Coordinates: 43°00′43″N 83°48′37″W / 43.011962°N 83.810379°W / 43.011962; -83.810379

ఫ్లింట్ కాశీ విశ్వనాథ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్లింట్ కాశీ విశ్వనాథ దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:మిచిగాన్‌
ప్రదేశం:ఫ్లింట్
అక్షాంశ రేఖాంశాలు:43°00′43″N 83°48′37″W / 43.011962°N 83.810379°W / 43.011962; -83.810379

ఫ్లింట్ కాశీ విశ్వనాథ దేవాలయం, అమెరికా మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఫ్లింట్ మెట్రోపాలిటన్ ఏరియాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వేలాదిమంది హిందువులకు ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. యుఎస్ఏలోని మెయిన్‌ల్యాండ్‌లో ఉన్న మొదటి శివాలయం.[1]

చరిత్ర[మార్చు]

1979లో ఫ్లింట్‌లో ఒక దేవాలయాన్ని ప్రారంభించేందుకు కొంతమంది ప్రవాస భారతీయులు ముందుకు వచ్చారు. 1980 జనవరిలో దేవాలయ నిర్మాణం ప్రణాళిక, ఫిబ్రవరిలో ఖర్చు అంచనా వేయబడింది. మార్చి, ఏప్రిల్ నెలలో దేవాలయ కార్పోరేషన్‌గా ఆమోదించబడి, పన్ను మినహాయింపు లభించింది. జూలై/ఆగస్టు నెలల్లో ముండి టౌన్‌షిప్‌లో అనువైన భూమికోసం పలు ప్రాంతాలు చేశారు. అక్టోబరులో ఎల్మ్స్ రోడ్‌లో ప్రస్తుతం దేవాలయమున్న 10 ఎకరాల విస్తీర్ణం ప్రదేశం లభించింది.

1980, నవంబరు 22న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. 1980 డిసెంబరులో నిర్మాణం ప్రారంభమయింది. 1982 అక్టోబరు 27 నుండి 31 వరకు దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. నాలుగు సంవత్సరాల కృషి తరువాత ఈ దేవాలయం తెరవబడింది.[2]

రూపకల్పన[మార్చు]

65 అడుగుల ఎత్తులో ఈ దేవాలయ గోపురం నిర్మించబడింది. 126 కంటే ఎక్కువమంది దేవతామూర్తులు దేవాలయ ముఖద్వారంపై చెక్కబడ్డారు. ప్రతి ఒక్క స్తంభంపై దేవతామూర్తులు ఉన్నారు. స్తంభాలు తెల్లటి సున్నపురాయితో తయారుచేయబడ్డాయి.[3] లోపలి భాగంలో ప్రార్థనా మందిరం, ఫలహారశాల ఉన్నాయి.[4]

ఇతర దేవాలయాలు[మార్చు]

ఈ దేవాలయంలో శివుడు ప్రధాన దైవం కాగా, ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఆంజనేయస్వామి, నవగ్రహ దేవాలయాలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Shiva Temple". sri-kasi-temple (in ఇంగ్లీష్). Retrieved 2022-04-03.
  2. "Flint Sri Kasi Viswanatha Temple". Temples In India Info. 2018-06-02. Archived from the original on 2022-04-03. Retrieved 2022-04-03.
  3. "Ex-director charged with stealing $400K from Hindu temple". freep. 7 April 2016. Retrieved 24 January 2020.
  4. "Kasi Vishawanatha Temple Flint". MichiganIndia. Archived from the original on 2021-05-11. Retrieved 2022-04-03.