1933)
  • అండర్ టూ ఫ్లాగ్స్ (1936)
  • వెల్స్ ఫార్గో (1937)
  • మెయిడ్ ఆఫ్ సేలం (1937)
  • ఇఫ్ ఐ వర్ కింగ్ (1938)
  • రూలర్స్ ఆఫ్ ది సీ (1939)
  • ది హోవార్డ్స్ ఆఫ్ వర్జీనియా (1940)
  • ది లేడీ ఫ్రమ్ చెయెన్నె (1941)
  • ది స్పాయిలర్స్ (1942) (నిర్మాత)
  • బ్లడ్ ఆన్ ది సన్ (1945)
  • ది షాంఘై స్టోరీ (1954)
  • ది లాస్ట్ కమాండ్ (1955)

అవార్డులు

[మార్చు]

స్కాట్లాండ్ మొట్టమొదటి అకాడమీ అవార్డు గ్రహీత, సినిమారంగ చరిత్రలో అద్వితీయుడు, 1929లో మూకీ చిత్రం (ది డివైన్ లేడీ ), పార్ట్-టాకీ ( వెయరీ రివర్ ), పూర్తి టాకీ ( డ్రాగ్ ) సినిమాలకు మూడు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యి, ది డివైన్ లేడీ సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకున్నాడు.కావల్కేడ్ సినిమాకు 1933లో నామినేట్ అయ్యి, మళ్ళీ గెలుపొందాడు. 1935లో అత్యంత విజయవంతమైన చిత్రం మ్యూటినీ ఆన్ ది బౌంటీకి సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నామినేషన్ అందుకున్నాడు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ & సైన్సెస్ వ్యవస్థాపకుడిగా లాయిడ్ ఘనత పొందాడు.

1957లో సినిమారంగానికి చేసిన విశిష్టమైన కృషికి జార్జ్ ఈస్ట్‌మన్ హౌస్ అందించిన జార్జ్ ఈస్ట్‌మన్ అవార్డును అందుకున్నాడు.[3]

1960 ఫిబ్రవరి 8న లాయిడ్ 6667 హాలీవుడ్ బౌలేవార్డ్‌లో సినిమారంగానికి చేసిన కృషికి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో స్టార్‌ని అందుకున్నాడు.[4][5]

మరణం

[మార్చు]

లాయిడ్ తన 74 సంవత్సరాల వయస్సులో 1960, ఆగస్టు 10న మరణించాడు. కాలిఫోర్నియాలోని గ్లెన్‌డేల్‌లోని ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్‌లో ఖననం చేయబడ్డాడు.

మూలాలు

[మార్చు]
  1. Pawlak, Debra Ann (12 January 2012). Bringing Up Oscar: The Story of the Men and Women Who Founded the Academy. Pegasus Books. ISBN 9781605982168.
  2. Pawlak, Debra. "The Story of the First Academy Awards". The Mediadrome. Archived from the original on 30 December 2006. Retrieved 2023-06-24.
  3. The George Eastman Award Archived 15 ఏప్రిల్ 2012 at the Wayback Machine
  4. "Frank Lloyd | Hollywood Walk of Fame". www.walkoffame.com. Retrieved 2023-06-24.
  5. "Frank Lloyd". Los Angeles Times. Retrieved 2023-06-24.

బయటి లింకులు

[మార్చు]