ఫ్రీజ్ టెక్నిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫ్రీజ్ టెక్నిక్ అనేది నాటకం లో ఉపయోగించే ఒక ప్రక్రియ. ఒక సన్నివేశంలో ఒక విషయం ఒక పాత్ర చెప్పిన తరువాత సంతోషంకానీ, విషాదంకానీ, ఆశ్చర్యంగానీ కలిగినప్పుడు మిగిలిన పాత్రలు ఎలా ఉన్నవి అలా బిగుసుకుపోయి కావలసిన భావాన్ని కలుగజేయడాన్ని ఫ్రీజ్ టెక్నిక్ అంటారు.[1] నాటకంలో ఏపాత్ర తోనైనా స్వగతం చెప్పించేటప్పుడు మిగతా పాత్రలను ఫ్రీజ్ చేయించవచ్చు. అలాగే వ్యాఖ్యాత జరుగుతున్న సన్నివేశం గురించి వ్యాఖ్యానించవలసి వచ్చినప్పుడు ఆ సన్నివేశం మొత్తాన్ని ఫ్రీజ్ చేయించవచ్చు. ఇంకా సన్నివేశ బ్యాక్ గ్రౌండ్ లో ఫ్లాష్ బ్యాక్ గానీ, షాడో ప్లే గానీ, డైరెక్టు దృశ్యంగానీ చూపించేటప్పుడుగానీ ముందు రంగస్థలంపైనున్న నటులను ఫ్రీజ్ చేయవచ్చు. ఇలా ఇంకా అనేక సందర్భాలలో దర్శకుడు అవసరాణుగుణంగా ఫ్రీజ్ టెక్నిక్ ను ఉపయోగించుకొనవచ్చు.


తెలుగు నాటకరంగంలో ఫ్రీజ్ టెక్నిక్

[మార్చు]

విదేశాలలో పర్యటించి రంగస్థల శాస్త్ర అధ్యయనం, చేసిన అధ్యాపకుల వల్ల విదేశీ నాటకాలలో వినియోగించిన ఫ్రీజ్ టెక్నిక్ ను తెలుగు నాటకరంగంలోకి తీసుకురావడం జరిగింది.

1964లో మరో మొహెంజొదారో నాటకం ద్వారా ఎన్.ఆర్.నంది ఈ ఫ్రీజ్ ప్రక్రియును తెలుగు నాటకరంగంలోకి ప్రవేశపెట్టారు.[2] ఆ తరువాత ఇది అనేక నాటకాలలో ప్రవేశపెట్టబడింది. ఎలియనేషన్ ధోరణి ప్రయోగించిన సందర్భంలో విధిగా మిగిలిన పాత్రలన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. సూత్రధారుడు పాత్రలను, లేదా సన్నివేశాన్ని వివరించే సమయంలో కూడా పాత్రలు ఫ్రీజ్ అవుతాయి.

ఫ్రీజ్ టెక్నిక్ ఉపయోగించిన కొన్ని నాటిక-నాటకాలు

[మార్చు]
  1. మరో మొహెంజొదారో (నాటకం) - ఎన్.ఆర్.నంది
  2. దారి తప్పిన ఆకలి (నాటిక) - పరుచూరి వెంకటేశ్వరరావు
  3. గోగ్రహణం (నాటిక) - తనికెళ్ల భరణి
  4. బొమ్మలాట, గంగిరెద్దులాట (నాటకాలు) - నడిమింటి నరసింహరావు
  5. తాజి, ఉప్పెనొచ్చింది (నాటికలు) - డిన్ బద్రూ
  6. కుక్క (నాటిక) - యండమూరి వీరేంద్రనాథ్

మూలాలు

[మార్చు]
  1. తెలుగు నాటకరంగం నూతన ధోరణులు - ప్రయోగాలు, (పుట. 507), రచన. డా. కందిమళ్ళ సాంబశివరావు
  2. ఆంధ్రజ్యోతి. "తెలుగు ప్రయోగ నాటక పితామహుడు". Retrieved 6 August 2017.[permanent dead link]