బాపూసాహెబ్ పఠారే
బాపూసాహెబ్ పఠారే | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది | ||
---|---|---|---|
తరువాత | జగదీష్ ములిక్ | ||
నియోజకవర్గం | వడ్గావ్ శేరి | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2024 | |||
ముందు | సునీల్ టింగ్రే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | ఎన్‌సీపీ - ఎస్‌పీ (2024 సెప్టెంబర్ 17 నుండి)[1] | ||
ఇతర రాజకీయ పార్టీలు |
| ||
సంతానం | సురేంద్ర పఠారే |
బాపుసాహెబ్ తుకారాం పఠారే ( బాపు పఠారే, బాపుసాహెబ్ పఠారే అని కూడా పిలుస్తారు) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు వడ్గావ్ శేరి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]బాపూసాహెబ్ పఠారే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వడ్గావ్ షెరీ సర్పంచ్‌గా ఆ తర్వాత పూణే మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఎన్నికై స్టాండింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వడ్గావ్ శేరి నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి అజయ్ జయవంత్ భోసలేపై 33,126 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[5]
బాపూసాహెబ్ పఠారే 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు 2019 అక్టోబర్ 15న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[6] ఆయన 2024 సెప్టెంబర్ 18న శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లో చేరి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వడ్గావ్ శేరి నుండి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ టింగ్రేపై 4,710 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Former BJP MLA Bapusaheb Pathare rejoins Sharad Pawar's NCP" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 18 September 2024. Archived from the original on 3 January 2025. Retrieved 3 January 2025.
- ↑ "The local political dynasties" (in ఇంగ్లీష్). The Indian Express. 17 March 2013. Archived from the original on 25 August 2021. Retrieved 3 January 2025.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "NCP MLC, ex-MLA join BJP ahead of Maharashtra polls" (in ఇంగ్లీష్). Deccan Herald. 15 October 2019. Archived from the original on 3 January 2025. Retrieved 3 January 2025.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Vadgoan Sheri". 23 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
- ↑ "Vadgaon Sheri election result 2024: NCP (SP)'s Bapusaheb Pathare secures victory over NCP's Sunil Tingre". The Times of India. 23 November 2024. Archived from the original on 3 January 2025. Retrieved 3 January 2025.