నూనెలోని ఫ్రీఫ్యాటి ఆమ్లశాతం
ఈ పరీక్షా విధానాన్ని నూనెగింజల నుండి నూనెతీయు మిల్లులలో, అలాగే అయిల్ కేకు (oil cakes) లనుండి నూనె తీయు సాల్వెంటు ప్లాంటు పరిశ్రమల్లోని ప్రయోగశాలల్లో నిర్వహిస్తారు
ఫ్రీఫ్యాటి ఆమ్లాలు
[మార్చు]శాక నూనెలు (vegetable oils) అనేవికొవ్వు ఆమ్లాలు, గ్లిజరిన్ (glycerol) లు సంయోగంచెందటం వలన ఏర్పడును. మూడు కొవ్వు ఆమ్లాలు, ఒక గ్లిజరిన్ అణువు సంయోగం చెందటం వలన ఒక అణువునూనె, మూడు అణువుల నీరు (H2O) ఏర్పడును. నూనెలలో వున్న లిపేజి అనే ఎంజైం నూనెను అనుకూల ఉష్ణోగ్రత, నీరు అందుబాటులో వున్నప్పుడు హైడ్రాలిసిస్ చర్య ద్వారా నూనెను తిరిగి కొవ్వుఆమ్లాలుగా, గ్లిజరిన్‌గా విడగొట్టును. నూనెలో గ్లిజరినుతో బంధం లేకుండ వున్న ఈ కొవ్వు ఆమ్లాలను ఫ్రీ ఫ్యాటి ఆమ్లాలందురు (Free Fatty Acids; F.F.A.). తేమశాతం తక్కువగా (7-8) వున్న తాజా నూనెగింజల నుండి తీసిన నూనెలో ఫ్రీఫ్యాటి ఆమ్లాల శాతం 0.5-1.0% లోపు వుండును. కాని ఎక్కువ కాలం నిల్వవున్న, లేదా తడిసి పాడైన విత్తనాలలోని నూనె, సాల్వెంట్ ఎక్స్‍ట్రాక్షన్ పద్ధతిలో తీసిన నూనెలో ఈ ఫ్రీఫ్యాటి ఆమ్లాల శాతం అధికంగా 2-5% వరకు వుండును. తవుడు నుండి తీయునూనెలో 5-25% వరకు కుడా వుండును. వంటనూనెగా ఏ నూనెనైన ఉపయోగించాలంటే దానిలోని ఫ్రీ ఫ్యాటి ఆమ్లాల శాతం 0.1-0.2% శాతం మించి వుండరాదు.
అంతకు మించివున్నచో తప్పనిసరిగా నూనెలోని ఫ్రీఫ్యాటి ఆమ్లాలను తొలగించిన తరువాతనే నూనెను వంటనూనెగా ఉపయోగించాలి. అందుచే ఇటు రిపైండ్ ఆయిల్ ఉత్పత్తిచేయువారు, అటు మూడి నూనెను ఉత్పత్తి చేయువారికి నూనెలోని ఫ్రీఫ్యాటి ఆమ్లశాతం చాలా ముఖ్యమైనది. నూనెలో ఫ్రీ ఫ్యాటి ఆమ్ల శాతం పెరిగేకొలది, రిపైనరిలాస్ పెరుగుతుంది.
ప్రయోగం
[మార్చు]నూనెలోని ఫ్రీ ఫ్యాటి (కొవ్వు) ఆమ్లాల శాతంని నిర్ణయించుటకై/ పరీక్షించుటకై ఈ దిగువ పెర్కొన్న పరికరాలు, రసాయన పదార్థాలు కావాలి.
పరికరాలు
[మార్చు]1. బ్యూరెట్: 50 మి.లీ. కెపాసిటి ఉంది.
2. 100-200 మి.లీ. కోనికల్ ఫ్లాస్కు (conical flask)
3. 25 మి.లీ. మెజరింగ్ సిలిండరు (measuring cylinder) /కొలజాడి
4. ఎనలైటికల్ బాలెన్స్: 200గ్రా<ల. కెపాసిటి ఉంది..01 మి.గ్రాం. వరకు కచ్చితంగా తూచగల్గినది.
రసాయనిక పదార్థాలు
[మార్చు]1. యిథైల్ ఆల్కహల్: 95% గాఢత ఉంది.లేదా రెక్టిపైడ్ స్పిరిట్. పినాప్తలీన్‌తో తటస్దగుణం (neutral) కలిగి వుండాలి. BIS:323-1959 ప్రమాణాలకు లోబడి వుండాలి.
