Jump to content

బర్రెలక్క

వికీపీడియా నుండి

బర్రెలక్కగా పేరొందిన మాదిగ కర్నె శిరీష తెలంగాణకు చెందిన నిరుద్యోగి, రాజకీయ నాయకురాలు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆమె ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్శించింది. ఆమెకు ఈ ఎన్నికలు పూర్తయ్యేదాకా ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని, అలాగే, ఆమె పాల్గొనే ఎన్నికల సమావేవాలకు సెక్యూరిటీ ఇవ్వాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని 2023 నవంబరు 24న ఆదేశించింది.[1]

కుటుంబ నేపథ్యం, ప్రాచుర్యం

[మార్చు]

తెలంగాణలోని పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన మరికల్ గ్రామానికి చెందిన బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. ఈమె తల్లి రోజు కూలీ, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఓపెన్ డిగ్రీ చదువుతూనే కుటుంబ పోషణలో సాయం చేయడానికి బర్రెలు (గేదెలు) కొనుక్కుని మేపేది.

ఎంత చదువుకున్నా ఉద్యోగాలు రావట్లేదనీ, దానికన్నా నాలుగు బర్రెలను మేపుకోవడమే మేలనీ వాటిని కొనుక్కున్నాననీ, కనీసం రోజుకు మూడు నాలుగు వందలైనా పాలు అమ్ముకుంటే వస్తాయని వివరిస్తూ వీడియో చేసి సోషల్ మీడియోలో పోస్టు చేయడంతో ప్రాచుర్యం పొందింది. దానితో శిరీషకు బర్రెలక్క అన్న పేరు వచ్చి అదే స్థిరపడిపోయింది.

మూలాలు

[మార్చు]
  1. "శిరీష(బర్రెలక్క)కు భద్రత కల్పించండి: తెలంగాణ హైకోర్టు | High Court Hearing On Karne Sirisha Barrelakka Petition Kollapur - Sakshi". web.archive.org. 2023-11-24. Archived from the original on 2023-11-24. Retrieved 2023-11-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)