Jump to content

బాలగంగాధర్ తిలక్ పుస్తకాలయం

వికీపీడియా నుండి
(బాలగంగాధర తిలక్ పుస్తకాలయము నుండి దారిమార్పు చెందింది)
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు

బాలగంగాధర్ తిలక్ పుస్తకాలయం, రేపల్లె తాలూకా, పెదపులివర్రు గ్రామంలోని ప్రాచీన గ్రంథాలయం, [1]1932లో జరిగిన ఈ గ్రంథాలయం వార్షికోత్సవ సభకు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు అధ్యక్షత వహించాడు. ఆ సభలో కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం, లంక సుందరం, వేదాంతం శంభుశాస్త్రి, మంతెన వెంకటరాజు మొదలైన ప్రముఖులు హాజరయ్యారు[2]..

ఈ గ్రంథాలయం త్రయోదశ వార్షికోత్సవం 14-11-34 తేదీనాడు చెరుకువాడ వేంకటనరసింహం అధ్యక్షత క్రింద జరిగింది. అప్పుడు నివేదింపబడిన ఈ సంగతులను ప్రచురించుచున్నాము.

ఇది పదమూడు సంవత్సరములక్రిత మీ గ్రామమందు స్థాపింపబడింది. రూ. 130 లు విలువగల గ్రంథములను, రూ. 20 లు చేయు బీరువాను బ్రహ్మశ్రీ పండిత కాశీనాథుని రాజలింగశాస్త్రిగా రిచ్చిరి.

గ్రంథాలయోద్యమము యొక్క ప్రాశస్త్యమును గమనించి లోకోపకార మొనర్ప స్థితప్రజ్ఞఉలై కొవ్వూరునందుగల ఆంధ్రగీర్వాణ విద్యాపీఠమునకు రూ. 12,000 లు విరాళమొసగి వారు రచించిన గ్రంథములను మన గ్రంథాలయమునకు సహితము పంపుచు అభిమానమును వెల్లడించు మహానుభావులు శ్రీ వల్లూరి సూర్యనారాయణరావు పంతులు గారును పూజనీయులు.

సం||తములో 18 పాలకవర్గ సమావేశములును, 1 సన్మానసంఘ సమావేశమును జరిపి, 38 హంశములపై చర్చించి తీరుమానించారు.

స్త్రీ విద్యావ్యాప్తికిగాను ప్రత్యేక నౌకరును నియమించి, నియమానుసారము పుస్తకముల నిండ్లకందించి స్త్రీల యందు విజ్ఞానమును వృద్ధి చేస్తున్నారు.

1400 లకు పైగా గ్రంథములు 5 బీరువాలు కలిగి 10 పత్రికలు తెప్పించుచు పాఠకులు దినదినాభివృద్ధి యగుచున్నారు.

ఈ గ్రంథాలయమునకు 10 పత్రికలు వచ్చుచున్నవి. ఈ సంవత్సరము దాతలు 389 గ్రంథములను దయతో నొసంగిరి.

ఈ గ్రంథాలయమునకు 1921 సం|| జూలైలో కాలువ లంకలపాటలకు గ్రామములో నున్న భిన్నభావములను బహు ఓర్పుతో నేకీభవింపజేసి ఆ పాటలమీద వచ్చిన ఆదాయమును ఖర్చులతో రు 966-00 వసూలు పరచి అప్పుకు ఉన్న జాతీయ విద్యాలయమునకు గ్రంథాలయమునకు జాయింటుగానున్న ఖాతాకు శ్రీ కనగాల కృష్ణయ్య చౌదరిగారు ఇప్పించిరి. 1924 సం||రమునకు రు 100 లు మొత్తము రు 200-00 లు వడ్డీతోసహా. ది. 3-10-34 భట్టిప్రోలు వసూలు (దసరాభిక్షలు) శ్రీయుత భట్టిప్రోలు చంద్రశేఖరరావుగారు రు 0 అ 8; మద్దుల గిరిరావుగారు రు 1 అ 0; పాలకుర్తి సీతారామయ్యగారు రు 0 అ 8; మద్దుల నరసింహంగారు రు 0 అ 8

మూలాలు

[మార్చు]
  1. భారత డిజిటల్ లైబ్రరీ లో గ్రంథాలయ సర్వస్వము జనవరి 1935 పత్రిక కాపీ.
  2. ములుగు, కుమారస్వామి (20 October 1979). "వేదవిద్యల వ్యాఘ్రపురి పెదపులివర్రు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 198. Retrieved 30 December 2017.[permanent dead link]