Jump to content

బర్మీస్ భాష

వికీపీడియా నుండి
(బర్మీస్‌ భాష నుండి దారిమార్పు చెందింది)
Barman Thar
Barman Thar
ఉచ్ఛారణ/bɔɾmɔn thaɾ/
స్థానిక భాషArunachal Pradesh, Assam, Meghalaya, Nagaland
ప్రాంతంNortheast India, Kamarupa
స్వజాతీయతBarman Kacharis
స్థానికంగా మాట్లాడేవారు
24,237
Assamese alphabet (presently used)
Sylheti Nagri (formerly used)
భాషా సంకేతాలు
ISO 639-3
బర్మన్ థార్ స్క్రిప్ట్


బర్మీస్‌ భాష దానికి సన్నిహిత సంబంధమున్న లోలో మాండలికాలూ, బర్మా, దాని పరిసర దేశాల్లో వినబడే కచినిష్‌, కుకిష్‌ భాషలూ సీవా-టిబెటన్‌ భాషాకుటుంభానికి చెందిన టిబెటన్‌ - బర్మన్‌ వర్గానికి సంబంధించినవి.ఇందులో అరకానీజ్‌, దాను, ఇంథాఅత్సి,లాషీ, మారు మొదలయిన మాండలికాలు ఉన్నాయి[1]. ఆధునిక ప్రామాణిక బర్మీస్‌ భాష పురాతన బర్మీస్‌తో పోల్చీ చూస్తే మిగతా మాండలికాల కన్న ఎక్కువ మార్పు చెందింది. బర్మీస్‌ పదాలు చాలా వరకు ఏకాక్షార పదాలు బర్మీస్‌ స్వరప్రధానమైన భాష అంటే ఒకే పదానికి స్వరాన్ని బట్టి అర్థాలు మారుతాయన్నమాట.[2]

11వ శతాబ్ఢం మధ్యకాలం నుంచీ బర్మీస్‌ లిఖిత రూపంలో మనకు లభ్యం అవుతుంది. భారతీయ భాష అయిన పాళీ బర్మీయులకు పవిత్రమైన భాష అవడం చేత తమ భాషకు పాళీ లిపినే కొద్ధి మార్పులతో వారు స్వీకరించారు.

సాహిత్యం:

[మార్చు]

అతి ప్రాచీనమైన బర్మా సాహిత్యం శిలా శాసనాల్లో కనిపిస్తూంది. మిక్కిలి పురాతనమైన శాసనం1113నాటి ’మెయిజెయి’ లేక మయిన్కబాకు, బయౌక్‌క్వి. ఈ శాసనాలు సాధారణంగా వ్యక్తుల పేర అంకితం చేయబడ్డ సాంప్రదాయిక చిహ్నాలు. 15వ శతాబ్ది మధ్య భాగం నుంచి సృజనాత్మకమైన బర్మీస్‌ సాహిత్యం కనపడుతూంది. ఇది ప్రధానంగా తాటాకుల మీద గంటంతో వ్రాయబడేది. ఈ సాహిత్యానికి 19వ శతాబ్ధం వరకూ బౌద్ధ చక్రవర్తులే పోషకులు, గ్రంథకర్తలు.

బౌద్ధసన్యాసులు.బౌద్ధ మఠాలలో శిక్షితులయి ఆస్థానానికి చెందినవారూ,కవయిత్రులూ కూడా కొందరు ఉన్నారు. ఈ రచనలలో కొన్ని పద్య కావ్యాలుగా వ్రాసిన బౌద్ధ జాతక కథలు(ప్యో), కొన్ని బౌద్ధ మత గ్రంథాలు ఆధారంగా వ్రాసిన పద్య నీతికథలు, కొన్ని స్తుతు పద్యాలు(మాగాన్‌), కొన్ని చారిత్రక పదాలు (ఎగియిన్‌), కొన్ని ప్రకృతి ప్రేమగేయాలు(యదు), కొన్ని టే-దత్‌, దాన్‌-వో,లే-చో, ద్వే-చో,బా-లే అనబడే చిన్నచిన్న గేయాలు. ఇవి గాక కొన్ని లేఖలూ(మియిట్టన్జా), కొన్ని ఆస్థానంలో ప్రదర్శనకు యోగ్యంగా ఉండే రూపకాలూ, కొన్ని ప్రాచీన రంగస్థల నాటకాలూ (ప్యా-జప్‌)కూడా ఉన్నాయి. అందులో 50 కి పైగా పద్య రచనలతో కూడినవి. బౌద్ధధర్మాసక్తి, ఆస్థానోచితమైన భాషా మాధుర్యాలు వీటి ప్రత్యేక లక్షణాలు.

ఈ యుగంలో పద్యకావ్యాలు విరివిగా రాయబడ్డా వచనం ఊపేక్షించలేదు.అందులో చాలాబాగం పాళీ భాషలోని జాతక కథలకు,బర్మీయ పూర్వ చరిత్రలకు అనువాదాలూ.చిన్నచిన్న వాక్యాలతో,శిథిల బంధం గల వాక్యాభాగాలతో,నిరంకుశాలైన విరామ చిహ్నాలతో ఈ వచన రచన సాగింది.

1870లో దుగువ బర్మాలో ముద్రణాలయాలు స్థాపించబడడంతో సాహిత్య చరిత్ర ఒక పెద్దమలుపు తిరిగింది.1875 నుంచి వెనుకటి పద్య గ్రంథాల స్థానాన్ని నవలలు, కథానికలు, ఆక్రమించాయి.1920లో రంగూన్‌ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. అప్పటి నుంచి క్రొత్తతరం రచయితలు పద్యం,కథ,వ్యాసం, మొదలయిన ప్రక్రియలతో ఆధునిక బర్మా వాజ్ఞ్మయాన్ని సుసంపన్నం చేశారు. అనువాదాలూ, అనుసరణల ద్వారా ఇతర దేశాల సాహిత్యం బర్మీయులకు అందుబాటులోకి వచ్చింది. 1948 లో బర్మా యూనియన్ స్థాపించబడడంతో జాతీయ సంస్కృతి పట్ల అభిమానం, ప్రత్యేక శ్రద్ధ వ్యక్తం అయాయి. అధికార భాషగానూ, బోధనా భాషగానూ ఇంగ్లీషు బదులుగా బర్మీస్‌ భాషనే వాడనారంభించారు. ప్రభుత్వం కూడా భాషాభివృద్ధికి ప్రోత్సాహాన్నిస్తూ, ఉత్తమ శ్రేణికి చెందిన బర్మీస్‌ నవలలకు బహుమతుల నీయ ఆరంభించింది.

మూలాలు:

[మార్చు]
  1. https://en.wikipedia.org/wiki/Barman_language#cite_note-:0-1
  2. విజ్ఞాన సర్వస్వం విశ్వసాహితి సంపుటం-5,. Registrar,Telugu University,Public gardens,Hydeabad 500004.: telugu University,. 1994. p. 830. ISBN 81-86073-09-4.{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: location (link)