బద్రీ దత్ పాండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పండిట్ బద్రీ దత్ పాండే (1882 ఫిబ్రవరి 15 - 1965 జనవరి 13) భారతీయ చరిత్రకారుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. స్వాతంత్ర్యానంతరం అల్మోరా నుండి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యాడు .

గోవింద్ వల్లభ్ పంత్ తో పాటు, కుమావో (బ్రిటిష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిన్సులలో కొంత భాగం) ప్రాంతం నుండి ఉద్భవించిన రాజకీయ నాయకులలో పాండే ఒకడు. అతను కుమావో కేసరిగా ప్రసిద్ధుడు. ఇప్పటికి అలాగే గుర్తుండిపోయాడు. 1921 లో "కూలీ-బేగార్ ఉద్యమం" లో నిర్వహించిన పాత్ర తర్వాత అతనికి ఈ బిరుదు లభించింది. అతను అల్మోరా అఖ్‌బార్ అనే వార్తాపత్రికకు సంపాదకుడుగా పనిచేసాడు. ప్రభుత్వ వ్యతిరేక వైఖరికు గను బ్రిటిష్ పాలకులు దాన్ని మూసివేసారు. ఆ తర్వాత చందాలు సేకరించి, 1918 అక్టోబరు 15 విజయదశమి రోజున "శక్తి" అనే కొత్త వార్తాపత్రికను మొదలుపెట్టాడు. [1] ఆ రోజుల్లో కుమావో సమాజంలో నాయక ప్రథా అనే సామాజిక దురాచారం ప్రబలంగా ఉండేది. నాయక కుటుంబాలు తమ కుమార్తెలను వ్యభిచారానికి విక్రయించడమే ఆ దురాచారం. బద్రి దత్ దీనికి వ్యతిరేకంగా పోరాడాడు. చివరికి ఈ దురాచారాన్ని ఆపేందుకు చట్టాన్ని రూపొందించాడు.

కుమావో చరిత్రపై హిందీలో ఆయన కుమావోన్ కా ఇతిహాస్ అనే పుస్తకం రాసాడు. [2]

మూలాలు[మార్చు]

  1. "Govt. P.G. College, Bageshwar". www.gpgcbageshwar.org. Retrieved 2015-09-04.
  2. "Kumaon ka Itihas".