బారు అలివేలమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బారు అలివేలమ్మ
రాజమండ్రి స్వాతంత్ర్య సమరయోధుల పార్కులోని బారు అలివేలమ్మ విగ్రహం
జననంసెప్టెంబర్ 1897
మరణం1973 నవంబర్ 13
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధురాలు
రాజకీయ పార్టీఇండియన్ నేషనల్ కాంగ్రెస్
జీవిత భాగస్వామిబారు రాజారావు
పిల్లలువెంకట గోవిందరావు, కృష్ణారావు, శేషగిరమ్మ, శారద, శాంత
తల్లిదండ్రులు
  • పత్రి కృష్ణారావు (తండ్రి)
  • పత్రి వెంకూబాయమ్మ (తల్లి)

బారు అలివేలమ్మ (1897 - 1973) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు.[1]

కుటుంబ నేపథ్యం[మార్చు]

అలివేణమ్మ 1897 సెప్టెంబరులో జన్మించారు. ఆమె స్వస్థలం కాకినాడ. ఈమె 1897 సంవత్సరం పత్రి కృష్ణారావు, వెంకుబాయమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి పత్రి కృష్ణారావు, తల్లి వెంకూబాయమ్మ. అలివేణమ్మ భర్త బారు రాజారావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేశారు. ఆమె కుమారుడు వెంకట గోవిందరావు కూడా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఈమె 1973 నవంబరు 13 తేదీన మరణించారు.

స్వాతంత్ర్యోద్యమంలో[మార్చు]

అలివేలమ్మ కమలా నెహ్రూతో కలిసి అలహాబాదులో విదేశీ వస్త్రబహిష్కరణోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజమండ్రిలో స్త్రీలకు స్వాతంత్ర్యోద్యమం గురించి ప్రచారం చేశారు. అలివేలమ్మ బహు భాషా కోవిదురాలుగా గుర్తింపు పొంది, మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేశారు.[2] విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, కఠిన కారాగారశిక్షను అనుభవించిన నాయకురాలు బారు అలివేలమ్మ.

సంస్మరణ[మార్చు]

ఈమె విగ్రహాన్ని రాజమండ్రిలోని పాల్‌చౌకులో ఉన్న సాతంత్ర్య సమరయోధుల పార్కులో ఆవిష్కరించారు.[3] ఈ విగ్రహం కింద ఏర్పాటుచేసిన ఫలకంలో ఆమె జీవితవిశేషాలు, స్వాతంత్ర్య సమరంలోనూ, సంఘసంస్కరణలోనూ చేసిన కృషి వంటివి సవివరంగా చెక్కించారు. 2002 ఫిబ్రవరి 3న ఆమె వారసుల సౌజన్యంతో ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాటి సబ్ కలెక్టర్ వి.శేషాద్రి ఆవిష్కరించారు.

మూలాలు[మార్చు]

  1. "రాజమండ్రి వెబ్ సైటులో బారు అలివేలమ్మ జీవితచరిత్ర టూకీగా". Archived from the original on 2013-06-30. Retrieved 2013-03-12.
  2. "స్వాతంత్ర్య సమరంలో నారీ భేరి - ఆంధ్రప్రభ ఆగష్టు 15, 2011". Archived from the original on 2013-01-04. Retrieved 2013-03-17.
  3. http://www.manarajahmundry.com/tourism/view/146/PARKS-@-RAJAHMUNDRY...html