బాబూరావు కదమ్
బాబూరావు కదమ్ కోహ్లికర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | జవల్‌గావ్‌కర్ మాధవ్‌రావు నివృత్తిరావు పాటిల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | హడ్‌గావ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 26 జూన్ 1979 భండారా, మహారాష్ట్ర | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
బాబూరావు కదమ్ కోహ్లికర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు 2024 శాసనసభ ఎన్నికలలో హడ్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]బాబూరావు కదమ్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో హడ్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనకు 2014 ఎన్నికల్లో శివసేన ఏబీ ఫారం ఇవ్వగా, ఆయన అభ్యర్థిత్వంపై శివసేనలో జరిగిన పరిణామాల వల్ల తన ఏబీ ఫారాన్ని నాగేష్ పాటిల్ అస్తికార్‌కు ఇచ్చి పోటీ నుండి తప్పుకున్నాడు.
బాబూరావు కదమ్‌కు 2019 శాసనసభ ఎన్నికలలో శివసేన టికెట్ దక్కకపోవడంతో హడ్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఐఎన్‌సీ అభ్యర్థి జవల్గావ్కర్ మాధవరావు నివృత్తిరావు పాటిల్ చేతిలో 13363 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన మహారాష్ట్రలో 2022లో జరిగిన రాజకీయ పరిణామాల తర్వాత శివసేన షిండే గ్రూపులో చేరాడు.
బాబూరావు కదమ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో హింగోలి లోక్‌సభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి నగేష్ బాపురావ్ పాటిల్ అస్తికార్ చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయి,[1] 2024 శాసనసభ ఎన్నికలలో హడ్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి ఐఎన్‌సీ అభ్యర్థి మాధవరావు పాటిల్‌పై 30,067 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India (4 June 2024). "Lok Sabha 2024 Election Results: Hingoli". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ Maharashtra Times (23 November 2024). "नांदेडात वारं फिरलं, तीन वेळा पराभूत झालेल्या बाबुरावांचे नशीब उजळले; काँग्रेसच्या उमेदवारावर घेतली मोठी आघाडी". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ The Times of India (23 November 2024). "Hadgaon Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Hadgaon" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.