2. పినాప్తలీన్ ఇండికెటరు ద్రావణం:100 మి.లీ.ఆల్కహాల్ లో 1.0 గ్రాం. పినాప్తలీన్ పౌడరును కలిపి తయారు చేసింది.
3. Std KOH లేదా NaOH ద్రావణం: ప్రమాణికరింపబడిన (standardized) నార్మాలిటి (0.1-0.3N) కలిగిన ద్రావణం.
బాగా కలియబెట్టిన పరీక్షించవలసిన నూనెను తగుప్రమాణంలో (2-5% F.F.A.అయినచో 2 గ్రాం .ల వరకు,5-5-20% F.F.A. అయినచో 1 గ్రాం.లోపు, రెపైండ్ నూనెలయినచో 5-8 గ్రాం.ల వరకు పరీక్షకై తీసుకోవచ్చును) 100-200 మి.లీ.ల కోనికల్ ఫ్లాస్కులో తీసుకొని దాన్ని తూచి, దాని కచ్చితమైన భారాన్ని నమోదు చెయ్యాలి. ఇప్పుడు నూనెవున్న కొనికల్ ఫ్లాస్కులో 25 మి. లీ. ల తటస్దికరించిన యిథైల్ ఆల్కహల్‌ను పొయ్యాలి. 3-4 చుక్కల పినాప్తలీన్ ఇండికెటరు ద్రావణాన్ని కోనికల్ ఫ్లాస్కులోని ఆల్కహల్‌లో కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మాంటిల్ హీటరు మీద వేడిచెయ్యవలెను. ఇలా వేడి చెయ్యడం వలన ఫ్రీ ఫ్యాటి ఆమ్లాలు ఆల్కహల్ లో త్వరగా కరుగును. ఇలా వెచ్చచేసిన నూనె+అల్కహల్‌ను అంతకు ముందే బ్యూరెట్‌లో నింపి వుంచిన Std KOH లేదా NaOH నార్మాలిటి ద్రావణంతో కోనికల్ ఫ్లాస్కులోని ఆల్కహల్+నూనె ద్రవణం పింక్‌కలరు లోనికి మారే వరకు టైట్రెసన్ చేయ్యాలి. కోనికల్ ఫ్లాస్కులోని నూనె పింక్‌కలరుగా మారగానే టైట్రెసన్ వెంటనే నిలిపివెయ్యలి. టైట్రసనుకై తీసికొన్న బ్యూరెట్ లోని Std KOH లేదా NaOH నార్మాలిటి సొల్యుసన్ యొక్క రీడింగ్. మి.లీ.లలో తీసుకోవాలి. టైట్రెసన్ చేయునప్పుడు కోనికల్ ఫ్లాస్కును బాగా అటు ఇటు కదుపుతూ చెయ్యాలి. బ్యూరెట్ లోని నార్మాలిటి ద్రవాన్ని కోనికల్ ఫ్లాస్కులో నెమ్మదిగా బొట్లు (Drop) బొట్లుగా నెమ్మదిగా పడునట్లు బ్యూరెట్ కాక్ ను ఆపరేట్ చెయ్యాలి
నూనె లోని ఫ్రీఫ్యాటి ఆమ్లశాతం
[మార్చు]వివరణ
V=టైట్రెసన్ కై వాడిన బ్యూరెట్‌లోని నార్మాలిటి సొల్యుసన్ పరిమాణం, మి.లీ.లలో
N= టైట్రెసన్‌కు వాడిన KOH లెదా NaOH ద్రావణం యొక్క నార్మాలిటి
W= పరీక్షించుటకై తీసుకున్న నూనె బరువు, గ్రాం.లలో
ఆమ్ల విలువ (Acid value)
[మార్చు]కొన్ని సందర్భాలలో ఫ్రి ఫ్యాటి ఆమ్లశాతానికి బదులుగా ఆమ్ల విలువ/ఆసిడ్ వ్యాల్వుగా కూడా లెక్కించెదరు. ఆసిడ్‍వ్యాల్వు అనగా ఒక గ్రాం. నూనెలో వుండు ఫ్రీఫ్యాటి ఆమ్లాలను సపొనిఫికెసన్ (సబ్బుగా చెయ్యడం) చెయ్యుటకు పట్టు పొటాషియం హైడ్రాక్సైడ్ మి.గ్రాం.లలో అని భావం. ఆసిడ్ విలువ ఆధారంగా నూనెలోని ఫ్రీఫ్యాటి ఆమ్లాన్ని తొలగించుటకు అవసరమగు పొటాసియం లేదా సోడియం హైడ్రక్సైడ్ ఎంతో తెలుస్తుంది. నూనెలోని ఫ్రీ ఫ్యాటి ఆమ్లాలు సోడియంతో చర్య నొంది సోడియం లవణాలు (sodium salts) గా ఏర్పడును. ఈ కొవ్వు ఆమ్లాల, సోడియం/పొటాసియం లవణాలనే సబ్బులు అంటారు. నూనెలోని ఆసిడ్ వ్యాల్వు నూనెలోని ఫ్రి ఫ్యాటి ఆమ్లశాతం కన్న రెండింతలు వుండును. కారణం ఆసిడ్ విలువ లెక్కించు ఇక్వెసన్ ఫార్ములా 56.1VN/W అనేది ఫ్రీఫ్యాటి ఆమ్లశాతం ఇక్వెసన్ ఫార్ములా 28.2VN/W కు ఇంచుమించు రెండింతలు వుండటం వలననే.
