Jump to content

బకుడు

వికీపీడియా నుండి

బకుడు ఏకచక్రపురము అను ఒక అగ్రహారమునకు సమీపమునందు ఉండు అడవిలో చేరి ఆయగ్రహారమునందలి బ్రాహ్మణులను హింసించుచు ఉండఁగా వారు ఇలువరుసను దినదినము ఒక్కఁడొక్కఁడు ఒక బండెఁడు అన్నమును రెండు ఎనుఁబోతులను కొనిపోయి ఈరాక్షసునికి ఆహారము అగునట్లు ఒడంబడిక చేసికొని ఆచొప్పున నడపుచు ఉండిరి. అంత కొంతకాలమునకు పాండవులు దుర్యోధనుని కపటోపాయముచే కాల్పఁబడిన లక్కయింట చావు తప్పించుకొని పోయి బ్రాహ్మణవేషములతో ఆయగ్రహారమున ఒక బ్రాహ్మణునియింట నివసించిరి. ఆ కాలమునందు వీరు ఉండెడు ఇంటి బ్రాహ్మణుని వంతు వచ్చెను అని ఆ బ్రాహ్మణుఁడు తనకు కలిగిన ఇద్దఱు పసిబిడ్డలను తన భార్యను పంపనేరకయు తానుపోవుటకును మనసు రాకయు చింతించుచు ఉండఁగా పాండవుల తల్లి అగు కుంతి ఆవృత్తాంతము విని భీముని పంపినయెడ ఆరాక్షసుని చంపివచ్చును. అంతటితో బ్రాహ్మణుల బాధ తీఱును, అని ఎంచి ఆ బ్రాహ్మణునితో నాకు అయిదుగురు కొడుకులు ఉన్నారు గదా వారిలో ఒకనిని పంపెదను అని చెప్పి భీముని పంపెను. వాఁడు పోయి బకాసురుని చంపి వచ్చెను. అంతట ఆయగ్రహారమునందలి బ్రాహ్మణులు అందఱు సంతోషించి అతనిని బహువిధముల దీవించిరి..

  • 2. బకుడు ఒక రాక్షసుడు. బృందావనమునందు కృష్ణుఁడు ఉండగా కంసుని పంపున అచ్చటికి వచ్చి బకరూపధారియై అతనిని మ్రింగఁబోయి అతనిచే చంపఁబడెను.
  • 3.బకుడు వసుదేవుని తమ్ముఁడు అయిన కంకుని జ్యేష్ఠపుత్రుఁడు.

...................పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య)

"https://te.wikipedia.org/w/index.php?title=బకుడు&oldid=3879596" నుండి వెలికితీశారు