భారత దేశ అల్పాహార వంటకాలలో ప్రసిద్ధమైనది బజ్జీ. ఇవి మెత్తగా ఉంటాయి. వీటితో పోలిస్తే పకోడీలు గట్టిగా కరకరలాడుతూ ఉంటాయి. కారంగా రుచికరంగా ఉండి, పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. బజ్జీలను బంగాళాదుంపలు, వంకాయలు, కాబేజీ, ఉల్లిపాయలు మొదలైన కాయగూరలు, కోడి గుడ్డుతో నైనా చేసుకోవచ్చును. అయితే చేసుకొనేదేదయినా వాటిని శుభ్రం చేసిన తర్వాత సన్నగా కోసుకొన్న తరువాత మాత్రమే ముద్దలో ముంచి వేయించాలి. లేకపోతే ఉప్పు కారం పట్టదు. ఇవి శెనగపిండితో చేస్తారు కావున తేన్పులతో బాధపడుతిన్న కొందరికి పడవు.
అతిపెద్ద ఉల్లిపాయ బజ్జీకి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ 2011 లో స్థానం లభించింది. బ్రాడ్‌ఫోర్డ్‌లో తయారు చేసిన ఈ బజ్జీ 102.2 కిలోల (225 ఎల్బి 4.9oz) బరువు కలిగి ఉంది.[1]