నూనెలలోని ఫ్రీ ఫ్యాటి ఆమ్ల శాతం-సమీకరణలో సవరణ
[మార్చు]నూనెలు సంతృప్త, అసంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి వుండును.నూనెలలో సాధారణంగా వుండు సంతృప్త కొవ్వు ఆమ్లాలు, లారిక్, మిరిస్టిక్, పామిటిక్, స్టియరిక్ ఆమ్లాలు, అలాగే నూనె లలో అధికంగా వుండు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఒలిక్, లినొలిక్, లినొలెనిక్ ఆమ్లాలు.అయా కొవ్వు ఆమ్లాలలో వుండు కార్బనుల సంఖ్య, హైడ్రొజనుల సంఖ్యను బట్టి వాటి అణు భారం మారును.సాధారణంగా పరీక్షా ప్రయోగ శాలలో ఫ్రీ ఫ్యాటి ఆమ్లాల (స్వేచ్ఛాయుత కొవ్వు ఆమ్లాలు) శాతాన్ని ఒలిక్ ఆసిడ్ గా లెక్కించెదరు.ఒలిక్ ఆమ్లం అణుభారం 282.అందుచే ఫ్రీ ఫ్యాటి ఆమ్ల శాతాన్ని ఒలిక్ ఆసిడ్ గా లిక్కించునప్పుడు సమీకరణ 28.2VN /W . (సాధన:100 X 282 X VN / W X 1000 =28.2VN / W). కాని కొబ్బరి, పామ్‍కెర్నల్ నూనెలలో లారిక్ ఆమ్లం, పామాయిల్ లో పామెటిక్ ఆమ్లం, ఆముదంలో రిసినొలిక్ ఆమ్లం, ఆవాలనూనెలో యురిసిక్ ఆమ్లం అధిక శాతంలో వుండును.ఇలాంటి నూనెలలో ఫ్రీఫ్యాటి ఆమ్ల శాతం గణించు నప్పుడు, కొనుగోలుదారునికి, అమ్మకపు దారునికి పరస్పరం అంగీకారమైన దిగువ సమీకరణాలను గణనకు తీసుకొందురు.
ఫ్రీ ఫ్యాటి ఆమ్లశాతం (ఒలిక్ ఆమ్లంగా) = 28.2 VN / W
ఫ్రీ ఫ్యాటి ఆమ్లంశాతం (పామిటిక్ ఆమ్లంగా) = 25.6 VN / W
ఫ్రీఫ్యాటి ఆమ్లశాతం (లారిక్ ఆమ్లంగా) = 20.0 VN / W
ఫ్రీ ఫ్యాటి ఆమ్లశాతం (రిసినొలిక్ ఆమ్లంగా) = 29.8 VN / W
పొటొ గ్యాలరి
[మార్చు]-
నూనె సాంపిల్ బాటిల్ లో
-
కొనికల్ ఫ్లాస్కులో నూనె సాంపిల్ ను తీసుకొని తూచుట
-
మాంటిల్ హిటరు మీద నూనె+ఆల్కహల్ ను వేడి చెయ్యడం
-
టైట్రెసన్ చేస్తున్న కెమిస్ట్
-
టైట్రెసన్ పూర్తయి పింక్ కలరుకు మారిన నూనె+ఆల్కహల్
ఆధారాలు/ములాలు
[మార్చు]
- ↑ Methods of Sampling and test for oils and fats,IS:548(partI-1964)by Indian standards,page no.29
- B.S.684:1958 Methods of Anylysis Of Oils And Fats.British Standards Institution.