బంధకవిత్వం అంటే ! ? వైద్యం వేంకటేశ్వరాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బంధకవిత్వం అంటే

                ఆత్మ అక్షరం, శరీరం ఒక చిత్తరువు/బొమ్మ. ఇలాంటి

అక్షర  చిత్రబంధాలను   భగవానుడు     విశ్వ మహా చిత్రకావ్యంలో

అసంఖ్యాకంగా రచించాడు.  

                విశ్వమంతటా వ్యాపించినవాడు విష్ణువు(సర్వంవ్యాప్నోతీతి

విష్ణుః). అందునే  'సహస్రనామం'లో  విశ్వం - విష్ణుః  అనే    నామాలు

మొట్టమొదట  చోటు  చేసుకున్నాయి. అంతటా   వ్యాపించిన  వానికి

ప్రత్యేకించి ఒక ఆకారం లేదన్నమాట. నిరాకారమైన. దైవాన్నికూడ భక్తితో

సుందరాకారంగా "బంధించడం" భారతీయులకు బాగాతెలుసు.

               ఖేదాలన్నిటికీ కారణం  భవ"బంధాలే".అయితే సాహిత్యంలో

మాత్రం విద్వాంసులకు అద్భుతరసాన్ని ఆవిష్కరించి మోదాన్ని కూర్చేది

"చిత్రబంధాలే".  "చిత్రబంధ కవిత్వం" అంటే ఏమిటో తెలుసుకుందాం--

              పూర్వాలంకారికులు చిత్రబంధాలను గురించి తమ సంస్కృత

గ్రంథాలలో చాలామంది చెప్పినారు.వాటిలోకొందరుచెప్పినకొన్నివాక్యాలు

ఆచార్య రుయ్యకః - ' వర్ణానాం ఖడ్గాద్యాకృతి హేతుత్వే  చిత్రమ్'

                                               (అలంకార సర్వస్వం -10)

ఆచార్యజయదేవః-'కావ్యవిత్ ప్రవరైచ్చిత్రం ఖడ్గబంధాదిలక్ష్యతే'

                          (చంద్రాలోకః -5-9)

ఆచార్యవిద్యానాదః-'వర్ణానామథ పద్మాద్యాకృతి హేతుత్వముచ్యతే చిత్రమ్'

                                                                           (ఏకావలీ)

ఆచార్యవిశ్వనాథః-'పద్మాద్యాకార హేతుత్వే వర్ణానాం చిత్రముచ్యతే'

                                                           (సాహిత్యదర్పణం 10-13)‌

శ్లో॥అనేకధా వృత్తవర్ణ విన్యాసైః శిల్పకల్పనా,

      తత్త త్ప్రసిద్ధ వస్తూనాం బంధ ఇత్యభి ధీయతే.

                                           -(అగ్నిపురాణ - 334,35,36)

శ్లో॥భంగ్యంతర కృత తత్క్రమ- వర్ణ నిమిత్తాని వస్తు రూపాణి,

      సాంకాని విచిత్రాణిచ - రచ్యంతే యత్ర తచ్చిత్రమ్.

                                                  రుద్రట - 5- 1

శ్లో॥ చిత్రంతు నియమన్యాసో వర్ణానా మీప్సిత క్రమం,

       స్వరవర్ణ గతి స్థాన బంధ హారాది బంధనాత్.

                                          --రసార్ణవాలంకార 3 - 52

యస్మిన్ కస్మిన్ చిత్రే బంధితం కవిత్వం(సప్తమీతత్పురుషకర్మధారయం)

బంధేన యుక్తం కవిత్వం అని చెప్తే మధ్యమ పదలోప కర్మధారయం.

సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు- యం. కృష్ణమాచారియర్ గారు---

   Bandha  is  the name given to verses in which

the letters arranged in the form of sword,car,

Serpent etc.అని చెప్పినారు  (History if classical

sanskrit literature - P.375).

   తెలుగు - ఇంగ్లీషు బ్రౌణ్యనిఘంటంవులో--

బంధకవనము,బంధకవిత్వము=A Poem  composed  in

   fantastic form ; either in shape of a sworal(ఖడ్గ

బంధం),or  a serpent(నాగబంధం).

