బాలజేసు కేథడ్రల్, ఫిరంగిపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుంటూరు జిల్లాకు చెందిన ఫిరంగిపురంలోని ఫిరంగిపురం బాలజేసు కేథడ్రల్‌ ఆంధ్రప్రదేశ్‌లోకెల్లా అతిపెద్ద చర్చి, ఇది తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోకెల్లా రెండవ అతిపెద్ద చర్చి. ఈ చర్చి నిర్మాణానికి దశాబ్దాలుగా కృషిచేసిన ఫాదర్ థియోడర్ డిక్మన్ 1891లో పూర్తిచేశారు. జూలైలోనూ, క్రిస్మస్ సందర్భంగానూ ఇక్కడ జరిగే ఉత్సవాలు సుప్రసిద్ధం, లక్షలాది మంది భక్తులు హాజరవుతూంటారు.

చరిత్ర[మార్చు]

1846 నాటికే ఫిరంగిపురంలో చర్చి, దాని పరిధిలో 16 గ్రామాల క్రైస్తవం ఉండేది. 1840 అక్టోబరులో మద్రాసు ప్రభుత్వం ఫిరంగిపురంలో కేథలిక్ చర్చి నిర్మించేందుకు 14 ఎకరాల భూమి ఇనాంగా ఇచ్చారు. 1875లో లండన్ మిల్ హిల్ సభకు చెందిన ఫాదర్ థియోడర్ డిక్మన్ ఫిరంగిపురం వచ్చేనాటికి అక్కడి బాలజేసు చర్చి శిథిలావస్థలో ఉంది. దాన్ని చూసి బాధపడ్డ డిక్మన్ కు ఏసుక్రీస్తు తనను చర్చి నిర్మించమని ఆజ్ఞాపించిన ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. అప్పటి నుంచీ ఫిరంగిపురంలోనే జీవిస్తూ, చర్చి నిర్మాణానికి కృషి ప్రారంభించారు. 1891 నాటికి బాలజేసు కేథడ్రల్ నిర్మించారు.[1] ప్రస్తుతం ఇక్కడ బాలజేసు కేథడ్రల్ ఉన్న ప్రాంతాన్ని తుమ్మా పాపిరెడ్డి అనే భూస్వామి వంశీకులు దానం ఇచ్చారు.[2]

నిర్మాణం[మార్చు]

బాలజేసు కేథడ్రల్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద చర్చి, కాగా తెలుగు రాష్ట్రాల్లో రెండవ అతిపెద్దదిగా పేరొందింది.[1]

ఉత్సవాలు[మార్చు]

బాలజేసు కేథడ్రల్ దగ్గర్లో కొండపైన ఉండే కార్మెల్ మాత ఆలయంలో జూలై 14, 15, 16 తేదీల్లో ఉత్సవాలు జరుగుతూంటాయి. డిసెంబరు 23, 24, 25 తేదీల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. 24 తేదీ అర్థరాత్రి గుంటూరు బిషప్ చర్చిలో దివ్య బలిపూజ నిర్వహించి ఆ పూజను గుంటూరులో ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. వేడుకలకు వందలాదిగా మత గురువులు, వేలాదిగా భక్తులు హాజరవుతూంటారు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 ఆర్., దేవయ్య (25 డిసెంబరు 2016). "మరియ తనయా.. మధుర హృదయా." ఈనాడు ఆదివారం: 3. Retrieved 26 December 2016. Check date values in: |date= (help)
  2. రామిశెట్టి, శౌరయ్య (5 మార్చి 1991). బాలజేసు దేవాలయము శతవార్షికోత్సవ సంచిక. గుంటూరు: బాలజేసు దేవాలయం.