బంధం:a kind of poetical composition.కావ్యరచనావిశేషం.

  చిత్ర బంధాల గురించి పరిశోధించిన మహాపండిత పరిశోధకులు

వి.బాల సుబ్రమణియన్ గారు 'చిత్రబంధ' శబ్దిలను

ఇలా వివరించినారు----

   ' chitra bandha means a verse inscribed a

picture  according to specific  rules.

     'బంధం' అనే శబ్దానికి అనేక అర్థాలున్నాయి.వాటిలో పది ఆర్థాలు

ఇలా ఉన్నాయి.వాటి అర్థాన్ని బంధకవిత్వంతో సమన్వయించి చూద్దాం-

1బంధం=కట్టు, నిబంధనం       

*పద్యాన్ని ఆకారంగా నిబంధించడం.

2బంధం=దారం, తాడు , సూత్రం   

*పద్యసూత్రంతో ఒక ఆకారాన్ని                                                                         నిబంధించడం.

3బంధం= సంకెల ,  గొలుసుకట్టు.    ---

4బంధం=నిర్మాణం.

*చిత్తరువుకు అనుగుణంగా పద్యాన్ని

                 నిర్మాణం  చేయడం.               

5బంధం=సంబంధం.

*చిత్తరువుకు,పద్యానికి సంబంధం ఏర్పరచడం.

6బంధం=కూర్పు.

*ఒకటిగా కూర్చుట.(ఉదా:అంజలిబంధం)చిత్రాన్ని-

                   బంధాన్ని ఒకటిగ కూర్చడం.

7బంధం=ఒద్దిక,ఐకమత్యం,.ఆనురూప్యం.

*పద్దెం+చిత్తరువు ఒద్దికగా/  ఐకమత్యంగా/

                      ఆనురూప్యంగఉండడం.

అక్షరాలు+ఆకారాలు ఐకమత్యంగ ఉండడం.   

8బంధం=సంయోగ విశేషం,

*రతి/కళా శాస్త్ర సంబంధంగ84 బంధాలు

           చెప్పినారు,ఉదా:నాగపాశబంధం.

              పాములవలె పెనవేసుకోవడం.

           వాటిలాగే ఒక ఆకారంతో ఒక పద్యం

           పెనవేసుకొని అద్భుత

           రసాన్ని ఆవిష్కరించడం.

9బంధం=చిత్రాలంకార విశేషం.

*కావ్యకన్యకు ఒక చిత్రమైన అలంకార

              విశేషం.చిత్తరువుతో కూడిన అలంకార విశేషం.

10బంధం=దేహం.

*శరీరం(ఆత్మ)అనేఆకారంలోఆత్మను(అక్షరంపద్యం)

                         నిలపడం.

        పూర్వోక్త విషయాలన్నిటినీ పరిశీలిస్తే తెలిసిన సారాంశం-----

పద్మం,ఖడ్గం మొదలయిన ఆకారాల రెఖాచిత్రాలు నిర్మించి అందులో

పద్యాల అక్షరాలను నియమంగా కూర్చడం బంధకవిత్వం/చిత్రబంధం.

బొమ్మ  పోకడనుబట్టి  అంటే  బొమ్మ యొక్క  రేఖాచిత్రంలోని

కూడలి/సంగమ స్థానాలలో ఆవృత్తిఅయ్యే అక్షరాలను(repeted

letters)ఎంపిక చెసుకొని పద్యరచన సాగుతుంది.అలా రచించిన

పద్యాలను "బంధకవిత్వం' అంటారు. "బంధకవిత్వం"అనే పద బంధంలో

'కవిత్వం' శబ్దం గౌణం ఇక్కడ కవిత్వం అంటే  పద్యం  అని. భావించడం సబబు.

కవి అంటే పద్యం చెప్పేవాడు అనే భావన ఉండేది .‌బంధంగా

పద్యం ఉంటుంది కనుక దానిని బంధకవిత్వం అన్నారు.                         

  It  is  a  happy marriage of a  picture and  poetry.

చిత్రానికీ పద్యానికీ ఉన్న ముడి. బంధం.అది ఆనంద వివాహ బంధం.

               సమర్పణ:వైద్యంవేంకటేశ్వరాచార్యులు